Showing posts with label A.P.Economy. Show all posts
Showing posts with label A.P.Economy. Show all posts

Monday, 27 January 2020

A.P.Economy Bits for APPSC Group 2 Exam

వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏ రోజు నుండి అమల్లోకి రానుంది? 15 అక్టోబర్, 2019.

వైఎస్సార్ రైతు భరోసా పథకం లో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరమునకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? రూ.12,500/-

2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడిలో GST ద్వారా ఎంత శాతం లభించింది? 35%.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగుభూమి శాతం ఎంత? 37.08%.

ప్రపంచ చేపల ఉత్పత్తిలో  ఆంధ్ర ప్రదేశ్ వాటా ఎంత? 1.61%.

భారతదేశంలోనే మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

భారతదేశంలో మొదటి కోస్టల్ కారిడార్ ఏది? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.

భారతదేశంలో LED వీధి లైట్లు ఏర్పాటు లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి? 14

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపాలిటీలు కలవు? 71

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని నగర పంచాయతీలు కలవు? 25

ప్రస్తుతం మీసేవ ద్వారా ఎన్ని రకాల సేవలు అందిస్తున్నారు? 390.

2018 19 ఆంధ్ర ప్రదేశ్ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? 1059

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అధిక తెల్ల రేషన్ కార్డులు గలవు? తూర్పుగోదావరి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అల్ప సంఖ్య లో తెల్ల రేషన్ కార్డులు కలవు? విజయనగరం

2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ షాపుల సంఖ్య ఎంత? 28,510

భూకమతాల వివరాలు (వ్యవసాయ గణాంకాలు) ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ప్రతి 5 సంవత్సరాలకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమేట్ టిక్ జోన్లు ఎన్ని? 6

నికర పంట విస్తీర్ణానికి, స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది ఏది? పంటల తీవ్రత (cropping intensity)

2019 అక్టోబర్ 15 నుంచి అమలు పర్చనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూ12,500/- లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే సహాయం ఎంత? కేంద్రం రూ. 6,000/- రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500/-.

వైఎస్ఆర్ భీమా కింద రైతు ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆత్మహత్య ద్వారా మరణించినా బాధిత కుటుంబానికి అందే సహాయం ఎంత? 7 లక్షల రూపాయలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కామతాలు ఏ రకానికి చెందినవి? ఉపాంత కమతాలు.

2018 - 19 లో రాష్ట్రంలో  నికర సేద్య విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? అనంతపురం

2018 - 19 లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం

కాలువల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? గుంటూరు

చెరువుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? విజయనగరం

బావుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

చెరువుల ద్వారా నికర నీటి పారుదల భూమి తక్కువగా ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

2018 -19 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా ఏది? గుంటూరు

2018-19 సంవత్సరానికి అతి తక్కువ వ్యవసాయ రుణాలు పొందిన జిల్లా ఏది? విజయనగరం.


Sunday, 26 January 2020

A.P.Economy Bits for APPSC Exams

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉన్నాయి? 19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? 13

భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ఎంత ? 1

కొబ్బరి సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ? నాలుగో స్థానం

పామాయిల్ ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 1

మాంసం ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 4

కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ? 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? 32

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతు బజార్ల సంఖ్య ఎంత? 95

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల శాతం ఎంత? 22.63%

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జాతీయ పార్కులు కలవు? 3

పట్టు ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పబడిన SEZ ల సంఖ్య ఎంత? 19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా మార్కెట్ యార్డుల సంఖ్య ఎంత? 324

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సగటు పరిమాణం ఎంత? 1.06 హెక్టార్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ట సగటు కమతం ఏ జిల్లాలో గలదు? అనంతపురం జిల్లా (1.76 )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రోజున పొగ రహిత రాష్ట్రంగా ప్రకటించారు? 8 జూలై 2017

Tuesday, 21 January 2020

A.P.Economy Bits in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద విస్తీర్ణం గల జిల్లా ఏది? అనంతపురం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లా ఏది? శ్రీ కాకుళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా గల జిల్లా ఏది? తూర్పు గోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది? విజయనగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక గ్రామాలు గల జిల్లా ఏది? విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ గ్రామాలు గల జిల్లా ఏది? గుంటూరు

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పట్టణాల సంఖ్య ఎంత? 195

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక పట్టణాలు గలవు? చిత్తూరు(22).

