Sunday 8 September 2019

A.P.History Bits for APPSC, A.P.History Bits in Telugu.

శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు.

శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించారని మత్స్యపురాణం తెలుపుతుంది.

శాతవాహనుల రాజభాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాషగా అయ్యింది.

శాతవాహనుల రాజ లాంఛనం సూర్యుడు.

శాతవాహనుల రాజధానులు కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గర ఉన్న ధాన్యకటకం, ప్రతిష్ఠానపురం (పైఠాన్ మహారాష్ట్ర ).

శాతవాహనుల రాజులు వైదిక మతాన్ని అవలంబించినారు .

శాతవాహనుల రాణులు బౌద్ధ మతాన్ని అవలంబించారు.

శాతవాహనుల రాజులలో అత్యధిక కాలం అనగా 56 సంవత్సరాలు పరిపాలించిన రాజు పేరు రెండవ శాతకర్ణి.

శాతవాహన రాజుల లో అందరి కంటే గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి.

శాతవాహన రాజులలో చివరి రాజు పేరు మూడవ పులోమావి.

శాతవాహన రాజులలో గుహను తొలపించిన మొట్టమొదటి రాజు కృష్ణుడు లేదా కన్హడు.

శాతవాహన రాజులలో కవిరాజు అనే పేరు గలవాడు హాలుడు.

రెండవ శాతకర్ణి సాంచీ స్తూప దక్షిణ ద్వారానికి తోరణం చెక్కించినట్లు అతని శిల్పి ఆనందుడు, ఆ తోరణంపై శాసనం రాశాడు.

పులోమావి అనగా గడ్డి లో జన్మించిన వాడు అని అర్థం.

భూదానం చేసిన తొలి రాజులు శాతవాహనులు.

శాతవాహనుల కాలంలో నిగమసభలు నగర పరిపాలన నిర్వహించేవి.

శాతవాహన పాలన విభాగంలో చిన్న గ్రామాధికారిని గుల్మిక అని పిలిచేవరు.

ఆంధ్ర ప్రాంతంలో లభ్యమైన తొలి
శాతవాహన శాసనం అమరావతి శాసనం.

వస్తు సంచయంను భద్రపరిచే అధికారిని భాండారికుడు అని పిలిసే వారు.

హిరణ్యకుడు ద్రవ్య రూపం అయిన ఆదాయాన్ని భద్రపరిచే వాడు.

రాజ పత్రాలను, రాజ శాసనాలను రాస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పని చేసేవాడు లేఖకుడు.

శాతవాహన కాలంలో రాష్ట్రాలను ఆహారాలు అని పిలిచేవారు.

ఆహారాలకు అమాత్యులు పాలనాధికారులు. అయితే వీరికి వంశపారంపర్యత హక్కు లేదు.

శాతవాహన పరిపాలన విభాగాలలో అతి చిన్నది గ్రామం.

గ్రామానికి అధికారి గ్రామణీ పాలనధికారి.

శాతవాహనుల కాలంలో పట్టణాలనే నిగమాలంటారు. నిగమ పాలనా వ్యవహారాలను నిగమ సభలు అనే పౌరసభలు చూసేవి.

కుల పెద్దలను గాహపతులు అనేవారు.వీరు నిగమ సభలో సభ్యులుగా ఉండేవారు.

భట్టిప్రోలు శాసనంలో నిగమ సభ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది.

నానాఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య అయిన నాగానిక వేయించింది .ఈమె మహారాష్ట్ర నాయకుడు త్రణకైరో కుమార్తె.

నాసిక్ శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమీ బాలశ్రీ వేయించినది.దీనిని రెండో పులోమావి కాలంలో ప్రాకృత బాష లో వేయించింది.

గాథసప్తశతి శాతవాహన రాజు హాలుడు రచించాడు. ఇతనికి కవి వత్సలుడు అనే బిరుదు కలదు.

మ్యాకదోని శాసనాన్ని మూడవ పులోమావి వేయించాడు.ఇది బళ్లారి( కర్ణాటకలో) దొరికింది.

హాతిగుంప శాసనాన్ని కళింగరాజు అయిన ఖరవేలుడు వేయించాడు .

చిన గంజాం, నాగార్జునకొండ శాసనాలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. హర్షుని చరిత్రకారుడు బాణభట్టుడు ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు.

బృహత్కథ ని గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించాడు. ఇతను కుంతలశాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు.

కాతంత్ర వ్యాకరణంను శర్వవర్మ సంస్కృత భాషలో రచించాడు.దీనిని తన రాజు అయిన కుంతల శాతకర్ణి ఆరు నెలలలో సంస్కృత నేర్చుకొనుటకు రచించాడు.

