Thursday, 13 July 2017

Bits from APPSC: Panchayat Secretary 2017 Screening Test held on 23.04.2017

MNREGA పథకంలో 1) చేపల సంతానోత్పతికై చెరువు  2) చిన్న అంతస్రవణ ట్యాంక్ 3) కంపోస్ట్ గుంట పనులు చేయుటకు అనుమతి వుంది.
 
గ్రామాల్లో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశం కల ప్రధాన కార్యక్రమం ఏది?  PMGSY.

రాజ్యాంగంలోని ఏ భాగం ఆంధ్రప్రదేశ్లోని PESA (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం) జిల్లాల గుర్తింపులో సహాయం అందిస్తుంది?   షెడ్యూల్ V.

PRIA సాఫ్ట్వేర్ ఏ గణాంకాలను సేకరిస్తుంది?  జమలు, ఖర్చు లెక్కలతో సహా వోచర్ నమోదులు, నగదు ఖాతా, నివేదికలు, రిజిస్టర్లు రూపొందించడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్ను ఎవరు కట్టించుకొంటారు?   గ్రామ పంచాయతీ.

సంసద్ ఆదర్శ గ్రామ యోజనలోని గ్రామాలకు నిధులు ఎక్కడ నుండి వస్తాయి? 1) గ్రామ పంచాయతీ స్వంత ఆదాయం,  2) కేంద్రం, రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఇచ్చే గ్రాంట్లు, 3) కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులు.

స్థానిక స్వయం పరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ చేయడంలో ఉద్దేశం ఏమిటి?     కుల సముదాయాల మధ్య అధికార సమతుల్యత.

సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు, జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును?   రూ.5 కోట్లు.

పంచాయత్అనే మాటకు శబ్దార్థం ఏమిటి?  సమాజంచే ఎన్నుకొన్న ఐదుగురుగౌరవనీయులైన వ్యక్తుల సభ ఢిల్లీలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు.

ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో PESA చట్టం అమల్లో ఉంది?   5.

పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ ఉంది? 33%.

రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు-   రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగో ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు?  ఎం.ఎల్. కాంతారావు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు ఉన్న జిల్లాలు ఏవి?  చిత్తూరు, కృష్ణా, గుంటూర్
తమ వ్యవసాయ ఉత్పత్తిని నిలువ చేసుకొని దానిపై కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే, కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు?   రైతు బంధు పథకం.


ఫిబ్రవరి, 2016 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెక్క గుజ్జు ట్రేడింగ్ వ్యవస్థలో ఏ చెట్ల కొనుగోలు, అమ్మకం జరగదు?   వెదురు.

2015-16 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (GSDP) ప్రాథమిక రంగపు వాటా సుమారుగా ఎంత? 30%.

మండల్ సమాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి స్థాపించిన సాముదాయిక ఆధారిత సూక్ష్మ రుణ సంస్థ పేరు ఏమిటి?  స్త్రీ నిధి.

అన్న సంజీవనిఅంటే ఏమిటి?  స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించే జనరిక్ ఔషధాల దుకాణాలు.

దివ్యాంగులను గుర్తించి, వారికి సేవలు అందించడానికి వాడే కేంద్రీయ డాటా బేస్ని ఇలా పిలుస్తారు?  సాదరెమ్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతిపథకం ఉద్దేశాల్లో ఒకటి -   కడు పేదవారికి, సంవత్సరానికి కనీసం రెండు లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే శక్తిని అందించుట.

అభయ హస్తం పథకంలో లబ్ధి పొందుటకు, స్వయం సహాయక బృందంలో సభ్యురాలైన మహిళ తన వంతు వాటాగా సంవత్సరానికి ఎంత సొమ్ము చెల్లించాలి?  Rs. 365.

NTR భరోసా పథకం కింద 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త ఫించన్లు మంజూరు చేసింది 3.5 లక్షలు.

APRIGP (గ్రామీణ సమ్మిళిత వృద్ధి పథకం)లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలు భాగమై ఉన్నాయి?  150.

రాష్ట్రాలకు గ్రాంట్ల పంపిణీకి, 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర జన సంఖ్య, విస్తీర్ణాల వెయిటేజ్ ఏ నిష్పత్తిలో తీసుకున్నది?  90:10.

జాతీయ Rurban మిషన్ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు) రెండో దశలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్లస్టర్లు (సముదాయాలు) ఎంపిక చేయబడ్డాయి?  6

2017-18 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలిపిన విధంగా, వెలుగు (ERP) అంటే సెర్ప సంస్థ ద్వారా ఎన్ని స్వయం సహాయక బృందాలు ఏర్పాటు అయినాయి?  7 లక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల (MSME) విధానం ప్రకారం 2015-2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది?  రూ.15,000 కోట్లు.

 హస్త కళాకారులు ప్రసిద్ధి చెందిన లక్క బొమ్మలు ఈ ఊరిలో తయారుచేస్తారు?  ఏటికొప్పాక.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన హస్త కళలను ప్రదర్శించే కళల, హస్త కళల, వారసత్వ గ్రామాలను ఏమని పిలుస్తారు?  శిల్పారామం.