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ పట్టణాలు గలవు? నెల్లూరు(10).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ఎంత? 304

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక జనసాంద్రత గలదు? కృష్ణాజిల్లా (518).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లా అతి తక్కువ జన సాంద్రత కలిగి ఉన్నది? కడప (188)

2001 -11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు ఎంత ? 9.21 శాతం

2001 -11 మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన జిల్లా ఏది? కర్నూలు (14.85%)

2001-11 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన జిల్లా ఏది? పశ్చిమగోదావరి( 3.58 %)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఏ జిల్లాలో అధిక పురుష జనాభా నమోదైంది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ పురుష జనాభా నమోదయింది? విజయనగరం

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక స్త్రీ జనాభా నమోదయింది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అతి తక్కువ స్త్రీ జనాభా నమోదయింది? విజయనగరం

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయిన సెక్స్ రేషియో ఎంత? 997

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక సెక్స్ నమోదయింది? విజయనగరం(1019)

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ సెక్స్ నమోదయింది? అనంతపురం( 977)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారని నమోదయింది? ఆరు జిల్లాలు. అవి విజయనగరం (1019), శ్రీకాకుళం (1015), తూర్పుగోదావరి (1007), విశాఖపట్నం(1006), పశ్చిమ గోదావరి (1004), గుంటూరు(1003)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక గ్రామీణ జనాభా నమోదయింది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ గ్రామీణ జనాభా నమోదయింది? విజయనగరం.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎంత? 29.47%

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక పట్టణ జనాభా శాతం నమోదైంది? విశాఖపట్టణం (47.45 %).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ జనాభా శాతం నమోదైంది? శ్రీకాకుళం (16.16 %)

Thursday, 16 January 2020

AP Economy Bits, AP Geography Bits

బొగ్గులో ఉండే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలు. అవి ఆంథ్ర సైట్, బిట్యూమినస్, లిగ్నైట్ మరియు బీట్

అత్యంత శ్రేష్టమైన బొగ్గు ఏది? ఆంథ్ర సైట్

అత్యంత తక్కువ శ్రేష్టమైన బొగ్గు ఏది? పీట్

భారతదేశంలో అధికంగా లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? బిట్యూమినస్ మినిట్స్

ఆంధ్రప్రదేశ్లో అధికంగా లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? బిట్యూమినస్

భారతదేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏది? రాణిగంజ్

దేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏది? ఘరియా(ఝార్ఖండ్)

ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారత దేశ ఉత్పత్తి ఎంత శాతం? 2 శాతం

భారతదేశంలో మొదటిసారిగా యురేనియం నిల్వలను ఏ ప్రాంతంలో గుర్తించారు? జాదుగూడా (ఝార్ఖండ్)

ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన యురేనియం క్షేత్రం ఏది? తుమ్మలపల్లి (వైఎస్ఆర్ కడప జిల్లా)

యురేనియం యొక్క ముడి ఖనిజం ఏది? పిచ్ బ్లడ్

ప్రపంచంలో యురేనియం నిల్వలు అధికంగా గల దేశం ఏది? ఆస్ట్రేలియా

ప్రపంచంలో యురేనియం అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? కజకిస్తాన్

థోరియం యొక్క ముడి ఖనిజం పేరు ఏమిటి? మోనజైట్

ప్రపంచంలో థోరియం నిల్వలు మరియు ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో గల దేశం ఏది? భారతదేశం

భారతదేశంలో థోరియం నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

భారతదేశంలో థోరియంను  అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కేరళ

ఆంధ్రప్రదేశ్లో థోరియాన్ని అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది? విశాఖపట్టణం

ఆంధ్రప్రదేశ్లో థోరియం నిల్వలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? భీమునిపట్నం పట్నం( విశాఖపట్నం జిల్లా)

Bits on AP Economy, Bits on AP Geography

Andhra Pradesh mineral Development Corporation ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 24 ఏప్రిల్ 1961

ఆంధ్రప్రదేశ్లో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? అగ్నిగుండాల( గుంటూరు జిల్లా)

భారతదేశంలో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్

భారతదేశంలో రాగిని అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ నిల్వలు అత్యధికంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం.

