Sunday 28 June 2020

పంచాయతీ రాజ్

గ్రామ పంచాయితీ విధులు పేర్కొనబడిన రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏది? 11వ షెడ్యూల్

ఏ రాజ్యాంగ సవరణ పంచాయితీరాజ్ సంస్థల నిర్మాణం గురించి వివరిస్తుంది ? 73వ

ఏ రాజ్యాంగ సవరణ మనదేశంలో నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది ? 74వ

ఆధునిక స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థలకు ప్రారంభంగా దేన్ని పేర్కొనవచ్చును? రిప్పన్ ప్రకటన (1882)

ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభలు పంచాయితీలకు తగిన అధికారాలను కల్పించే వీలు ఉంది? 243 (బి)

గ్రామ స్వరాజ్య సాధనలో తొలి ప్రయత్నంగా మనదేశంలో దేన్ని పేర్కొంటారు? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (CDP)

కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు? 1952, అక్టోబర్, 2

కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం స్థానిక ప్రభుత్వంలో ఏ అధికారి స్థానాన్ని సృష్టించింది? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (BDO) 

నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ (NDS) పథకం ఎప్పుడు మొదలైంది?  1953

CDP మరియు NES పథకాల సమీక్షకై ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ

భారత ప్రభుత్వం బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించింది? 16 జనవరి, 1957

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ప్రధాన సిఫారసులు ఏవి ?
గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలలో మూడంచెల పంచాయితీరాజ్ విధానం, పంచాయతీరాజ్ సంస్థలకు నిజమైన అధికార బదిలీ, తగినన్ని నిధులు ఈ సంస్థలు అందించటం, అన్ని అభివృద్ధి పథకాలను పంచాయితీరాజ్ సంస్థల ద్వారా అమలుపర్చటం

 బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం గ్రామ స్థాయిలో పంచాయతీ రాజ్ సంస్థ ఏది?  గ్రామపంచాయతీ

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ జిల్లా స్థాయిలో ఏ పంచాయితీరాజ్ సంస్థను ఉద్దేశించింది ? జిల్లా పరిషత్

పంచాయతీ సమితి ఏ స్థాయికి చెందిన స్థానిక స్వపరిపాలనా సంస్థ? బ్లాక్

పంచాయతీ రాజ్ విధానాన్ని దేశంలో మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు?రాజస్థాన్ లోని నాగౌర్

పంచాయతీ రాజ్ విధానాన్ని అమలు చేసిన రెండవ రాష్ట్రం ఏది?ఆంధ్రప్రదేశ్

పంచాయతీరాజ్ విధానం తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించారు? 2 అక్టోబర్, 1959

జనతా ప్రభుత్వం పంచాయతీరాజ్  పై నియమించిన కమిటీ ఏది ?  అశోక్ మెహతా కమిటీ (1977 లో)

అశోక్ మెహతా కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? 1978

 అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీ రాజ్ విధానాన్ని సిఫారసు చేసింది ? 2

పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సంబంధించి అశోక్ మెహతా కమిటీ చేసిన సిఫారసులు ఏవి?  రాజకీయ పార్టీలు బహిరంగంగా పోటీ చేయటం, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర స్థాయిలో ఉండి ప్రధాన ఎన్నికల అధికారి సలహా సంప్రదింపులతో పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికలను నిర్వహించటం

న్యాయ పంచాయతీలు ఏ కమిటీ సిఫారసు చేసింది?
అశోక్ మెహతా కమిటీ

మండల పంచాయితీ విధానాన్ని ఏ కమిటీ సిఫారసు చేసింది ? అశోక్ మెహతా కమిటీ

అశోక్ మెహతా కమిటీ సూచించిన మండల విధానాన్ని తొలిసారిగా ఆచరణలో పెట్టిన రాష్ట్రం ఏది?కర్ణాటక

