Sunday, 12 January 2020

A.P.History Bits

తొలి కాకతీయులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు

దానార్ణవుడు ఏ వంశ రాజు ? తూర్పు చాళుక్య వంశం

కాకత్య గుండన ఎవరి సేనాని? రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుని సేనాని

కాకత్య గుండన చాళుక్య రాజయిన దానార్ణవుడికి ఏ రాజ్యం ఆక్రమించడానికి సహాయపడ్డాడు ? వేంగి రాజ్యం

దానార్ణవుడు తనకు సహాయం చేసిన కాకతి గుండనను సత్కరించి అతని కోరిక మేరకు ఎవరికి మాగల్లు గ్రామము చేసినట్టు మాగల్లు శాసనం తెలుపుతుంది? దొమ్మన శర్మ అనే  బ్రాహ్మణుడికి

మాగల్లు శాసనం,కాకతీయులు ఏ వంశానికి చెందినవారని తెలుపుతుంది? సామంత విట్టి శాసనం.

బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఎవరిని కాకతీయ వంశ మూల పురుషుడిగా పి.వి.పరబ్రహ్మశాస్త్రి పేర్కొన్నారు? వెన్న భూపతి

ఏ శాసనం కాకతీయులను శూద్ర వంశానికి చెందిన దుర్జయులుగా పేర్కొన్నది? బయ్యారం చెరువు శాసనం

కాజీపేట శాసనాన్ని ఎవరు జారీ చేశారు? మొదటి బేతరాజు

కాకతీయుల తొలి చరిత్రను తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం

కాజీపేట శాసనం ప్రకారం కాకతీయ రాజులలో ప్రధముడు ఎవరు? మొదటి బేతరాజు

మొదటి బేతరాజు విజయాలను తెలిపే శాసనం ఏది? కాజీపేట శాసనం

శనిగరం శాసనాన్ని ఎవరు జారీ చేశారు? రెండవ ప్రోలరాజు

సామంతులుగా కాకతీయుల చివరికి శాసనం ఏది? శనిగరం శాసనం

రెండవ ప్రోలరాజు కుమారుడు ఎవరు?రుద్రదేవుడు

కాకతీయ సామ్రాజ్య నిజవ్యవస్థాపకుడు ఎవరు? రుద్రదేవుడు

హనుమకొండ శాసనాన్ని జారీ చేసినది ఎవరు? రుద్రదేవుడు

ఏ శాసనం కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలియజేస్తుంది? హన్మకొండ శాసనం

మోటుపల్లి శాసనాన్ని జారీ చేసినది ఎవరు? గణపతి దేవుడు

కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలియజేసే శాసనమేది? మోటుపల్లి శాసనం

మోటుపల్లి శాసనం, మోటుపల్లెను ఏ విధంగా పేర్కొన్నది? దేశీయ కొండ పట్టణంగా.

ఎవరి పరిపాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లిని దర్శించాడు? రుద్రమదేవి

రుద్రమదేవి పట్టాభిషేకం గురించి తెలియజేయు శాసన మీది? జన్నిగ దేవుని దుర్గ శాసనం

ఏ శాసనం గోళకీ మఠానికి చెందిన శైవ గురువుల గురించి వివరాలను అందిస్తుంది? మాల్కపురం శాసనం

కాకతీయుల కాలంలో దేవాలయ నిర్వహణను గురించి తెలిపే శాసన మేదీ? మాల్కపురం శాసనం

కాకతీయుల కాలంలో ప్రసూతి వైద్యశాలను గురించి ప్రస్తావించిన శాసనం ఏది? మాల్కపురం శాసనం

చందుపట్ల శాసనాన్ని జారీ చేసినది ఎవరు? కాయస్థ ప్రసాదిత్యుడు.