భారతదేశంలో బాక్సైట్ నిల్వలు మరియు ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఒడిశా

భారతదేశంలో బాక్సైట్ నిల్వలు పరంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో మాంగనీస్ నిల్వలు అధికంగా కల జిల్లా ఏది? శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్లో మాంగనీస్ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి? కోడూరు (శ్రీకాకుళం), గరివిడి (విజయనగరం)

భారతదేశంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఒడిశా

భారతదేశంలో మాంగనీస్ ను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర

ఆంధ్రప్రదేశ్లోని మాంగనీస్ నిక్షేపాలు ప్రధానంగా ఏ రకమైన శిలకు సంబంధించినవి ? కోడూరైట్

ఆంధ్రప్రదేశ్లో సీసం నిక్షేపాలు ఎక్కువగా విస్తరించిన జిల్లా ఏది? కర్నూలు

భారతదేశంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఝార్ఖండ్

భారతదేశంలో ఇనుము అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఒడిశా

ఆంధ్రప్రదేశ్లో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

భారతదేశంలో బంగారం నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రం ఏది? కర్ణాటక

ఆంధ్రప్రదేశ్లో బంగారం లభించే ప్రాంతాలు ఏవి? రామగిరి, పెనుగొండ (అనంతపురం జిల్లా), దుగ్గల్ మండలం, జొన్నగిరి (కర్నూలు జిల్లా), మల్లప్ప కొండ, పెద్దపర్తి కొండ , చిత్ర గుంట (చిత్తూరు జిల్లా)

భారతదేశంలో అపటైట్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్.

ఆంధ్ర ప్రదేశ్ లో అపటైట్ నిల్వలు మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం

అపటైట్ ను దీని తయారీలో ఉపయోగిస్తారు? ఫాస్పేట్ ఎరువులు, పాస్ఫారిక్ ద్రావణాల తయారీలో

భారతదేశంలో ముగ్గురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి క్షేత్రం ఏది? మంగంపేట (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి మిల్లులు అధికంగా గల ప్రాంతం ఏది? రైల్వేకోడూరు( వైఎస్ఆర్ కడప జిల్లా)

ముగ్గురాయిని ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారు? పెట్రోలియం త్రవ్వకంలో వాడే డ్రిల్లింగ్ మడ్ గా ఉపయోగిస్తారు.

ఇటీవల జరిపిన పరిశోధనల్లో మంగంపేట గనులలో ముగ్గురాయి తో పాటు ఏ కర్బన రూపాన్ని గుర్తించారు? బ్లాక్ సెల్ పుల్లరీన్

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయడంలో దేనిని ఉపయోగిస్తారు? పుల్లరీన్

సున్నపురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? కర్నూలు జిల్లా

ఆంధ్రప్రదేశ్లో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి? బేతంచెర్ల, కోయిలకుంట్ల, నందికొట్కూర్( కర్నూలు జిల్లా), జమ్మలమడుగు, మైదుకూరు (వైఎస్ఆర్ కడప జిల్లా), ద్వారకాతిరుమల భీమడోలు (ప.గో జిల్లా)

సిమెంట్ పరిశ్రమకు ప్రధానమైన ముడి పదార్థం ఏది? సున్నపురాయి

భారతదేశంలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక

భారతదేశంలో సున్నపురాయి ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆస్బెస్టాస్ నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప జిల్లా

భారతదేశంలో ఆస్బెస్టాస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? రాజస్థాన్

భారతదేశంలో ఆస్బెస్టాస్ ను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ప్రపంచంలో మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం

భారతదేశంలో మైకా ను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో మైకా నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? నెల్లూరు జిల్లా

భారతదేశంలోని లోతైన మైకా గని ఏది? షా గని గూడూరు (నెల్లూరు జిల్లా)

ఆంధ్రప్రదేశ్లో గ్రాఫైట్ నిల్వలు అధికంగా గల జిల్లా ఏది? కృష్ణాజిల్లా

భారతదేశంలో గ్రాఫైట్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్

ప్రస్తుతం భారతదేశంలో అధికంగా గ్రాఫైట్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తమిళనాడు

దేనిని నల్ల సీసం అని కూడా పిలుస్తారు? గ్రాఫైట్ ను

భారతదేశంలో వజ్రాలు అధికంగా లభించే ప్రాంతం ఏది? పన్నా (మధ్యప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్లో వజ్రాలు అధికంగా లభించే ప్రాంతం ఏది? వజ్రకరూరు (అనంతపురం జిల్లా)