వాత్సాయనుడు కామ సూత్రాన్ని సంస్కృత భాషలో రచించాడు.
కుంతల శాతకర్ణి తన భార్య మయావతితో జరిపిన శృంగార క్రీడలో మోటుగా ప్రవర్తించి ఆమె మరణానికి కారకుడయ్యాడు అని వాత్స్యాయనుడు తన కామసూత్ర గ్రంథంలో రాశాడు.

సమయసారం అనే గ్రంథాన్ని ఆంధ్ర దేశంలో మొట్టమొదటి జైనాచార్యుడైన కొండ కుందానాచార్యుడు ప్రాకృత భాషలో రచించాడు.

జునాగడ్ శాసనాన్ని, రుద్ర దమనుడు సంస్కృత భాషలో వేయించాడు.ఈ శాసనాన్ని బట్టి రుద్రదాముడు శివశ్రీ శాతకర్ణిని రెండు సార్లు ఓడించినట్లు తెలుస్తుంది . శివశ్రీ శాతకర్ణి రాజకీయ మనుగడ కోసం శక రుద్రాదాముని కుమార్తె రుద్రదమనికనుని వివాహమాడాడు.

Science and Technolgy Bits for APPSC Exams

భారత తొలి ఖండాంతర క్షిపణి పేరు అగ్ని -5. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి అణు బాంబులను ప్రయోగిస్తుంది.

బ్రహ్మోస్ -2 క్షిపణి ,ఒక హైపర్ సోనిక్ cruise మిస్సైల్ . దీని వ్యాప్తి ఎనిమిది వందల కిలోమీటర్లు.

రిసోర్స్ శాట్ ఒక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.

నిర్భయ్ ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలానికి ప్రయోగించే గల ఒక దీర్ఘ వ్యాప్తి క్షిపణి.

భారత నావికా దళం లో చేరిన చేరిన తొలి స్కార్పీన్ తరగతి జలాంతరగామి పేరు INS కల్వరి.

2019 సెప్టెంబర్ 24 నాటికి భారత తొలి అంగారక గ్రహ మిషన్ 'మంగాళ్ యాన్' 4 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.

2030 నాటికి భారత్ తన తొలి అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) ప్రయోగించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మూడు దేశాలు స్వయంగా స్పేస్ స్టేషన్లను ప్రయోగించాయి.

GSLV-MK-Ill, భారత్ యొక్క అత్యంత శక్తివంతమైన రాకెట్.ఇది 4 టన్నుల pay load ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశ పెడుతుంది . దీనికి క్రయోజనిక్ ఇంజన్ కలిగి ఉంటుంది.

ISRO తొలి చైర్మన్ పేరు విక్రమ్ సారాభాయ్.

PSLV సహాయంతో ఇస్రో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది.

105వ ఇండియన్ science కాంగ్రెస్ ఇంపాల్ లో జరిగింది.

ISRO , రిశాట్ 2బి ఉపగ్రహాన్ని ఇటీవల PSLV-C46 రాకెట్ ద్వారా ప్రయోగించింది.

భారత్లో డ్రోన్లను నియంత్రించే శాఖ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్.

భారత సైన్యం తో ధనుష్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన దీర్ఘ శ్రేణి ఆర్టిలరీ గన్.దీని గరిష్ట వ్యాప్తి 38 కిలోమీటర్లు . దీన్నే దేశీ బోఫోర్స్ అని కూడా అంటారు.

గురుత్వ తరంగాల పై పరిశోధన చేసే అంతర్జాతీయ LIGO ప్రాజెక్టులతో సంబంధం ఉన్న భారతీయ సంస్థలు Institute of plasma research- గాంధీ నగర్, Inter university center for astronomy and astrophysics- పూణే, Raja Ramanna center for advanced technology- ఇండోర్.

1956లో ప్రారంభించిన భారత తొలి అణురియాక్టర్ 'అప్సర' ని BARC-ముంబై లో స్థాపించారు.

వయసు మళ్ళిన వారి బాగోగుల కు సంబంధించిన ఆండ్రాయిడ్ ఆధారిత CARE4U ని అభివృద్ధి చేసిన సంస్థ ఐఐటీ ఖరగ్ పూర్.

చంద్రయాన్-2 లోని లాండర్ పేరు విక్రమ్ , రోవర్ పేరు praghyan.

Astra- గగనతలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి.

సాగరిక ఒక సబ్మెరైన్ నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి.

ధనుష్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి.

నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్.

ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్.

బ్యాటరీ ఆధారంగా నడిచే భారత్ కు చెందిన తొలి కారు పేరు రేవా.

Li-Fi విధానంలో సమాచారం దృశ్య కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.

