Showing posts with label A.P.Bifurcation Act. Show all posts
Showing posts with label A.P.Bifurcation Act. Show all posts

Thursday, 16 January 2020

Bits on AP Bifurcation Act 2014 for APPSC exams

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా దేశంలోనే 5వ స్థానంలో ఉండగా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానం

దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత శాతం? 4.10 శాతం

రాష్ట్ర విభజనకు ముందు పట్టణీకరణ 34 % ఉండగా, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ శాతం ఎంత? 29 %.

విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎంత?
రూ.85,797/-

ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 997:1000

నవ్యాంధ్రప్రదేశ్ జన సాంద్రత ఎంత? 304 చదరపు కిలోమీటరు కు

ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? కృష్ణాజిల్లా.

ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? కడప

ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత? 9.21%.

ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద వృద్ధిరేటు అధికంగా గల జిల్లా ఏది? కర్నూలు.

ఆంధ్ర ప్రదేశ్ లో దశాబ్ద వృద్ధి రేటు తక్కువగా గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత 67 35%.

నవ్యాంధ్రప్రదేశ్ లోని మండలాల సంఖ్య ఎంత? 670.

నవ్యాంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత? 49.

రాష్ట్రంలో అత్యధిక జనాభా గల గ్రామం ఏది? జంగారెడ్డిగూడెం( ప.గో జిల్లా).

రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మండలం ఏది? విజయవాడ అర్బన్.

రాష్ట్రంలో అత్యల్ప జనాభా గల మండలం ఏది? మారేడుమిల్లి తూ.గో.జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో గల మున్సిపల్ కార్పొరేషన్ సంఖ్య ఎంత? 14

ఆంధ్రప్రదేశ్ లో గల మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? 97

విభజన నాటికి ఆంధ్ర ప్రదేశ్ జనాభా, ఆదాయాల నిష్పత్తి ఎంత? 58:42

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత రేటు కున్న హోదా ఉన్న జిల్లాలు ఎన్ని? 6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యతా రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యతా రేటు ఎంత ?59.96

రాష్ట్రంలో అత్యల్ప షెడ్యూల్ తెగల  జనాభా కలిగిన జిల్లా ఏది? కర్నూలు

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా లోని లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? శ్రీకాకుళం

ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ దశాబ్ద వృద్ధిరేటు కలిగిన జిల్లా ఏది? పశ్చిమ గోదావరి.

కులాంతర వివాహం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దంపతులకు ఎంత మొత్తం ప్రోత్సాహకరంగా అందజేస్తుంది?రూ.50,000 /-

APSCCFC లిమిటెడ్ ద్వారా జోగిని మహిళల పునరావాసం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లో కేటాయించిన మొత్తం ఎంత? రెండు కోట్లు.

షెడ్యూల్డ్ కులాలు తెగల ఉప ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగాల గురించి చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ(షెడ్యూల్డ్ కులాల)  ఆర్డర్, 1950 నుంచి తొలగించారు? బేడ(బుడగ)జంగం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ఎంత? 58.32:41.68

అన్న సంజీవని అనగానేమి? స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జెనరిక్ ఔషధాల దుకాణములు.

శిల్పారామం కళా, హస్తకళ సాంస్కృతిక సొసైటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ షెడ్యూల్ లో ఉన్నది? 8వ షెడ్యూల్

Wednesday, 15 January 2020

Bits on AP Bifurcation Act 2014 for APPSC Exam

ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1

ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? కర్నూలు

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4

ఆంధ్రులకు తొలి శాసనం ప్రమాణంగా గుర్తింపు పొందిన మైదవోలు శాసనం ప్రకారం ఆంధ్రుల రాజధాని ఏది? ధాన్యకటకం

అమరావతి గురించి తెలియజేయు శాసనం ఏది? మైదవోలు శాసనం

పూర్వం అమరావతికి గల ఇతర పేర్లేమిటి? ధాన్యకటకం, ఆంధ్రనగరి, ధరణికోట.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1

CRDAకు ఎన్ని కోట్ల CO క్యాపిటల్ ఫండ్ ను ఇస్తారు? వెయ్యి కోట్లు

కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్ర హోంశాఖ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఎవరు? కె. శివరామకృష్ణన్(చైర్మెన్), ఆర్మూన్ దేవి, జగన్ షా, కె. టి. రవీంద్రన్ , డాక్టర్ రతీన్ రాయ్ ఈ కమిటీలో సభ్యులు

శివరామకృష్ణన్ కమిటీ ఎప్పుడు నియమితమైనది? 28 మార్చ్ 2014

శివరామకృష్ణన్ కమిటీ తన పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 31 ఆగస్టు 2014

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధానికి ప్రాంత పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఏది? శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? సూపర్ సిటీ లో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణ, అభివృద్ధి పంపిణీ

శివరామకృష్ణన్ కమిటీలో  చైర్మన్ తో కలిపి సభ్యులు ఎంతమంది?5

నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన ఏ తేదీన జరిగింది? అక్టోబర్ 22, 2015

నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసినది ఎవరు? నాటి ప్రధాని నరేంద్ర మోడీ

CRDA బిల్లును నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? 22 డిసెంబర్, 2014

CRDA మొదటి కమిషనర్ ఎవరు? నాగులపల్లి శ్రీకాంత్

CRDA కి అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మొట్టమొదట భూమిని ఇచ్చిన మహిళ ఎవరు? కె.ఆదిలక్ష్మమ్మ

CRDA ఉపాధ్యక్షుడు ఎవరు? మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి

నవ్యాంధ్రప్రదేశ్ మంత్రి మండలి తొలి సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? విశాఖ పట్నం .

నూతన రాజధానికి ఏ గ్రామంలో శంకుస్థాపన జరిగింది? ఉద్దండరాయునిపాలెం

2016 ఫిబ్రవరి 17 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ భవన నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? వెలగపూడి

నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం ఎప్పుడు ప్రారంభం అయ్యింది? 2016 జూలై 28.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని భూసేకరణ చట్టం ద్వారా స్వాధీన పరుచుకోవటానికి వీలుగా ప్రభుత్వం ఏ రోజున ఉత్తర్వులు జారీ చేశారు? 14 మే 2015.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి  ఏ తేదీన నిర్ణయం తీసుకుంది? 1 ఏప్రిల్ 2015

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అత్యవసర సదుపాయాల ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తుందని విభజన చట్టం 2014 లో పేర్కొన్న సెక్షన్ ఏది? సెక్షన్ 94(3)

నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఏ రోజున పదవి ప్రమాణ స్వీకారం చేశారు? 8 జూన్ 2014.

నవ్యాంధ్ర రాజధాని నగర పరిధి విస్తీర్ణం ఎంత? 375 చదరపు కిలోమీటర్లు

2011 జనాభా లెక్కల ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత? 67.35 శాతం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార చట్టం 2014 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 2014, డిసెంబర్ 30.

కృష్ణా జిల్లా లోని  ఎన్ని మండలాలు   పూర్తిగా CRDA పరిధిలోకి వస్తాయి? 15

అమరావతి నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ దాఖలైన నాలుగు కేసులను కొట్టివేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు తీర్పునిచ్చింది ? 17 నవంబర్ 2017

రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఎవరు నేతృత్వం వహించారు? జస్టిస్ స్వతంత్ర కుమార్

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు లో నిర్దేశించిన అంశాల పర్యవేక్షణ కమిటీకి ఎవరు చైర్మన్ గా వ్యవహరించనున్నారు? కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అదనపు కార్యదర్శి.

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత 2014-15 కాలానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు స్థూల దేశీయ ఉత్పత్తి GSDP తో పోలిస్తే తీర్చవలసిన అప్పు ఎంత శాతం గా ఉన్నది? 29.36

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2017-18 లో తెలిపిన సమాచారం ప్రకారం అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ భవనం ఎన్ని రోజుల్లో పూర్తి అయినది? 192 రోజుల్లో

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ని  ఏ అధికరణ క్రింద కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని కోసం ప్రత్యామ్నాయాలను సూచించే నిపుణుల సంఘాన్ని నియమించాలి? 6 వ అధికరణ

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ యొక్క భౌగోళిక ప్రాంతం ఏది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం

పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ నగరం నుండి వచ్చే పన్ను రాబడి ఎంత? ఆంధ్రప్రదేశ్ కు వాటా ఇవ్వబడదు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎంపిక చేసినది ఎవరు? ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్

ప్రస్తుతం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాజధాని? డీ జ్యుర్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014  లోని 5వ అధికరణను అనుసరించి హైదరాబాద్ నగరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరములకు వరకు ఉమ్మడి రాజధానిగా వెలుగుతుంది? 10 సంవత్సరములు మించకుండా

Bits on AP Bifurcation Act-2014

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని 10 వ షెడ్యూల్ వేటి జాబితా కలిగి ఉంటుంది? శిక్షణా సంస్థలు/కేంద్రాలు

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో వివిధ నిధులు జాబితా ఎక్కడ కనిపిస్తుంది? 7వ షెడ్యూల్లో

అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం సహాయం అందించాలని ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ పరిచ్ఛేదం పేర్కొన్నది? పరిచ్ఛేదం 8

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఎలా ఉన్నది? నిర్హేతుకముగా ఉన్నది మరియు అనేక సమస్యాత్మక విషయాలకు సమాధానాలు లేవు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ సెక్షన్ ప్రకారం ఉన్నత విద్యలో రెండు రాష్ట్రాలలోని విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని తెలుపబడింది? 95

ముఖ్యమంత్రి సహాయనిధి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోనే ఏ షెడ్యూల్ లో చేర్చబడింది? ఏడవ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేరుపడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్,2014 సవరించింది? 3వ పరిచ్ఛేదం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుండి ఎంతకు పెంచవచ్చును? 225

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ షెడ్యూల్ లో APSFC ఉన్నది? 9వ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత ఏ జిల్లా కొంత ఆంధ్రప్రదేశ్ లో,కొంత తెలంగాణలో ఉంది? ఖమ్మం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ని పరిచ్ఛేదం 8 ప్రకారం గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎంతమంది సలహాదారులు సాయం అందిస్తారు? 2

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మొదటి షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెంది, తెలంగాణ రాష్ట్రపు వాటాలోకి వెళ్తున్న రాజ్యసభ సభ్యులను ఎలా గుర్తించాలి? లాటరీ పద్ధతి ద్వారా

ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు? 1 మార్చి,2014

ఆంధ్రప్రదేశ్ క్రీడల అధారిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ షెడ్యూల్ లో ఉన్నది? 9వ షెడ్యూల్

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం APSFC విభజన గురించి చెబుతుంది? పరిచ్ఛేదం 70

పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ఎన్ని స్థానాలు ఉన్నాయి? 175

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని 8(3) ప్రకారం గవర్నర్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే సెక్షన్ 8(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కు ఎంత మంది సలహాదారులను  నియమిస్తుంది? 2

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని లోక్ సభ స్థానాలు ఉన్నాయి? 25

పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి రాజ్యసభ లోఎన్ని స్థానాలు కేటాయించారు? 11

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ విధాన మండలిలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 50

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏ సెక్షన్ ప్రకారం, కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు కొత్త రాజధాని నిర్మించుటకు సహాయం చేయాలి? 94(4)

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నియమిత దినము ఏది? 2 జూన్ 2014

Tuesday, 14 January 2020

A.P.Bifurcation Act Bits

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భముగా, షీలా భిడే కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? 9వ షెడ్యూల్ లోని ఆస్తుల విభజనకు

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం  సింగరేణి కాలరీల నుండి ఎన్ని బొగ్గు లింకేజ్ లు  కొనసాగుతాయి? ప్రస్తుతం ఉన్న లింకేజ్ లు కొనసాగుతాయి

పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ డిమాండ్ చేశారు. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలని కోరారు? విశాఖపట్టణం

ఏ ప్రదేశంలో ICAR స్థాపించిన భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ఉన్నది? పెదవేగి

రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది? ఆర్టికల్ 214

కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి యొక్క ఆస్తులను ఏ విధముగా విభజింపవలెనని పేర్కొన్నారు?
ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. కానీ నగదు నిల్వలు/ఖాతాలలోని జమలు 52: 48 నిష్పత్తిలో పంపిణీ చేయాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని పరిచ్ఛేదం 51(1)  క్రింద పరిశ్రమలు నుండి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి.

APSCHE విషయంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 10 లో పేర్కొన్న సంస్థల ఆస్తులను చట్టంలోని ఏ పరిచ్ఛేదంలో తెలిపిన విధానం ప్రకారం పంపకం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? పరిచ్ఛేదం 47

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎక్కడ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది? కర్నూలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, SAIL సంస్థ ఒక సమీకృత కర్మాగారాన్ని ఏ జిల్లాలో స్థాపించుటకు వీలవుతుందో లేదో పరిశీలించాలి? వైఎస్ఆర్ కడప జిల్లా.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఏమీ లేవు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ IX లో పేర్కొన్న కార్పొరేషన్ ల ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పంచుకోవాలో నిర్ధారించే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం ఏది? పరిచ్ఛేదం 52