రాణి రుద్రమదేవి హత్య గురించి తెలియజేయు శాసనం ఏది? చందుపట్ల శాసనం

బీదర్ కోట శాసనాన్ని ఎవరు జారీ చేశారు? రేచర్ల ప్రసాదిత్యుడు

రాణి రుద్రమదేవిని రాయ గజకేసరి అని పేర్కొన్న శాసనం ఏది? బీదర్ కోట శాసనం

తేరాల శాసనాన్ని ఎవరు జారీ చేశారు? ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు రాయగజకేసరి ముద్ర ఉన్న నాణేలను ముద్రించినట్లు తెలియజేయు శాసనం ఏది? తేరాల శాసనం

సలకలవీడు శాసనాన్ని జారీ చేసినది ఎవరు? ప్రతాపరుద్రుడు

ఏ శాసనం, పాండ్యుల మీద ప్రతాపరుద్రుని విజయానికి గుర్తుగా , శ్రీ రంగనాథదేవ స్వామికి సలకలవీడు గ్రామాన్ని దానం చేసినట్లు తెలుపుతుంది? సలకడవీడు శాసనం

ఏ శాసనం లో కాకతీయుల కాలం నాటి అన్ని రకాల పన్నులు గురించి పేర్కొనబడింది? సలకలవీడు శాసనం

మట్టి వాడ శాసనాన్ని జారీ చేసినది ఎవరు? గణపతి దేవుడు

ఏ శాసనం భిన్న వాణిజ్య వస్తువులపై విధించే సుంకాలను పేర్కొన్నది? మట్టివాడ శాసనం

విలస తామ్ర శాసనాన్ని జారీ చేసినది ఎవరు? ప్రోలయ నాయకుడు

కాకతీయుల కాలం నాటి మహమ్మదీయ దండయాత్రలను వర్ణించిన శాసన మేదీ? విలస తామ్ర శాసనం

కాకతీయుల పతనాన్ని గురించి తెలియజేయు శాసనం ఏది? విలస తామ్ర శాసనం

కాకతీయులలో చివరివాడైన ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపే శాసనం ఏది? విలస తామ్ర శాసనం

కలువచేరు శాసనాన్ని జారీ చేసినది ఎవరు? అనితల్లి

వరంగల్ పై ముస్లింలు ఎనిమిది సార్లు దండయాత్ర చేశారని తెలిపే శాసనం ఏది? అనితల్లి వేయించిన కలువచేరు శాసనం

ప్రోలయవేమారెడ్డిని పంట వంశోధృవుడు అని ఏ శాసనం పేర్కొన్నది? కలువచేరు శాసనం

మొదటి బేతరాజు ఎవరి వద్ద సామంతుడిగా ఉండేవాడు? పశ్చిమ చాళుక్యుల వద్ద

కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి బేతరాజు

మొదటి బేతరాజు యొక్క మంత్రి పేరు ఏమిటి? నారాయణయ్య

యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయం ను పునరుద్దరించినది ఎవరు? మొదటి బేతరాజు యొక్క మంత్రి నారాయణయ్య

మొదటి బేతరాజు యొక్క బిరుదు ఏమిటి? కాకతీ పురాధినాధ

మొదటి ప్రోలరాజుకు హనుమకొండ విషయాన్ని ఇచ్చిన పశ్చిమ చాళుక్య రాజు పేరేమిటి? మొదటి సోమేశ్వరుడు

మొదటి ప్రోలరాజు మొదటిసారిగా తన నాణెములు పై ఏ ముద్రను ముద్రించాడు? వరాహ ముద్రను

మొదటి ప్రోలరాజు గురువు పేరు ఏమిటి? రామేశ్వరుడు

కేసరి సముద్రం(కేస సముద్రం), జగత్ కేసరి సముద్రం అనే చెరువులను నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు

మొదటి ప్రోలరాజు కి ఉన్న బిరుదులు ఏమిటి? అరిగజకేసరి,కాకతీయ వల్లభ

రెండవ బేతరాజుకి సబ్బి మండలాన్ని ఇచ్చిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? 6వ విక్రమాదిత్యుడు

రెండవ బేతరాజు తన గురువు రామేశ్వర పండితుని గౌరవార్థం హనుమకొండ సమీపంలో నిర్మించిన నగరం ఏది? శివపురి

రెండవ బేతరాజు బిరుదులు ఏమిటి? విక్రమచక్రి

రెండవ ప్రోలరాజు బిరుదులు ఏమిటి? మహామండలేశ్వరా

తొలి కాకతీయులు ప్రసిద్ధుడు ఎవరు? రెండవ ప్రోలరాజు

శ్రీశైలం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి  అచ్చట విజయ స్తంభాన్ని నాటించిన కాకతీయ రాజు ఎవరు? రెండో ప్రోలరాజు

ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? రెండవ ప్రోలరాజు

రెండో ప్రోలరాజు ఎలా మరణించాడు? వెలనాటి రాజేంద్రునితో జరిగిన యుద్ధంలో.

కాకతీయులలో మొదటిసారిగా  పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని పరిపాలించిన రాజు ఎవరు? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు

ఎవరి కాలం నుండి కాకతీయులపై పశ్చిమ చాళుక్యుల నియంత్రణ అంతమైంది? మొదటి ప్రతాపరుద్రుని కాలం నుండి

మొదటి ప్రతాపరుద్రునికి కల బిరుదు ఏమిటి? వినయ విభూషణుడు

మొదటి ప్రతాపరుద్రుని భార్య అయిన అన్నాల దేవి వేయించిన శాసనం ఏది? ద్రాక్షారామ శాసనం

కాకతీయులు మొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? రుద్రదేవుడు

పల్నాటి యుద్ధంలో నలగామరాజు కి సహాయంగా వెళ్లిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు

పల్నాడు యుద్ధం తర్వాత రుద్రదేవుడు ఎవరిని ఓడించి ధరణికోటను ఆక్రమించాడు? దొడ్డ భీముని

రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన దేవాలయం పేరు ఏమి? రుద్రేశ్వరాలయం లేదా త్రికూటేశ్వర ఆలయం లేదా వెయ్యి స్తంభాల గుడి

రుద్రదేవుని సమకాలికుడైన శైవమత గురువు ఎవరు? మల్లికార్జున పండితుడు.

రుద్రదేవుని సేనాపతి ఎవరు? ఎల్లంకి గంగాధరుడు

హన్మకొండలో ప్రసన్న కేశవ దేవాలయంను నిర్మించినది ఎవరు? ఎల్లంకి గంగాధరుడు

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని చేపట్టి రాజధాని హన్మకొండ నుండి ఓరుగల్లు కి మార్చిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు

ఓరుగల్లులో స్థిర పడిన నల్గొండ వారి కొరకై రుద్రదేవుడు నిర్మించిన వీధి పేరు ఏమిటి? పానుగంటి వాడ

రుద్రదేవుని సంస్కృత రచన ఏది? నీతిసారం

రుద్రదేవుని బిరుదు ఏమిటి? విద్యాభూషణ ( వినయవిభూషణ)

రుద్రదేవుని సోదరుని పేరు ఏమిటి? మహాదేవుడు

రుద్రదేవుడు  ఎవరిని దత్త స్వీకరణ చేసుకున్నాడు? తమ్ముడు మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడిని

ఎవరి కాలంలో కాకతీయ యాదవ సంఘర్షణ ఆరంభమైనది? రుద్రదేవుని కాలంలో

కాకతీయ రాజ్యం పై దండెత్తి రుద్రదేవుని చంపి అతని తమ్ముడు కుమారుడైన గణపతిదేవుని బందీగా తీసుకువెళ్లిన యాదవ రాజు ఎవరు? దేవగిరి జైత్ర పాలుడు

మహాదేవుని శైవమత గురువు ఎవరు దృవేశ్వర పండితుడు.
   

No comments:

Post a Comment