Saturday, 6 April 2013

Indian Polity- Articles in Telugu



భారత రాజ్యాంగ అధికరణంలు
విభాగము-1
భారతదేశ భూభాగము
అధికరణం

1
నామధేయము, భూభాగము
2
నూతన రాష్త్రముల విలీనము, ఏర్పాటు
3
నూతన రాష్త్రముల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ
4
రాష్ట్ర విభజనతో బాటుగా షెడ్యూల్లను మార్చవలెను

విభాగము-2
పౌరసత్వం
అధికరణం

5
రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పటి పౌరసత్వం
6
పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం
7
పాకిస్థాన్ కు వలస వెళ్ళిన వారి పౌరసత్వం
8
భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతి ప్రజలు- వారి పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం
9
స్వచ్చందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన భారతీయులు
10
భారతీయుడు ఎప్పటికి భారతీయుడే
11
పౌరసత్వం గురించి శాసనములు రూపకల్పనలో పార్లమెంట్ అధికారాలు


విభాగము-3
ప్రాధమిక హక్కులు
అధికరణం

12
నిర్వచనం
13
ప్రాధమిక హక్కులను హరించివేయు శాసనములు చెల్ల నేరవు

సమానత్వపు హక్కు
అధికరణం

14
చట్టం ముందు అందరు సమానులే
15
కుల, మత, లింగ వివక్షతలకు తావులేదు
16
ప్రభుత్వోద్యోగాల్లో అందరికి సమాన ఉద్యోగావకాశాలు
17
అంటరానితనం నిషేధం
18
బిరుదులు నిషేధం

స్వేచ్ఛ
అధికరణం

19
భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైనవి
20
ఒక నేరానికి ఒకేసారి శిక్ష విధించాలి
21
వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు
21A
విద్యా హక్కు
22
నిర్భందము- పరిమితులు


దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు
అధికరణం

23
శ్రమ శక్తిని దోపిడీ చేయరాదు
24
చిన్న పిల్లల చేత ఫ్యాక్టరీలలో పనిచేయించరాదు

మత స్వేచ్ఛ
అధికరణం

25
మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు
26
మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ
27
మతవ్యాప్తికై పన్ను విధించరాదు
28
విద్యాలయాలలో మత బోధన పనికిరాదు

సాంస్కృతిక, విద్యాహక్కులు
అధికరణం

29
అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ
30
విద్యాలయాలను స్థాపించి, నిర్వహించుకోనుటలో అల్ప సంఖ్యాకుల హక్కులు
31A
భూములు స్వాధినమునకు సంబందించిన శాసనములు
31B
కొన్ని శాసనములు న్యాయసమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటవుతాయి
31C
ఆదేశిక సూత్రముల లక్ష్య సాధనకై చేయబడిన శాసనములకు రాజ్యంగ రక్షణ

Sunday, 10 March 2013

Indian Geography Bits in Telugu



బాజ్రా( సజ్జలు), గుజరాత్ లో అత్యధికంగా పండిస్తారు.

టీ, కాఫీ రెండు పండించు ప్రాంతాలు- దక్షిణ భారత దేశం.

కొబ్బరి ఉత్పాదన అధికంగా కేరళ రాష్ట్రంలో జరుగుతుంది.

చెరకు పంట భారత దేశంలో పక్వానికి వచ్చు కాలం 9 నెలలు.

భారతదేశంలో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ అని పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్ర మిరుపను అత్యధికంగా పండిస్తుంది.

అల్లం పంటను అధికంగా పండించు రాష్ట్రము- కేరళ

అత్యధికంగా భూమి నీటిపారుదల కలిగిన రాష్ట్రం- ఉత్తరప్రదేశ్

వజ్రపు గనులు నెలకొని ఉన్న చోటు- మధ్యప్రదేశ్

సైలెంట్ వ్యాలీ ఉన్న రాష్ట్రం- కేరళ.

భారతదేశంలో  పప్పుదినుసుల పంట పై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేక పోయింది.

భారత్- యూరోప్ లు  మద్య దూరాన్ని తగ్గించిన కాలువ సూయజ్ కాలువ.

న్యూక్లియర్ విద్యుచ్చక్తి ఉత్పాదనలో ఫ్రాన్స్ దేశం ప్రపంచంలో ముందు ఉంది.

భారత దేశం 8 పిన్ (PIN) భాగాలుగా విడదీయబడింది.

టీ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమయినప్పటికి నీరు నిల్వ ఉండకూడదు.

మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించు రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

గోధుమ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

వరి పంట సాగుకు నీరు నిలువ ఉండవలసిన అవసరం ఉంది.

భారతదేశంలో బాగా పేరుపొందిన మెట్ట సాగు పంట బాజ్రా( సజ్జలు)

భారతదేశంలో చెరకు పంట సాగును పిలుచు ఉదాహరణ- ఇరిగేటేడ్ వ్యవసాయం.

హర్యానా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్నది.

అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రం- మధ్యప్రదేశ్.

మహారాష్ట్ర రాష్ట్రంలో రహదారుల పొడవు అధికంగా ఉంది.

తోడాలు నివసించు ప్రదేశం- తమిళనాడు.

టేక్ అధికంగా పెరుగు చోటు – మధ్య భారత దేశం.

ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నెలకొని ఉన్న చోటు- డెహ్రాడూన్.

పంజాబ్ లోని ప్రధాన వాణిజ్య పంట- ప్రత్తి.

భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది.

నర్మదానది రిఫ్ట్ వ్యాలీ గుండా వెళుతుంది.