జి.వి.కె. రావు కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1985

 1984లో ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలు నియమించిన కమిటీ ఏది ? సి.హెచ్. హనుమంతరావు కమిటీ

హనుమంతరావు కమిటీ దేనికి సంబంధించినది?
వర్కింగ్ గ్రూప్ ఆన్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ 

జి.వి.కె. రావు  కమిటీ ప్రధాన సిఫార్సులు ఏవి? ప్రణాళికల గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు, పర్యవేక్షణలపై జిల్లా, కింది స్థాయి పంచాయతీ రాజ్ సంస్థలకు విస్తృతాధికారాలు, పంచాయితీ రాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు, జిల్లా అభివృద్ధి కమిషనర్ (DDC) అనే అధికారిని నియమించటం,బ్లాక్ డెవలప్మెంట్ ప్టాయి అధికారి స్థానాన్ని రద్దుపర్చటం.

ఎల్.ఎం. సింఘ్వీ దేనికి చెందినవాడు ?డిపార్ట్ మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, భారత ప్రభుత్వం

పంచాయతీరాజ్ సంస్థల పద్దులను కాగ్ చే ఆడిట్ చేయించాలని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించింది? 64

 1990లో ఏ ప్రధానమంత్రి కాలంలో పంచాయితీరాజ్ విధానంలో సంస్కరణలకై రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు ? వి.పి. సింగ్

ప్రణాళిక మరియు బడ్జెటింగ్ విధానాలని పంచాయితీ స్థాయిలో ప్రారంభించాలని ఏ ప్రధాని ఆకాంక్షించారు?  రాజీవ్ గాంధీ

పంచాయితీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ వారు సిఫార్సు చేశారు ? ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ

 న్యాయ పంచాయితీ విధానం ఏర్పరచమని 1986లో ఏ కమిటీ వారు సిఫారసు చేశారు ?ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ

న్యాయ పంచాయితీ విధానం ఏ రాష్ట్రంలో 1986కు ముందునుంచే అమల్లో ఉంది ? రాజస్థాన్

73వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమలులోనికి వచ్చింది? 24 ఏప్రిల్, 1993

ఏ రాష్ట్రం పంచాయితీరాజ్ ఎన్నికలు నిర్వహించకుండా జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు 1992లో అధికారులను నియమించింది ?కర్ణాటక

కర్ణాటక పంచాయతీ రాజ్ చట్టం ఎప్పుడు ఏర్పడింది? ఏప్రిల్ 1993

ఏ రాష్ట్రం 1993లో ఒక చట్టం ద్వారా పంచాయితీరాజ్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి (Agent) గా చేసింది ? కర్ణాటక

ఏ రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో కమిషనర్ స్థాయి అధికారిని ఏర్పాటు చేసింది? కేరళ

రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్  ను అనుసరించి రాష్ట్రాలు పంచాయితీ సంస్థలకు ఎన్ని విధులను అందించాయి? 29

ప్రాంతీయ ఆచారాలు, సంస్కృతి దృష్టిలో ఉంచుకొని ఏయే రాష్ట్రాలలో ప్రత్యేక పంచాయతీ రాజ్ సంస్థలు ఏర్పరిచారు? నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్

కేరళ పంచాయితీరాజ్ చట్టాన్ని అనుసరించి డిప్యూటీ కమిషనర్ ఏ క్షేత్ర స్థాయి అధికారి ?
జిల్లా స్థాయి

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయితీ సంస్థల్లో దేనికి ప్రాధాన్యత నిచ్చింది?
పంచాయితీ సమితి

పంచాయతీరాజ్ సంస్థల పై పాలనా సంస్కరణల సంఘం (ARC) ఏ సంవత్సరంలో నివేదిక తయారు చేసింది ?1969

పాలనా సంస్కరణల సంఘం పంచాయతీ రాజ్ సంస్థలో దేని ప్రాధాన్యతని వివరించింది? జిల్లా పరిషత్

