Sunday, 10 March 2013

Indian Geography Bits in Telugu



బాజ్రా( సజ్జలు), గుజరాత్ లో అత్యధికంగా పండిస్తారు.

టీ, కాఫీ రెండు పండించు ప్రాంతాలు- దక్షిణ భారత దేశం.

కొబ్బరి ఉత్పాదన అధికంగా కేరళ రాష్ట్రంలో జరుగుతుంది.

చెరకు పంట భారత దేశంలో పక్వానికి వచ్చు కాలం 9 నెలలు.

భారతదేశంలో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ అని పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్ర మిరుపను అత్యధికంగా పండిస్తుంది.

అల్లం పంటను అధికంగా పండించు రాష్ట్రము- కేరళ

అత్యధికంగా భూమి నీటిపారుదల కలిగిన రాష్ట్రం- ఉత్తరప్రదేశ్

వజ్రపు గనులు నెలకొని ఉన్న చోటు- మధ్యప్రదేశ్

సైలెంట్ వ్యాలీ ఉన్న రాష్ట్రం- కేరళ.

భారతదేశంలో  పప్పుదినుసుల పంట పై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేక పోయింది.

భారత్- యూరోప్ లు  మద్య దూరాన్ని తగ్గించిన కాలువ సూయజ్ కాలువ.

న్యూక్లియర్ విద్యుచ్చక్తి ఉత్పాదనలో ఫ్రాన్స్ దేశం ప్రపంచంలో ముందు ఉంది.

భారత దేశం 8 పిన్ (PIN) భాగాలుగా విడదీయబడింది.

టీ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమయినప్పటికి నీరు నిల్వ ఉండకూడదు.

మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించు రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

గోధుమ పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం- ఉత్తరప్రదేశ్.

వరి పంట సాగుకు నీరు నిలువ ఉండవలసిన అవసరం ఉంది.

భారతదేశంలో బాగా పేరుపొందిన మెట్ట సాగు పంట బాజ్రా( సజ్జలు)

భారతదేశంలో చెరకు పంట సాగును పిలుచు ఉదాహరణ- ఇరిగేటేడ్ వ్యవసాయం.

హర్యానా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్నది.

అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రం- మధ్యప్రదేశ్.

మహారాష్ట్ర రాష్ట్రంలో రహదారుల పొడవు అధికంగా ఉంది.

తోడాలు నివసించు ప్రదేశం- తమిళనాడు.

టేక్ అధికంగా పెరుగు చోటు – మధ్య భారత దేశం.

ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నెలకొని ఉన్న చోటు- డెహ్రాడూన్.

పంజాబ్ లోని ప్రధాన వాణిజ్య పంట- ప్రత్తి.

భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది.

నర్మదానది రిఫ్ట్ వ్యాలీ గుండా వెళుతుంది.

No comments:

Post a Comment