Showing posts with label A.P.History Bits in Telugu. Show all posts
Showing posts with label A.P.History Bits in Telugu. Show all posts

Wednesday, 29 January 2020

A.P. History Bit Bank

విశాలాంధ్ర మహా సభను స్థాపించినది ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు.

విశాలాంధ్ర మహాసభ యొక్క మొదటి సభ ఎక్కడ జరిగింది? వరంగల్.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు 1953 లో నియమించబడిన రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు? ఫజల్ అలీ

తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 20, ఫిబ్రవరి 1956.

పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర ప్రాంతం తరుపున  పాల్గొన్నది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మరియు గౌతు లచ్చన్న

పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరుపున పాల్గొన్నది ఎవరు? కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మరియు జె.వి.నరసింగరావు.

పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలో అంగీకరించిన మంత్రుల నిష్పత్తి ఎంత? 3 : 2

పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణలో స్థానిక పొందాలంటే ఎన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలి? 12 సంవత్సరాలు

పెద్దమనుషుల ఒప్పందంలో కల్పించిన హామీలను అమలు పరచడానికి ఏ సంవత్సరంలో ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు? 1994.

1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సంవత్సరం ఏది? 1958

ఏ సమస్య పరిష్కారానికి 1969 ఏప్రిల్ లో అష్ట సూత్రాల ప్రణాళిక ప్రకటించబడింది? జై తెలంగాణ ఉద్యమం.

ఏ పథకం కోసం, 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ నిబంధనలు రద్దు కాబడి, రాష్ట్రం ఆరు జోన్లుగా విభజించబడింది? ఆరు సూత్రాల పథకం.

1984 - 89 మధ్య కాలంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ

అవినీతి నిర్మూలనకు 'ధర్మ మహామంత్రి'  అనే  ఉద్యోగిని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీఆర్

ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య ఎంత? 13 మంది

ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1955.

ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసన మండలి ఏర్పాటయింది? నీలం సంజీవరెడ్డి.

1958లో ఎంత మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది? 90 మంది.

1969లో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలం ఏది? ముల్కీ నిబంధనలు.

ఏ ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది? పీ.వి. నరసింహారావు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1983 జనవరి 9.

తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? కె. అచ్యుత్ రెడ్డి

1959 జూన్ లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఎన్. జి. రంగా.

నీలం సంజీవరెడ్డి ఏ సంవత్సరంలో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? 1960

శాసన మండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు? కె. రోశయ్య మరియు భవనం వెంకట్రావు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? కాసు బ్రహ్మానంద రెడ్డి.

1927లో పత్రిక స్వాతంత్ర్యాన్ని హరించే ప్రెస్ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి

1966 లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటులో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదము ఇచ్చిన వారు ఎవరు? తెన్నేటి విశ్వనాథం

ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? జనవరి 18, 1973.

ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు, అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎవరు? సి.ఎం.త్రివేది

1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం వలన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వారు ఎవరు? పి. వి.నరసింహారావు.

Tuesday, 28 January 2020

A.P.History Bits for APPSC Group 2 Exam

ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం మద్రాసు ప్రభుత్వం నియమించిన విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు ? కుమార రాజా

బళ్లారిని మైసూరు రాష్ట్రంలో కలపాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?ఎల్. ఎస్. మిశ్రా కమిటీ

ఆంధ్ర రాష్ట్ర కోసం గొల్లపూడి సీతారామశాస్త్రి ఎక్కడ 35 రోజులు  ఆమరణ నిరాహార దీక్ష చేశారు? గుంటూరులో.

భాషాప్రయుక్త ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు మొట్టమొదట సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హార్డింగ్-2

ధార్ కమిషన్ నందలి ఇతర సభ్యులు ఎవరు? పన్నాలాల్, నారాయణలాల్

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు

ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన కమిటీ ఏది? వాంఛూ కమిషన్

వాంఛూ కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22.

వాంఛూ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30

ఎస్.కె.థార్ కమిషన్ ను ఎప్పుడు నియమించారు? 1948 జూన్ 17

ఎస్.కె.థార్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ? 1948 డిసెంబర్ 10

Friday, 24 January 2020

2019 Group 2 Bits , Previous Bits on A.P.History

ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతానికి గొప్ప సేవలందించిన మహిళ ఎవరు? బోధిసిరి

రెండో పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురం గా ప్రస్తావించింది? మార్టూరు శాసనం

చాళుక్యుల కాలంలో 'గాంధర్వ విద్యా విశారద' అనే బిరుదును పొందినది ఎవరు? చెల్లవ్వ

'కళ్యాణ కారక 'అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు?
ఉగ్రాదిత్యాచార్యుడు

108 శివాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు? రెండో విజయాదిత్యుడు.

కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం ఏది ? మిశ్రశైవం

వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? పెనుగొండ

సార సంగ్రహ గణితమనే  గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వాడు ఎవరు? పావులూరి మల్లన.

'అభినవదండి' అనే బిరుదును ధరించినది ఎవరు? కేతన.

కందుకూరును బెజవాడవలె అభివృద్ధి పరచిన చాళుక్య ప్రభువు ఎవరు? మూడో విజయాదిత్యుడు

తొలి చాళుక్యులు ఏ మాతృదేవతను ఆరాధించారు? హారీతి

'చిత్రమేళి'అనే శ్రేణిని నెలకొల్పుకున్న వారు ఎవరు? వ్యవసాయదారులు

కాకతీయులకాలంలో కుల సంఘాలను ఏ విధంగా పిలిచేవారు? సమయము.

పెదగంజాం ,చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి? ఉప్పు

కుమారిల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పంథా ఏది? పూర్వమీమాంస.

'స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వ ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది' అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చును? కేతన రచించిన విజ్ఞానేశ్వరం.

కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు.

మోటుపల్లికి ఉన్న మరో పేరు ఏమిటి? దేశీయక్కొండ పట్టణం.

నృత్య రత్నావళిని రచించిన జాయన ప్రధాన వృత్తి ఏది? గజసాహిణి

ప్రాచీన, మధ్య యుగాల్లో ప్రాడ్వివాకుడు ఏ విభాగంలో రాజుకు సలహాదారుగా ఉండేవాడు? న్యాయవ్యవస్థ.

కాకతీయ రుద్రమ ఎవరి పై విజయానికి చిహ్నంగా 'రాయగజకేసరి' బిరుదాన్ని ధరించారు? దేవగిరి పాలకులు

కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఎవరికీ బందీగా  పట్టుబడ్డాడు? ఉలూఘ్ ఖాన్

'జలకరండ' అనేక సంగీత పరికరం ఏ శాసనంలో పేర్కొనబడింది? ధర్మసాగర శాసనం

రెడ్డి రాజుల పాలనా కాలంలో వ్యాపారాన్ని గురించి సమాచారాన్నిచ్చే సాహిత్య గ్రంథం ఏది? హరవిలాసం.

పెదకోమటి వేముని సతీమణి సూరాంబికా త్రవ్వించిన తటాకమేది? సంతాన సాగరం.

రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతి పాత్రమైన పండగ ఏది? వసంతోత్సవం

'సంగీత చింతామణి'అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? పెదకోమటి వేముడు

కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ప్రోలయ నాయకుడు.

శ్రీ కృష్ణ దేవరాయలు 'జాంబవతి కళ్యాణం' అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృతం.

విజయనగర సామ్రాజ్యంలో 300లకు పైగా ఓడ రేవులున్నట్లు మనకు తెలిపినది ఎవరు? అబ్దుర్ రజాక్

రాయల పాలనలో 'కందాచార' శాఖ ఏ విషయాల్ని పరిశీలించేది? సైనిక విషయాలు

తటాక నిర్మాణ సమయంలో పాటించవలసిన 12 సూత్రాలను వర్ణించినది ఏ శాసనం? పోరుమామిళ్ల శాసనం.

విజయనగర రీతిలో అందంగా రూపొందిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? లేపాక్షి.

శ్రీ కృష్ణ దేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఎవరు? డొమింగో పేస్.

విజయనగర కాలంలో కనిపించే విప్రవినోదులు ఎవరు? బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్ళల్లో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు.

కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి

మేలైన రత్నాలు, వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు? టావెెర్నియర్.

క్రీస్తుశకం 16,17 శతాబ్దాలలో చేనేత వస్త్రల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడ రేవు పట్టణం ఏది? మచిలీపట్నం.

బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఎవరి సాయం తీసుకున్నాడు? ఫ్రెంచి.

సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన 'విప్లవ పరివర్తనము' అనే బహిష్కృత నాటకాన్ని రచించినది ఎవరు? కొడాలి ఆంజనేయులు.

వీరేశలింగం పంతులు గారిని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? ఎం.జి.రనడే.

ఆంధ్ర సమాజం నుండి 'భోగం' కులం అంతర్దానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు.

కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకం గా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? 1921

"వీర గంధము తెచ్చినారము-వీరులెవ్వరో తెలపండి"అనే గేయం ఏ  ఉద్యమకాలంలో రచించబడింది ? ఉప్పు సత్యాగ్రహం

గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు?
వీనం వీరన్న

ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం "ఆంధ్ర కేసరి" గా పిలవబడ్డాడు?
సైమన్ గో బ్యాక్ ఆందోళన

వందేమాతర ఉద్యమకాలంలో ఆంధ్రలో జరిగిన ఏ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదయింది? కాకినాడ సామూహిక అల్లరి కేసు

"భరత ఖండంబు చక్కని పాడి యావు- హిందువులు లేగదూడలై యేడ్చుచుండ -  తెల్లవారను గడసరి గొల్లవారు-పితుకుచున్నారు మూతులు బిగియగట్టి" అని చెప్పినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఎలా పిలిచారు? రామదండు.

అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? చింతపల్లి.

"ఆంధ్ర శివాజీ"గా ప్రసిద్ధుడైనది ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి.

ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఎన్.జి.రంగా

సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య

1941-46 సంవత్సరముల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సర్ విజయ

"కర్నూల్ సర్కులర్"ను వ్రాసినది ఎవరు? కళా వెంకట్రావు.

ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు? వినోభా భావే.

పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? డిసెంబర్
15 డిసెంబర్ 1952.

జై ఆంధ్ర ఉద్యమానికి దారి తీసిన ప్రధాన అంశం ఏది? ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు తీర్పు

ఆరు సూత్రాల పథకం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది? 32వ సవరణ

Thursday, 23 January 2020

2019 Group 2 Bits , Previous Bits on A.P.History

పురాతత్వ వేత్తలు సూక్ష్మ రాతి పరికరాల కేంద్రంగా ఏ ప్రదేశాన్ని గుర్తించారు? గిద్దలూరు

ఆంధ్ర పధమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? భీమసేన జాతకం.

శాసనాధారాలను బట్టి క్రీస్తుపూర్వం 3  శతాబ్ది లో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు ? కుభీరకుడు.

తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వటం వలన రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? దేవి నాగనిక

సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము పై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేది? 12 శాతం

శాతవాహనుల కాలం నాటి కోలిక శ్రేణి అనగా ఎవరు? నేతపనివారు

శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపూతను ఎలా అన్నారు?
అరదళం

బావ వివేకుడు ఏ బౌద్ధ విహారం లో ఆచార్యుడుగా ఉండేవాడు? ధాన్యకటకం

జైన తాత్విక గ్రంథమైన  సమయసారమును రచించినది ఎవరు? కొండకుందాచార్యులు

చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్ర పురుష దత్తుడు

శ్రీ పర్వత స్వామిని బుద్ధుని గుర్తించినది ఎవరు? ఎన్. వేంకటరమణయ్య

Sunday, 12 January 2020

A.P.History Bits

తొలి కాకతీయులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు

దానార్ణవుడు ఏ వంశ రాజు ? తూర్పు చాళుక్య వంశం

కాకత్య గుండన ఎవరి సేనాని? రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుని సేనాని

కాకత్య గుండన చాళుక్య రాజయిన దానార్ణవుడికి ఏ రాజ్యం ఆక్రమించడానికి సహాయపడ్డాడు ? వేంగి రాజ్యం

దానార్ణవుడు తనకు సహాయం చేసిన కాకతి గుండనను సత్కరించి అతని కోరిక మేరకు ఎవరికి మాగల్లు గ్రామము చేసినట్టు మాగల్లు శాసనం తెలుపుతుంది? దొమ్మన శర్మ అనే  బ్రాహ్మణుడికి

మాగల్లు శాసనం,కాకతీయులు ఏ వంశానికి చెందినవారని తెలుపుతుంది? సామంత విట్టి శాసనం.

బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఎవరిని కాకతీయ వంశ మూల పురుషుడిగా పి.వి.పరబ్రహ్మశాస్త్రి పేర్కొన్నారు? వెన్న భూపతి

ఏ శాసనం కాకతీయులను శూద్ర వంశానికి చెందిన దుర్జయులుగా పేర్కొన్నది? బయ్యారం చెరువు శాసనం

కాజీపేట శాసనాన్ని ఎవరు జారీ చేశారు? మొదటి బేతరాజు

కాకతీయుల తొలి చరిత్రను తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం

కాజీపేట శాసనం ప్రకారం కాకతీయ రాజులలో ప్రధముడు ఎవరు? మొదటి బేతరాజు

మొదటి బేతరాజు విజయాలను తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం

శనిగరం శాసనాన్ని ఎవరు జారీ చేశారు? రెండవ ప్రోలరాజు

సామంతులుగా కాకతీయుల చివరికి శాసనం ఏది? శనిగరం శాసనం

రెండవ ప్రోలరాజు కుమారుడు ఎవరు?రుద్రదేవుడు

కాకతీయ సామ్రాజ్య నిజవ్యవస్థాపకుడు ఎవరు? రుద్రదేవుడు

హనుమకొండ శాసనాన్ని జారీ చేసినది ఎవరు? రుద్రదేవుడు

ఏ శాసనం కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలియజేస్తుంది? హన్మకొండ శాసనం

మోటుపల్లి శాసనాన్ని జారీ చేసినది ఎవరు? గణపతి దేవుడు

కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలియజేసే శాసనమేది? మోటుపల్లి శాసనం

మోటుపల్లి శాసనం, మోటుపల్లెను ఏ విధంగా పేర్కొన్నది? దేశీయ కొండ పట్టణంగా.

ఎవరి పరిపాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లిని దర్శించాడు? రుద్రమదేవి

రుద్రమదేవి పట్టాభిషేకం గురించి తెలియజేయు శాసన మీది? జన్నిగ దేవుని దుర్గ శాసనం

ఏ శాసనం గోళకీ మఠానికి చెందిన శైవ గురువుల గురించి వివరాలను అందిస్తుంది? మాల్కపురం శాసనం

కాకతీయుల కాలంలో దేవాలయ నిర్వహణను గురించి తెలిపే శాసన మేదీ? మాల్కపురం శాసనం

కాకతీయుల కాలంలో ప్రసూతి వైద్యశాలను గురించి ప్రస్తావించిన శాసనం ఏది? మాల్కపురం శాసనం

చందుపట్ల శాసనాన్ని జారీ చేసినది ఎవరు? కాయస్థ ప్రసాదిత్యుడు.

రాణి రుద్రమదేవి హత్య గురించి తెలియజేయు శాసనం ఏది? చందుపట్ల శాసనం

బీదర్ కోట శాసనాన్ని ఎవరు జారీ చేశారు? రేచర్ల ప్రసాదిత్యుడు

రాణి రుద్రమదేవిని రాయ గజకేసరి అని పేర్కొన్న శాసనం ఏది? బీదర్ కోట శాసనం

తేరాల శాసనాన్ని ఎవరు జారీ చేశారు? ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు రాయగజకేసరి ముద్ర ఉన్న నాణేలను ముద్రించినట్లు తెలియజేయు శాసనం ఏది? తేరాల శాసనం

సలకలవీడు శాసనాన్ని జారీ చేసినది ఎవరు? ప్రతాపరుద్రుడు

ఏ శాసనం, పాండ్యుల మీద ప్రతాపరుద్రుని విజయానికి గుర్తుగా , శ్రీ రంగనాథదేవ స్వామికి సలకలవీడు గ్రామాన్ని దానం చేసినట్లు తెలుపుతుంది? సలకడవీడు శాసనం

ఏ శాసనం లో కాకతీయుల కాలం నాటి అన్ని రకాల పన్నులు గురించి పేర్కొనబడింది? సలకలవీడు శాసనం

మట్టి వాడ శాసనాన్ని జారీ చేసినది ఎవరు? గణపతి దేవుడు

ఏ శాసనం భిన్న వాణిజ్య వస్తువులపై విధించే సుంకాలను పేర్కొన్నది? మట్టివాడ శాసనం

విలస తామ్ర శాసనాన్ని జారీ చేసినది ఎవరు? ప్రోలయ నాయకుడు

కాకతీయుల కాలం నాటి మహమ్మదీయ దండయాత్రలను వర్ణించిన శాసన మేదీ? విలస తామ్ర శాసనం

కాకతీయుల పతనాన్ని గురించి తెలియజేయు శాసనం ఏది? విలస తామ్ర శాసనం

కాకతీయులలో చివరివాడైన ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపే శాసనం ఏది? విలస తామ్ర శాసనం

కలువచేరు శాసనాన్ని జారీ చేసినది ఎవరు? అనితల్లి

వరంగల్ పై ముస్లింలు ఎనిమిది సార్లు దండయాత్ర చేశారని తెలిపే శాసనం ఏది? అనితల్లి వేయించిన కలువచేరు శాసనం

ప్రోలయవేమారెడ్డిని పంట వంశోధృవుడు అని ఏ శాసనం పేర్కొన్నది? కలువచేరు శాసనం

మొదటి బేతరాజు ఎవరి వద్ద సామంతుడిగా ఉండేవాడు? పశ్చిమ చాళుక్యుల వద్ద

కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి బేతరాజు

మొదటి బేతరాజు యొక్క మంత్రి పేరు ఏమిటి? నారాయణయ్య

యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయం ను పునరుద్దరించినది ఎవరు? మొదటి బేతరాజు యొక్క మంత్రి నారాయణయ్య

మొదటి బేతరాజు యొక్క బిరుదు ఏమిటి? కాకతీ పురాధినాధ

మొదటి ప్రోలరాజుకు హనుమకొండ విషయాన్ని ఇచ్చిన పశ్చిమ చాళుక్య రాజు పేరేమిటి? మొదటి సోమేశ్వరుడు

మొదటి ప్రోలరాజు మొదటిసారిగా తన నాణెములు పై ఏ ముద్రను ముద్రించాడు? వరాహ ముద్రను

మొదటి ప్రోలరాజు గురువు పేరు ఏమిటి? రామేశ్వరుడు

కేసరి సముద్రం(కేస సముద్రం), జగత్ కేసరి సముద్రం అనే చెరువులను నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు

మొదటి ప్రోలరాజు కి ఉన్న బిరుదులు ఏమిటి? అరిగజకేసరి,కాకతీయ వల్లభ

రెండవ బేతరాజుకి సబ్బి మండలాన్ని ఇచ్చిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? 6వ విక్రమాదిత్యుడు

రెండవ బేతరాజు తన గురువు రామేశ్వర పండితుని గౌరవార్థం హనుమకొండ సమీపంలో నిర్మించిన నగరం ఏది? శివపురి

రెండవ బేతరాజు బిరుదులు ఏమిటి? విక్రమచక్రి

రెండవ ప్రోలరాజు బిరుదులు ఏమిటి? మహామండలేశ్వరా

తొలి కాకతీయులు ప్రసిద్ధుడు ఎవరు? రెండవ ప్రోలరాజు

శ్రీశైలం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి  అచ్చట విజయ స్తంభాన్ని నాటించిన కాకతీయ రాజు ఎవరు? రెండో ప్రోలరాజు

ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? రెండవ ప్రోలరాజు

రెండో ప్రోలరాజు ఎలా మరణించాడు? వెలనాటి రాజేంద్రునితో జరిగిన యుద్ధంలో.

కాకతీయులలో మొదటిసారిగా  పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని పరిపాలించిన రాజు ఎవరు? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు

ఎవరి కాలం నుండి కాకతీయులపై పశ్చిమ చాళుక్యుల నియంత్రణ అంతమైంది? మొదటి ప్రతాపరుద్రుని కాలం నుండి

మొదటి ప్రతాపరుద్రునికి కల బిరుదు ఏమిటి? వినయ విభూషణుడు

మొదటి ప్రతాపరుద్రుని భార్య అయిన అన్నాల దేవి వేయించిన శాసనం ఏది? ద్రాక్షారామ శాసనం

కాకతీయులు మొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? రుద్రదేవుడు

పల్నాటి యుద్ధంలో నలగామరాజు కి సహాయంగా వెళ్లిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు

పల్నాడు యుద్ధం తర్వాత రుద్రదేవుడు ఎవరిని ఓడించి ధరణికోటను ఆక్రమించాడు? దొడ్డ భీముని

రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన దేవాలయం పేరు ఏమి? రుద్రేశ్వరాలయం లేదా త్రికూటేశ్వర ఆలయం లేదా వెయ్యి స్తంభాల గుడి

రుద్రదేవుని సమకాలికుడైన శైవమత గురువు ఎవరు? మల్లికార్జున పండితుడు.

రుద్రదేవుని సేనాపతి ఎవరు? ఎల్లంకి గంగాధరుడు

హన్మకొండలో ప్రసన్న కేశవ దేవాలయంను నిర్మించినది ఎవరు? ఎల్లంకి గంగాధరుడు

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని చేపట్టి రాజధాని హన్మకొండ నుండి ఓరుగల్లు కి మార్చిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు

ఓరుగల్లులో స్థిర పడిన నల్గొండ వారి కొరకై రుద్రదేవుడు నిర్మించిన వీధి పేరు ఏమిటి? పానుగంటి వాడ

రుద్రదేవుని సంస్కృత రచన ఏది? నీతిసారం

రుద్రదేవుని బిరుదు ఏమిటి? విద్యాభూషణ ( వినయవిభూషణ)

రుద్రదేవుని సోదరుని పేరు ఏమిటి? మహాదేవుడు

రుద్రదేవుడు  ఎవరిని దత్త స్వీకరణ చేసుకున్నాడు? తమ్ముడు మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడిని

ఎవరి కాలంలో కాకతీయ యాదవ సంఘర్షణ ఆరంభమైనది? రుద్రదేవుని కాలంలో

కాకతీయ రాజ్యం పై దండెత్తి రుద్రదేవుని చంపి అతని తమ్ముడు కుమారుడైన గణపతిదేవుని బందీగా తీసుకువెళ్లిన యాదవ రాజు ఎవరు? దేవగిరి జైత్ర పాలుడు

మహాదేవుని శైవమత గురువు ఎవరు దృవేశ్వర పండితుడు.
   

A.P.History Bits

రంగనాధ రామాయణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? గోనబుద్ధారెడ్డి

భాస్కర రామాయణాన్ని రచించిన రచయిత ఎవరు? భాస్కరుడు

బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను రచించినది ఎవరు? పాల్కురికి సోమనాథుడు
   
మార్కండేయ పురాణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?మారన

శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మల్లికార్జున పండితారాధ్యుడు

సుమతీ శతకం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? బద్దెన

సర్వేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? యధావాక్కుల అన్నమయ్య

నీతిసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఒకటవ ప్రతాపరుద్రుడు

సకల నీతి సారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మడికి సింగన్న

ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? విద్యానాధుడు

పురుషార్థ సారం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?శివదేవయ్య

నృత్య రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాలను రచించినది ఎవరు ? జయపసేనాని

దశకుమార చరిత్ర అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? కేతన

నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? తిక్కన

కాకతీయుల అధికార భాష ఏది? సంస్కృతం

కాకతీయులు ఏ భాషకు ప్రాధాన్యమిచ్చారు? తెలుగు

హనుమకొండ శాసనాన్ని రచించిన వారు ఎవరు ? అచితేంద్రుడు

గణపవరం శాసనాన్ని రచించిన వారు ఎవరు? నంది మిత్రుడు

పాకాల శాసనాన్ని రచించినది ఎవరు? కవి చక్రవర్తి

కందవరం శాసనాన్ని రచించినది ఎవరు? బాలభారతి

చేబ్రోలు శాసనాన్ని రచించినది ఎవరు?
భీమయ పండ

బూతపుర శాసనాన్ని రచించినది ఎవరు? ఈశ్వర భట్టోపాద్యుడు

గూడూరు శాసనాన్ని రచించినది ఎవరు? రెండవ బేతరాజు

కొణిదెన శాసనాన్ని రచించినది  ఎవరు? ఓపిలసిద్ధి

ఉప్పరపల్లె శాసనాన్ని రచించినది ఎవరు? కాటమరాజు

మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది? కాకతీయులకు

కాకతీయులను గురించి ప్రస్తావించిన మొదటి శాసనం ఏది? దానార్ణవుని మాగల్లు శాసనం

ఏ శాసనం ప్రకారం కాకతీయులు సూర్యవంశం కు చెందినవారని తెలుస్తోంది? చేబ్రోలు శాసనం

గణపతిదేవుని ఏ  శాసనం ప్రకారం కరికాల చోడుడు కాకతీయుల పూర్వీకుడు అని వివరిస్తుంది? గరవపాడు శాసనం

గణపతిదేవుని ఏ శాసనంలో కాకతీయులను సూర్య వంశీకులుగా వర్ణిస్తూనే, శూద్రులు అనే పేరుకూడా సూచించడం జరిగింది? ఉప్పంపల్లి శాసనం

కాకతీయులు మొదట్లో ఏ  మతస్తులు? జైన మతస్థులు

తర్వాతి కాకతీయులు ఏ మతస్తులు? శైవమతస్థులు

కాకతి పురాధినాధ అనే బిరుదు ఎవరికి కలదు? బేతరాజుకు

కాకతి వల్లభ అనే బిరుదు ఎవరికి కలదు? ప్రోలరాజుకి

కాకతీయుల వంశ వృక్షాన్ని గురించి తెలియజేయు శాసనమేది? మైలాంబ యొక్క బయ్యారం  చెరువు శాసనం

కాకతీయులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారమేదీ? మాగల్లు శాసనం