 రాజస్థాన్లో పంచాయితీ సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలకై దేన్ని ప్రముఖంగా భావిస్తున్నారు ?
పంచాయతీ సమితి



ఏయే రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాల విషయంలో జిల్లా పరిషత్ బలమైనది ? మహారాష్ట్ర, గుజరాత్

మన గ్రామసభను పోలిన స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏ దేశంలో ఉంది ? స్విట్జర్లాండ్

ప్రతి గ్రామానికి నియమంగా ఒక పంచాయితీ ఉండాలని ఏ కమిటీ పేర్కొంది ? పాలనా సంస్కరణల సంఘం (ARC) 

73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయితీరాజ్ సంస్థలు పోటీ చేయటానికై కనీస వయస్సుగా ఎన్ని సంవత్సరాలను నిర్ణయించారు ? 21

పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకై ఉద్దేశించిన రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషనర్  ను ఎవరు నియమిస్తారు? గవర్నర్

పంచాయతీ రద్దు పర్చిన సందర్భాలలో ఎన్నికలను తిరిగి ఎంత కాలంలోగా నిర్వహించాలని 73వ రాజ్యాంగ సవరణ వివరిస్తోంది ? 6 నెలలు 

పంచాయతీ సాధారణంగా ఎన్ని రోజులకి ఒకసారి సమావేశం కావాలి ? 15

గ్రామసభ కార్యనిర్వహక కమిటీ ఏది? గ్రామ పంచాయితీ

గ్రామసభ ను పోలిన స్విట్జర్లాండ్ స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏది? ల్యాండ్స్ గెమెండ్
 (Lands Gemende)

ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థల పై సాదిక్ ఆలీ కమిటీని నియమించింది? రాజస్థాన్

గ్రామసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ? సర్పంచ్

ఏయే రాష్ట్రాల్లో గ్రామసభ ఒక శాసనసంఘం (Statutory Body) కాదు ? కేరళ, తమిళనాడు

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తన నివేదికలో గ్రామసభ గురించి ఏమని ప్రస్తావించింది?  ఏరకమైన ప్రస్తావన లేదు

గ్రామసభలో సాధారణంగా ఎవరు సభ్యులుగా ఉంటారు?గ్రామంలోని ఓటర్లు మొత్తం 

ఏయే రాష్ట్రాలలోని గ్రామసభలో గ్రామంలోని అందరు వయోజన నివాసులు సభ్యులుగా ఉంటారు?బీహార్, ఒరిస్సా, రాజస్థాన్

 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయితీలలో ఎన్ని సీట్లను స్త్రీలకు కేటాయించారు ? 1/3 వంతు

సాదిక్ ఆలీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు ఏవి?
గ్రామసభ సమావేశాలు సరిగా జరగటం లేదు

గ్రామసభ సమావేశాలకు కోరం (Quorum) ఎంత ?
మొత్తం సభ్యులలో 1/10 వంతు

73వ సవరణ ప్రకారం గ్రామసభ సంవత్సరంలో కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి ? 2 సార్లు

గ్రామసభ కనీసం రెండుసార్లు ఒక సంవత్సర కాలంలో సమావేశం కానీ సందర్భంలో ఏమి జరుగుతుంది? సర్పంచ్ పదవి రద్దు అవుతుంది

పంచాయతీ సర్పంచ్ ను తొలగించటానికై కనీసం ఎంత మెజారిటీ అవసరం ? మొత్తం పంచాయితీ సభ్యులలో 2/3 వంతు

గుజరాత్లోని పంచాయితీ సమితిని ఏమని వ్యవహరిస్తారు ? తాలూకా పంచాయితీ

పంచాయతీ రాజ్ అనేది ఏ సామాజిక ఉద్యమంలో ఒక భాగంగా ఉన్నది? సర్వోదయ

73వ రాజ్యాంగ సవరణ అనుసరించి పంచాయతీ సమితి చైర్మన్ ని అనేక రాష్ట్రాలలో ఏమని వ్యవహరిస్తున్నారు? ప్రధాన్