Bits on AP Economy, Bits on AP Geography

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది ఏది? గోదావరి నది
గోదావరి నది జన్మస్థలం ఏది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో నాసిక్ సమీపాన గల త్రయంబకం.
గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మూడు రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతం దేశంలో ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉంది? 7 రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక మరియు ఒడిశా.
గోదావరి నది మొత్తం పొడవు ఎంత? 1465 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పొడవు ఎంత? 250 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్ లోకి గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది? బూర్గంపహాడ్ మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఎంత? 24%.
కృష్ణా నది జన్మస్థలం ఏది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వరం.
కృష్ణా నది ఎన్ని రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? నాలుగు రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్.
కృష్ణా నది మొత్తం పొడవు ఎంత? 1,400 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ప్రవహించే పొడవు ఎంత? 485 కిలోమీటర్లు.
కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామం వద్ద.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎంత? 27.4 శాతం
తుంగభద్రా నది జన్మస్థలం ఏది? కర్ణాటకలోని వరాహ కొండలు
తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద
రాష్ట్రంలో అతి పొడి ప్రాంతమేది? హగరీ నదీ లోయ ప్రాంతం
హగరీ నది ఏ నది యొక్క ఉపనది? తుంగభద్రా నది
పెన్నా నది యొక్క జన్మస్థలం ఏది? కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో గల నంది దుర్గ కొండలు.
పెన్నా నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని చౌటుప్పల్ వద్ద ప్రవేశిస్తుంది.
పెన్నానది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ప్రవహిస్తుంది? అనంతపురం, కడప మరియు నెల్లూరు జిల్లాలలో.
పెన్నా నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
చిత్రావతి ఏ నది యొక్క ఉపనది? పెన్నా నది.
కుందేరు, సగిలేరు, హంద్రీ నదులు ఏ నది యొక్క ఉపనదులు? పెన్నా నది
పాపాఘ్ని, చెయ్యేరు నదులు ఏ నదుల యొక్క ఉపనదులు? పెన్నా నది

Thursday, 13 July 2017

AP. Economy Bits, A P Economy Bits, A.P.Economy Bits



ఆంధ్రప్రదేశ్ లో  ఆహారపంటల కింద వినియోగిస్తున్న భూమి(2014-15) – 52.02 లక్షల హె.

ఆంధ్రప్రదేశ్ లో ఆహారపంటల కింద అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా- కృష్ణా.

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లో ఆహారేతర పంటల కింద అధిక సాగు విస్తీర్ణం కలిగిన జిల్లా- ప్రకాశం

ఆంధ్రప్రదేశ్ లో పప్పుధాన్యాల ఉత్పత్తిలో  అగ్రస్థానంలోనున్న జిల్లా(2014- 15) – కర్నూల్.

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లో  పప్పుధాన్యాల పంటల కింద అధిక సాగు విస్తీర్ణం కలిగిన జిల్లా- అనంతపురం .

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన వరి ఉత్పాదకత – 3532 కి.గ్రా. హెక్టారుకు.

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం భూమిలో అడవుల శాతం – 22.6

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లో పంటల తీవ్రత సూచీ సంఖ్య – 97.05

జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏర్పాటు తేదీ- 31-7-2007.

2010- 11 లో ఆంధ్రప్రదేశ్ లో భూకమతం సగటు విస్తీర్ణం – 1.06 హె.

10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజెక్టు – భారీ నీటి పారుదల ప్రాజెక్ట్.

2,000 హెక్టార్ల కంటే తక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజెక్టు – చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్ట్.

సంవత్సరంలో ఒక పంట కింద సాగు చేసిన భూమిని- నికర సాగు భూమి అని అంటారు.

కాలువల కింద నికర సాగు భూమి విస్తీర్ణం ఎక్కువగానున్నది.

2014- 15 లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సాగు జలాలు అధికంగా వున్న జిల్లా – పశ్చిమగోదావరి జిల్లా.

ఒకసారి కంటే ఎక్కువ సాగుభూమి అధికంగానున్న జిల్లా- గుంటూరు.

గొట్టపు బావుల కింద నికర సాగుభూమి అధికంగానున్న రాయలసీమ ప్రాంత జిల్లా – కడప.

వెలిగొండ ప్రాజెక్ట్ కృష్ణానది పై నిర్మించబడుచున్నది.

తారక రామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బుడమేరు నది పైనున్నది.

మద్దిగెడ్డ ప్రాజెక్ట్  జంజావతి నది పై నిర్మించబడినది.

ఆంధ్ర రిజర్వాయరు చంపావతి నది పై నున్నది.


మోపాడు మన్నేరు నది పై నిర్మించబడ్డది.