Showing posts with label AP Economic Survey. Show all posts
Showing posts with label AP Economic Survey. Show all posts

Thursday, 18 April 2013

AP Economic Survey, AP Economic Survey 2012-13, 2012-13 AP Economic Survey, AP Economic Survey in Telugu



2012-13 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సర్వే


2012-13  ముందస్తు అంచనాల ప్రకారం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (2004-05 స్థిర ధరల వద్ద)- 4,26,470 కోట్లు.

2012-13 లో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో వృద్ధి రేటు -5.29 శాతం.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు -1.96 శాతం.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  రాష్ట్ర పారిశ్రామిక రంగం వృద్ధి రేటు -0.73 శాతం.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు - ****శాతం.

2012-13లో  స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా- 18.7 శాతం.

2012-13లో  స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా- 23.6 శాతం.

2012-13లో  స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో సేవల రంగం వాటా- 57.7 శాతం.

2012-13  ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం(ప్రస్తుత ధరలలో)- రూ.77,277.

2012-13లో  రాష్ట్ర తలసరి ఆదాయం (2004-05 స్థిర ధరలలో)- రూ.44,110.

రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా- హైదరాబాద్(రూ.99,706)

రాష్ట్రంలో అత్యల్ప తలసరి ఆదాయం గల జిల్లా- శ్రీకాకుళం(రూ.39,293)

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  సవరించిన అంచనాల ప్రకారం పన్నుల ఆదాయం రూ.62,572 కోట్లు.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  పన్నేతర ఆదాయం - రూ.12,864 కోట్లు.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం రెవిన్యూ వ్యయం-1,07,815 కోట్లు.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  ద్రవ్యలోటు - రూ.21,129 కోట్లు( జి.ఎస్. డి. పి.లో 2.46 శాతం).

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  పన్నుల ఆదాయ వృద్ధిరేటు-17.43 శాతం.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో   రెవిన్యూ మిగులు-1686 కోట్లు.

2012-13 ఆర్ధిక సంవత్సరంలో  పన్నుల ఆదాయంలో అత్యధిక వాటా గల పన్ను- అమ్మకం పన్ను(రూ. 42,041 కోట్లు)

2012-13 ఆర్ధిక సంవత్సరంలో   కేంద్రం నుండి బదిలీ అయిన పన్నులురూ. 20,279 కోట్లు.

2012-13  లో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు- రూ.1,54,789 కోట్లు( GSDP లో 20.96 శాతం)

2012 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో గల మొత్తం చౌక ధరల దుకాణాలు-44,778.

రాష్ట్రంలో  మొత్తం రేషన్ కార్డుల సంఖ్య-2,49,43,646.

రాష్ట్రంలో  రూపాయికి కిలో బియ్యం పధకాన్ని ప్రారంభించిన తేదీ -1 నవంబర్, 2011.

రాష్ట్రంలో నికర సాగు భూమి-111.60 లక్షల హెక్టార్లు.

రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం- 62.36 లక్షల హెక్టార్లు.

2010-11లో  రాష్ట్రంలో సగటు కమతం సైజు-1.08 హెక్టార్లు.

2010-11లో  రాష్ట్రంలో మొత్తం కమతాల సంఖ్య-1.32 కోట్లు

2012లో రైతు చైతన్య యాత్రలకు కేటాయించిన నిధులు -341.87 లక్షలు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నిర్వహించే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ -1551.

2011-12 సంవత్సరంలో  రాష్ట్రంలో మొత్తం ఎరువుల వినియోగం-70.83 లక్షల టన్నులు.

2011-12 సంవత్సరంలో   అందించిన మొత్తం వ్యవసాయ ఋణాలు58,511 కోట్లు.

అక్టోబర్ 31, 2012 నాటికి రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన మెగా ప్రాజెక్ట్ లు -129.

2012 ఆగష్టు నాటికి రాష్ట్రంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు- రూ.41,293 కోట్లు.

రాష్ట్రంలో మొత్తం ప్రత్యేక  ఆర్ధిక మండళ్ళు -117.

సెజ్ ల ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉపాధి కల్పించబడ్డ వారి సంఖ్య-1,65,165.

2012 ఏప్రిల్-డిసెంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తుల సూచి విలువ-257.2

2011-12 సంవత్సరంలో   రాష్ట్రము నుండి జరిగిన మొత్తం ఎగుమతులు- రూ.1,16,103 కోట్లు.

2011-12 సంవత్సరంలో   రాష్ట్రము నుండి జరిగిన మొత్తం సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల విలువరూ. 40,646 కోట్లు.

రాష్ట్రంలో నోటిఫై అయిన మొత్తం ఐటీ సెజ్ లు-43.