పంచాయతీరాజ్ సంస్థలు ప్రత్యేక సిబ్బందిని ఏయే రాష్ట్రాలు ఏర్పరిచాయి? - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్

పంచాయతీ సమితి ఇన్చార్జ్ ఆఫీసర్ గా ఎవరు వ్యవహరిస్తారు? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్

 పంచాయితీరాజ్ సంస్థలకు చెందిన అన్ని స్థాయిలలోని ఖాతాలని ఎవరు ఆడిట్ చేస్తారు? లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ 

పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వ్యవహారాలపై 1963లో నియమించిన కమిటీ ఏది ? కె. సంతానం కమిటీ

ఏయే రాష్ట్రాల్లో పంచాయితీరాజ్ సంస్థలు మరిన్ని ఆర్థికాధికారాలను కలిగి ఉన్నాయి ? మహారాష్ట్ర, గుజరాత్

లోకల్ ఫండ్ ఆడిట్ వారు తమ ఆడిట్ నివేదికను ఎవరికి పంపిస్తారు ? జిల్లా అభివృద్ధి అధికారి (DDO)

ఏ ప్రధాని పంచాయితీరాజ్ సంస్థలకై ఉద్దేశించిన వనరులని నేరుగా జిల్లా కలెక్టర్ కు పంపించేందుకు ప్రయత్నించారు?  రాజీవ్ గాంధీ (1989)

ఏ ముఖ్య గ్రామీణాభివృద్ధి పథకం పంచాయితీరాజ్ సంస్థల పరిధికి ఆవల ఉంచబడింది ?I.R.D.P.

పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలు లోటుపాట్లని ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది? - కె. సంతానం కమిటీ (1963)

ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలకై ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి సర్వీస్ ఒకదాన్ని ఆవిష్కరించింది? రాజస్థాన్

"డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్" గ్రంథ రచయిత ఎవరు? శ్వేతమిశ్రా 

జిల్లా పరిషత్ లో ఎన్ని స్థాయి సంఘాలు ఉంటాయి ? 7

జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి ? రెండు నెలల కొకసారి 

జిల్లా పరిషత్  వైస్ ఛైర్మన్ ను ఎవరు ఎన్నుకుంటారు? జెడ్పీటీసీ సభ్యులు 

ఏ సంఘం సిఫార్సుల ఆధారంగా గ్రామీణ బ్యాంకులు నెలకొల్పబడ్డాయి? నరసింహం కమిటీ

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లన్నింటిని పర్యవేక్షించి తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంది? పంచాయతీరాజ్ కమిషనర్

300 మంది వరకు జనాభాగల గ్రామ పంచాయితీలో వుండే సభ్యుల సంఖ్య ఎంత ? 5 మంది 

300 కు పైన 500కు మించకుండా జనాభా వుండే గ్రామ పంచాయితీ సభ్యులు ఎందరుండాలి? 7 మంది.

500 కు పైన 1500కు మించకుండా జనాభా వుండే గ్రామ పంచాయితీ సభ్యులు ఎందరుండాలి? 9 మంది

1500 కు పైన 3000కు మించకుండా జనాభా వుండే గ్రామ పంచాయతీ సభ్యులు ఎందరుండాలి ? 11 మంది 

3000 పైన 5000కు మించకుండా జనాభా వుండే గ్రామ పంచాయితీ సభ్యులు ఎందరుండాలి?13 

5000 కు పైన 10,000 మించకుండా జనాభా ఉండే పంచాయితీ సభ్యులు ఎందరుండాలి?15 మంది

10000 పైన 15,000 మించకుండా జనాభా ఉండే పంచాయితీ సభ్యులు ఎందరుండాలి?17 మంది

15,000 మించిన జనాభా వుంటే గ్రామ పంచాయితీ సభ్యులు ఎందరుండాలి?19-21 మంది

గ్రామ పంచాయితీలకు, రాష్ట్ర ప్రభుత్వం తలసరి గ్రాంటును ఎంత చెల్లిస్తుంది? ఒక రూపాయి

గ్రామ సర్పంచ్ గ్రామంలోని ఓటర్లంతా ఎన్నుకునే విధాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?  వెంగళరావు కమిటీ

73వ రాజ్యాంగ  సవరణలోని అంశాలు ఏయే రాష్ట్రాల్లో పరిగణించబడవు?- జమ్మూ కశ్మీర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ

అర్.యు. పారేఖ్ రిపోర్ట్ (1960) ఏ రాష్ట్రానికి సంబంధించినది? గుజరాత్

మున్సిపల్ పాలన అనేది మన దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1687

మనదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏ నగరంలో ఏర్పడింది? మద్రాసు

ఏ చట్టం కింద మేయర్ సభ (Mayor's Court) మనదేశంలో ఏర్పాటయింది? రాయల్ చార్టర్ (1720)

లార్డ్ మేయో ప్రకటన ఏ -  సంవత్సరంలో వెలువడింది? 1870

రాయల్ చార్టర్ 1720 ప్రకారం ఏయే నగరాల్లో మేయర్ సభలు ఏర్పాటు చేశారు? మద్రాసు, బొంబాయి, కలకత్తా

స్థానిక స్వపరిపాలనా సంస్థల విషయంలో "మాగ్నాకార్టా”గా దేనిని వ్యవహరిస్తారు? లార్డ్ రిప్పన్ ప్రకటన (1882)

స్థానిక స్వపరిపాలనా సంస్థల సదభిప్రాయం లేని బ్రిటీష్ ప్రభువు ఎవరు? లార్డ్ కర్జన్

రాయల్ కమిషన్ ఆన్ డీ సెంట్రలైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1907

ఏ సంవత్సరంలో ముస్లింలీగ్ మున్సిపాలిటీలను మత ప్రాతిపదికన ఏర్పరచాలని డిమాండ్ చేసింది?
1910

భారత ప్రభుత్వ చట్టం, 1919 ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏ విషయం పరిధిలోకి వచ్చాయి? బదిలీ విషయం(Transferred Subject)

"ద కమిటీ ఆన్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయిస్" ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1965-68

ద కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ అగ్మెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్" ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1963

"ద రూరల్ అర్బన్ రిలేషన్‌షిప్ కమిటీ" ఏ సంవత్సరంలో ఏర్పాటయింది? 1963-66

ద లోకల్ ఫైనాన్స్ ఎంక్వైరీ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటయింది ? 1949-51

ద టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటయింది? 1953-54

ద కమిటీ ఆన్ ది ట్రైనింగ్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఏ సంవత్సరంలో ఏర్పాటయింది?1963

నగర అభివృద్ధి గురించి విలువైన సూచనలు అందించిన ముఖ్య కమిటీ లు ఏది?

ద టాస్క్ఫోర్స్ ఆన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియమ్ టౌన్స్ అండ్ సిటీస్ (1975),
ద స్టడీ గ్రూప్ ఆన్ స్ట్రాటజీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ (1982), ద టాస్క్ఫోర్స్ ఆన్ హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (1983)

నగర అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటయింది? 1985

65వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ ప్రధాని కాలంలో సభలో ప్రవేశ పెట్టబడింది ?రాజీవ్ గాంధీ

74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రధాని హయాంలో చేయబడింది? పి.వి. నరసింహారావు

74వ రాజ్యాంగ సవరణ బిల్లు. రాష్ట్రపతి ఆమోదాన్ని ఎప్పుడు పొందినది ? 20 ఏప్రిల్, 1993

మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా దేనిద్వారా సంక్రమించింది ? 74వ రాజ్యాంగ సవరణ చట్టం