అణుశక్తి ఆధారంగా నడిచే దేశీయ రెండో జలాంతర్గామి INS అరిద్ మాన్.

Rustom-2 ఒక డ్రోన్.

Current Affairs in Telugu, Current Affairs for APPSC

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 6న సింగపూర్ లో మరణించారు.

1980కి ముందు జింబాబ్వే, రోడీషియా పేరిట బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది.

భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరింది.

ఏడాది వ్యవధిలో భారతదేశ జనాభా 1.45 కోట్లు పెరిగింది.

జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా 2017 సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 22.26 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది.

6.56 లక్ష కోట్ల జనాభాతో సిక్కిం చివరి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ 5.23 కోట్ల జనాభాతో పదవ స్థానంలో ఉంది .

ఆంధ్రప్రదేశ్ లో నమోదైన జనాలలో తూర్పుగోదావరి, కర్నూలు వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ,మరణాల్లో గుంటూరు తూర్పు గోదావరి వరసగా ముందున్నాయి.

రష్యాలో దూర ప్రాచ్య( ఫార్ ఈస్ట్) ప్రాంతాలుగా పిలిచే తూర్పు రాష్ట్రాలు అభివృద్ధి కోసం భారత్ ఒక బిలియన్ డాలర్లు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వనుంది .
రష్యా లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 5న తూర్పు తీర నగరమైన వ్లాదివొస్తోక్లో జరిగిన అయిదవ తూర్పు ఆర్థిక వేదిక (ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం-EEF) సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు.

జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అలాగే మంగోలియా అధ్యక్షుడు ఖాల్త్ మాగీన్ మట్టుగ్లా తో కూడా మోడీ సమావేశమయ్యారు.

స్వచ్ఛ్ మహోత్సవ్ తొలి పురస్కారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్కింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - పరిశుభ్రత పథకం కింద కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్యం(జల్ శక్తి) దేశవ్యాప్తంగా మూడు ప్రాథమిక కేంద్రాలను ఎంపిక చేయగా వేల్పూర్ పి.హెచ్.సి స్థానంలో నిలిచింది.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సెప్టెంబర్ 5న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు న్యూఢిల్లీలో పురస్కారాలను ప్రధానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.

జైష్-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజహర్, లష్కర్-ఎ-తయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న మాఫియా లీడర్ దావూద్ ఇబ్రహీం లను సెప్టెంబర్ 4న భారత ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది.


Current Affairs in Telugu, Current Affairs for APPSC

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ V. K. రమణి రాజీనామా చేశారు.

మేఘాలయ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ A.K.Mittal ను ఆమె స్థానంలో నియమించారు.

దేశంలో నాలుగో అతిపెద్ద హై కోర్ట్ గా మద్రాస్ హైకోర్టు పేరుగాంచింది.

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ సి ప్రవీణ్ కుమార్.

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిలి సై సౌందర రాజన్ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ ఆర్ఎస్ చౌహన్.

దేశంలో ప్రతి ఇంటికి 2024 నాటికి త్రాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతోనే జల్ జీవన్ మిషన్ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

పి ఎమ్ ఉజ్వల యోజన కింద షేక్ రఫీక్ అనే మహిళకు 8 కోట్ల వ గ్యాస్ కనెక్షన్ అందజేశారు.

ఢిల్లీ ముంబై కారిడార్ లో భాగంగా 10 వేల ఎకరాలలో నిర్మించిన ఔరంగాబాద్ పారిశ్రామిక నగరం 'ఔరిక్ సిటీ ' ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.

దులీప్ ట్రోఫీను ఇండియా రెడ్ సొంతం చేసుకుంది ఫైనల్లో ఇండియా గ్రీన్ ను ఓడించింది.

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట కు చెందిన మత్స్యకార యువకుడు గోశాల రాజు దక్షిణాఫ్రికా లోని కిలిమంజారో పర్వతాన్ని తాజాగా అధిరోహించాడు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమలు ఉత్పత్తి అవుతున్న కార్లు చెన్నై రేవు ద్వారా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు.

Literacy in Andhra Pradesh

అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలో 23వ స్థానంలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం 67.41

పశ్చిమ గోదావరి జిల్లా 74.63 శాతం తో మొదటి స్థానంలో ఉంది,తరువాత కృష్ణాజిల్లా 73.74 శాతంతో రెండవ స్థానంలో,మూడో స్థానంలో చిత్తూరు జిల్లా ఉంది.

చివరి మూడు స్థానాలలో శ్రీకాకుళం,కర్నూలు మరియు విజయనగరం ఉన్నాయి.

మహిళా అక్షరాస్యత లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది.