Showing posts with label A.P.Geography in Telugu. Show all posts
Showing posts with label A.P.Geography in Telugu. Show all posts

Friday, 31 January 2020

A.P. Geography Bit Bank in telugu

కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? తూర్పు గోదావరి జిల్లాలో.

కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కృష్ణా  జిల్లాలో

రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్  వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో.

గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు , ప్రకాశం జిల్లాలో

రోల్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? కర్నూలు జిల్లాలో

కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? చిత్తూరు జిల్లాలో

కంబాల కొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? విశాఖపట్నం జిల్లాలో.

శ్రీ పెనుసుల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో కలదు.

వేంకటేశ్వర నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? చిత్తూరు జిల్లాలో

రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? వైఎస్ఆర్ కడప జిల్లాలో.

పాపికొండ నేషనల్ పార్క్ ఎచ్చట కలదు? పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జింకల పార్కు లు కలవు? 2 (నెల్లూరు జిల్లా కండలేరు డ్యామ్ వద్ద కండలేరు జింకల పార్కు మరియు చిత్తూరు జిల్లా చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో జింకల పార్కు)

రాష్ట్రంలో ఉన్న 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో, ఏ కేంద్రం విస్తీర్ణంలో పెద్దది? రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది? 1972.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధిక సాంద్రత గల అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? తూర్పు గోదావరి జిల్లా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తక్కువ సాంద్రత గల అడవులు  ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? కృష్ణాజిల్లా (503 చదరపు కిలోమీటర్లు).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రెండో అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? శ్రీకాకుళం (1305 చదరపు కిలోమీటర్లు)

భారతదేశంలో గల అటవీ భూముల విస్తీర్ణం లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 9వ స్థానంలో.

AP Forest Development Corporation ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1975లో

A.P.Geography

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? నంద్యాల ( కర్నూలు జిల్లా)

రాష్ట్రంలో పొగాకు పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? రాజమండ్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? లామ్ ( గుంటూరు జిల్లా )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు? అంబాజీపేట, రాజోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిపాయలు పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు?  ఎర్రగుంట్ల (కడప జిల్లా).