ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ? పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి?42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో
రాజ్యాంగంలో ఏ అధ్యాయంలో ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? IV-A అధ్యాయంలో 51-ఎ నిబంధనలో
ఏ కమిటీ సిఫార్సుల మీద ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మీద
ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఏ విషయంలో సారూప్యం ఉంది? రెండింటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేము
ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరములలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించుట ఆ పిల్లల తల్లిదండ్రుల లేదా సంరక్షకుని బాధ్యతగా చేర్చారు.- 86వ రాజ్యాంగ సవరణ
ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని అంశాలున్నాయి ?
పదకొండు అంశాలు
ప్రాథమిక విధులను ఏ ప్రధానమంత్రి హయంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? ఇందిరాగాంధీ
ప్రజా ప్రయోజనాల' వ్యాజ్యం అను భావనను ఏ దేశం నుండి గ్రహించారు ? అమెరికా
ప్రాథమిక విధులను జస్టీస్ వర్మ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు ? 1999
ప్రతి ఏడాది ఏ తేదిన ప్రాధమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 3
ప్రాథమిక విధులను ఏ సంవత్సరం నుంచి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది? 1976
స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాధమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచమని సిఫార్సు చేసింది ? 8
11 ప్రాధమిక విధిని ఏ సంవత్సరం నుంచి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 2002
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ నిబంధనను రాజ్యాంగంలో పొందుపర్చారు ?నిబంధన 51-ఎ
ప్రాథమిక విధులు ఏ హక్కులపై పరిమితులుగా పని చేస్తాయి? ప్రాథమిక హక్కులు
6-14 సం|లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విధిగా చదువు చెప్పించాలని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయడం జరిగింది ? 86వ రాజ్యాంగ సవరణ
పదకొండవ ప్రాథమిక విధిని ఏ రోజున రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? 2002, డిసెంబర్ 12న
ప్రాథమిక హక్కులు, ప్రాధమిక విధులు ఒకే నాణానికి ఇరువైపులు వంటివి అని ఎవరు పేర్కొన్నారు ? హెచ్.జె.లాస్కి
ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాలు మాత్రమే అన్నది ఎవరు? డి.కె. బారువా
జాతీయ జెండాను ఎగురవేయడం కూడా భావ వ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ?
నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)
నూతన ఫ్లాగ్ కోడ్ ఏ రోజు నుండి అమలులోకి వచ్చింది ? జనవరి 26
No comments:
Post a Comment