శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకులు
ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు శ్రీ చాంతములుడు
ఇక్ష్వాకులు రాజధాని విజయపురి
వీరపురుషదత్తుని పరిపాలనాకాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది.
బోధి వృక్షారాధన ఇక్ష్వాకుల కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది.
ధాన్యకటక సంఘారామంను ఆదర్శంగా తీసుకుని టిబెట్ లోని దాపంగ్ సంఘారామాన్ని నిర్మించారు.
‘ధర్మామృత’ కావ్య రచయిత నయసేనుడు.
ఆనందగోత్రినులు వంకేశ్వరుని భక్తులు .
ఇక్ష్వాకులు కాలంలో నాగార్జునకొండ ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాయాన కేంద్రంగా రూపుదిద్దుకుంది.
ఇక్ష్వాకుల కాలంలో తూర్పు దేశాల నుండి బౌద్ధభిమానులు పారావత విహారం చూడటానికి వచ్చేవారు.
రాజ్ఞి అంటే దాన శాసనం.
ఇక్ష్వాకుల చిహ్నం సింహం.
ఇక్ష్వాకుల కాలంలో సంస్కృత భాష వాడకం మొదలైంది.
కాపాలిక జైనం వల్ల జైన మతం ప్రజాదరణ కోల్పోయింది.
ఆంధ్రదేశంలో మహా సాంఘీకులకు ఉన్న
పేరు అంధకులు.
కుబేరుడి పేరు భట్టిప్రోలు పేటిక శాసనంలో ఉంది.
వంద అడుగుల స్తూపాలు వేంగి విద్యాపీటంలో
ఉండేది.
కొండముది శాసనం జయవర్మ వేయించారు.
బృహత్పలాయనుల రాజధాని కోడూరు.
బృహత్పలాయను రాజ్యాన్ని పాలించిన ఏకైక రాజు జయవర్మ.
ఆంధ్రదేశంలోని కృష్ణానదిని గ్రీకులు మైసలెన్ అని వ్యవహరించేవారు.
భావవివేకుడు అనే బౌద్ధ తార్కికుడు విజయపురి విహారంలో ఉండేవాడు.
ఆనందగోత్రిక రాజ్యస్థాపకుడు కందారరాజు
కందరపురం ఆనందగోత్రికుల రాజధాని
ఆనందగోత్రికల రాజ భాష సంస్కృతం
ఆనందగోత్రికల రాజ లాంఛనం వృషభం.
గోరంట్ల తామ్ర శాసనం వేయించింది అత్తివర్మ.
‘త్రికూట పర్వతాధిపతులు’ అని ఆనందగోత్రికులని వర్ణిస్తారు.
త్రికూట పర్వతం, త్రికూటేశ్వర స్వామి ప్రశంసను స్థలమహత్యంలో పేర్కొన్నారు.
‘జనాశ్రయ ఛందోవిచ్చిత్తి’ గ్రంధ రచయిత పేరు మాధవవర్మ.
శాలంకాయనులు చిత్రరధస్వామి భక్తులు.
చిత్రరధస్వామి దేవాలయం వేంగిలో ఉండేది.
శాలంకాయనుల రాజధాని పెదవేగి.
శాలంకాయనుల రాజ లాంఛనం వృషభం.
శాలంకాయనుల రాజభాష ప్రాకృతం.
గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు తన అలహాబాద్ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు హస్తి వర్మ.
సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనంలో ప్రస్తావించిన
పల్లవ రాజు విష్ణుగోపుడు.
శాలంకాయన రాజ్యస్థాపకుడు విజయదేవ వర్మ.
బర్మా దేశంలో బౌద్ధాన్ని ప్రచారం చేసినది శాలంకాయనులు.
శాలంకాయనులు బర్మాలోని ఐరావత నదీ ప్రాంతాన్ని పాలించినట్లు, అక్కడ బౌద్ధాన్ని
ప్రచారం చేసినట్లు తెలిపే ఆధారం శశవాలంకారం.
శాలంకాయనులు ఆదరించిన సింహళ బౌద్ద పండితుడు బుద్ధదత్తుడు.
దిజ్నాగుడు అనే బౌద్ధమతాచార్యుడు తన జీవిత
చరమాంకాన్ని వేంగిలో గడిపాడు.
మూసికా నగరంగా ప్రసిద్ది చెందిన నగరం- ఇంద్రపురి.
ప్రాకృత భాషలో ఉండి, లిపి విషయంలో నాసిక్ శాసనాల నమూనాలో ఉన్న శాసనాలు ప్రాచీన పల్లవులవి.
బౌద్ద, జైన మతాలను ప్రతిఘటించి సనాతన వైదిక ధర్మాన్ని రక్షించింది ప్రాచీన పల్లవులు.
ప్రాచీన పల్లవుల రాజధాని ధాన్యకటకం.
పల్లవుల రాజ లాంఛనం వృషభం.
భైరవకొండ గుహలయాలను నిర్మించింది మొదటి నరసింహవర్మ.
అజంతా, నాసిక్ లో ఉన్న బౌద్దశిలా చైత్యం నమూనాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయం
కపోతేశ్వరాలయం.
‘దశకుమార చరిత్ర’ గ్రంధ రచయిత పేరు దండి
విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు.
గోవిందవర్మ అనే విష్ణుకుండిన రాజు కాలంలో బౌద్ధం గొప్ప పోషణను పొందింది.
విష్ణుకుండినులు మాతృభూమి వినుకొండ.
విష్ణుకుండినుల రాజ లాంఛనం సింహం.
విష్ణుకుండినుల రాజ భాష సంస్కృతం.
విష్ణుకుండినుల నాణాల పై శ్రీపర్వత అనే అక్షరాలున్నాయి.
విష్ణుకుండినులు శ్రీశైలస్వామి పాదానుద్యాతలు.
విష్ణుకుండినుల కాలంలో తూర్పు కనుమలను మలయ పర్వతంగ వ్యవహరించేవారు.
మూడో మాధవవర్మకు త్రికూట మలయాధిపతి అని పేరు.
కీసర సమీపంలో ఘటకేశ్వర ఘటికస్థానాన్ని ఇంద్రభట్టారకవర్మ స్థాపించారు.
అమరావతి బౌద్ద చైత్యాలయం అమరేశ్వరాలయంగా విష్ణుకుండినుల కాలంలో రూపాంతరం
చెందింది.
బౌద్ధంలో వజ్రయాన శాఖ ప్రబలడంతో, బౌద్ధమతం ప్రజభిమానంను కోల్పోయింది.
జైనమత పతనానికి కారణమైన కుమారీలభట్టు జయమంగళం లో జన్మించాడు.
awesome information. thank you.
ReplyDelete