‘పద్మ’అవార్డులను కేంద్ర ప్రభుత్వం
శుక్రవారం(25.01.2013) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా
నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.
రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడికి పద్మ భూషణ్
అవార్డు లభించగా, డా. చిట్టా వెంకట సుందరం, ఎం రామకృష్ణరాజులకు పద్మశీ పురస్కారాలు దక్కాయి.
బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ పురస్కారం దక్కింది.
నానాపటేకర్, డా. రాధిక, శ్రీదేవి, సురభి బాబ్జి, జి. అంజయ్య, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ప్రముఖ గాయని ఎస్.జానకికి తమిళనాడు కోటాలో పద్మ భూషణ్ అవార్డు లభించింది. షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. మొత్తం మీద రాష్ట్రం నుంచి 8 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి
No comments:
Post a Comment