నగర ప్రథమ పౌరుని హోదా ఎవరికి ఉంటుంది? మేయర్

74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విషయంలో ఎవరు మార్పులు, చేర్పులు చేయగల అధికారం కలిగి ఉన్నారు? రాష్ట్రపతి

74వ సవరణ చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో వేర్వేరు నగర పాలక సంస్థలు నిర్ణయించే అధికారం ఎవరిది?
గవర్నర్

ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధికారం ఎవరిది ? పార్లమెంట్

కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహక అధికారి ఎవరు? మున్సిపల్ కమిషనర్

మద్రాస్ కార్పోరేషన్ ఏ చట్టం ద్వారా ఏర్పాటయింది?
మద్రాస్ సిటీ కార్పొరేషన్ చట్టం, 1951

74వ సవరణ చట్టం ప్రకారం మున్సిపల్ సంఘాల ఎన్నికలు ఏవిధంగా జరుగుతాయి? ప్రత్యక్ష ఎన్నిక విధానం

మున్సిపాలిటీలో ఓటింగ్ హక్కు కలిగిన సభ్యులు ఎవరు? ఎన్నికయిన సభ్యులు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ సభ్యులు
















Friday 19 June 2020

ప్రాధమిక విధులు బిట్ బ్యాంక్


ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ? పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం 

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి?42వ  రాజ్యాంగ  సవరణ ద్వారా 1976 సంవత్సరంలో

రాజ్యాంగంలో ఏ అధ్యాయంలో ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? IV-A అధ్యాయంలో 51-ఎ నిబంధనలో

ఏ కమిటీ సిఫార్సుల మీద ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మీద

ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఏ విషయంలో సారూప్యం ఉంది?  రెండింటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేము

ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరములలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించుట ఆ పిల్లల తల్లిదండ్రుల లేదా సంరక్షకుని బాధ్యతగా చేర్చారు.- 86వ రాజ్యాంగ సవరణ

ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని అంశాలున్నాయి ?
 పదకొండు అంశాలు

ప్రాథమిక విధులను ఏ ప్రధానమంత్రి హయంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? ఇందిరాగాంధీ

ప్రజా ప్రయోజనాల' వ్యాజ్యం అను భావనను ఏ దేశం నుండి గ్రహించారు ? అమెరికా

ప్రాథమిక విధులను జస్టీస్ వర్మ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు ? 1999

ప్రతి ఏడాది ఏ తేదిన ప్రాధమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 3

ప్రాథమిక విధులను ఏ సంవత్సరం నుంచి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది? 1976

స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాధమిక విధులను  రాజ్యాంగంలో పొందుపరచమని సిఫార్సు చేసింది ? 8

11 ప్రాధమిక విధిని ఏ సంవత్సరం నుంచి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 2002

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ నిబంధనను రాజ్యాంగంలో పొందుపర్చారు ?నిబంధన 51-ఎ


ప్రాథమిక విధులు ఏ హక్కులపై పరిమితులుగా పని చేస్తాయి? ప్రాథమిక హక్కులు

6-14 సం|లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విధిగా చదువు చెప్పించాలని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయడం జరిగింది ? 86వ రాజ్యాంగ సవరణ

పదకొండవ ప్రాథమిక విధిని ఏ రోజున రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ? 2002, డిసెంబర్ 12న

ప్రాథమిక హక్కులు, ప్రాధమిక విధులు ఒకే నాణానికి ఇరువైపులు వంటివి అని ఎవరు పేర్కొన్నారు ? హెచ్.జె.లాస్కి

ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాలు మాత్రమే అన్నది ఎవరు? డి.కె. బారువా 

జాతీయ జెండాను ఎగురవేయడం కూడా భావ వ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ?

నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)

నూతన ఫ్లాగ్ కోడ్ ఏ రోజు నుండి అమలులోకి వచ్చింది ? జనవరి 26