వెలుగు (సెర్ప) వ్యవస్థ కింద ఒక స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత మంది సభ్యులు కావాలి?  10 నుంచి 20.

పునర్వ్యవస్థీకరణ సమయంలో, పోలవరం ప్రాజెక్ట్లో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను, తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది?  7.

2017-18 సంవత్సరంలో రైతు రుణ మాఫీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ 2017-18లో ఎంత సొమ్ము కేటాయించింది?  రూ.3,600 కోట్లు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి-  అసాధారమైన పాత్ర నిర్వహించిన సాధారణ మహిళల సాహస కృత్యాలను సంబురంగా జరుపుకొనుటకు

 మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?  నొంగ్ తొంబమ్ బీరెన్ సింగ్.

 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మనామం ఏమిటి?  అజయ్ సింగ్ బిస్ట్.

కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఆరోగ్య విధానం, 2017 ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ప్రజా ఆరోగ్యంపై ఖర్చు చేయాలని ఆశించబడుతుంది?  2.5%.

 గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, తమ రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జిత రహిత ప్రదేశాలని 2016 అక్టోబర్ 2న ప్రకటించాయి. 
  
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం దేశ సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత?  45%.

 త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి పౌర సేవల రంగంలో పద్మశ్రీపురస్కారం లభించింది.

ఇటీవల పద్మశ్రీపురస్కారం పొందిన శ్రీ గిరీష్ భరద్వాజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కు వంతెనల నిర్మాణం రంగంలో ప్రసిద్ధులు.  

 పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నవజోత్సింగ్ సిద్ధూకు స్థానిక పాలన మంత్రిత్వ శాఖ కేటాయించారు.

దక్షిణ కొరియా దేశాధ్యక్షుని డిసెంబర్, 2016లో జాతీయ అసెంబ్లీ రాజ్యాంగం, చట్టపు విస్తృత, తీవ్ర ఉల్లంఘనకారణంగా అభిశంసించింది.  

మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు?  టాన్ ఝోంగ్యి.

 ఇటీవల ఆస్కార్ అవార్డ గెలుచుకున్న లా లా ల్యాండ్అనే సినిమా ఒక సంగీతకారుడు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఒక అమ్మాయిల కథ. ఆ ఇద్దరు లాస్ఏంజల్స్ నగరంలో కలిసి ప్రేమలో పడినట్లు చిత్రీకరించారు.  

ఇటీవల పారిస్ నగరంలో అరకు కాఫీరిటైల్ దుకాణం ప్రారంభించారు.  

పాల్ బీటీ ఏ పుస్తకానికి 2016 మాన్ బుకర్ బహుమతి గెలుచుకున్నాడు?  ది సెల్ఔట్.

భారత జాతీయ సేనకు మొట్టమొదటి ప్రధాన సేనాధిపతి ఎవరు?  మోహన్ సింగ్.

మట్నూరి కృష్ణారావు గారు కృష్ణ పత్రిక సంపాదకునిగా పనిచేశారు.

జునాగఢ్ సంస్థానంలో భారత్లో విలీనం కావాలా, పాకిస్తాన్లో విలీనం కావాలా అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.  

గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు  సోహాన్ సింగ్ భక్నా.

1784లో మొట్టమొదటిసారి బ్రిటిష్ శోషణకు వ్యతిరేకంగా ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించిందెవరు?  తిల్కా మాఝీ.

 బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్నవల నేపథ్యం ఏమిటి?  సన్యాసుల తిరుగుబాటు.

1857లో సిపాయి తిరుగుబాటులో మొదటి ఉత్ప్రేరక సంఘటనకు కారణం?  సైనికుల్లో అసంతృప్తి
అలీఘర్ ఉద్యమం, భారతీయ ముస్లింలలో ఆధునిక పాశ్చాత్య విద్యా వ్యాప్తి కోసం ప్రారంభించబడింది.
 
మహమ్మద్ ఇక్బాల్ మొట్టమొదటిసారి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.  

ఏ విషయం చర్చించడం కోసం బ్రిటిష్వారు రౌండ్టేబుల్ సమావేశాలను నిర్వహించారు?  భారత్లో రాజ్యాంగ సంస్కరణలు.

ఏ స్వాతంత్య్ర సమరయోధుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రాణాలు కోల్పోయారు?  లాలా లజపతిరాయ్.

 రాజద్రోహం ఆరోపణలపై శిక్ష విధించబడి, లోకమాన్య తిలక్ ఎక్కడ ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించారు మాండలే జైలు, బర్మా.

స్థానిక భాషా పత్రికల చట్టం, 1878 (Vernacular Press Act, 1878) రూపొందించడానికి ఏ చట్టాలను నమూనాగా తీసుకున్నారు?  ఐరిష్ పత్రికా చట్టాలు.

 ఒక ట్రాక్టర్ సామర్థ్యాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?  అశ్వశక్తి (హార్స పవర్).

 ఒక 110 వోల్ట్, 50 హెర్జ రేటింగ్ కల హీటర్ (వేడి చేసే) పరికరాన్ని భారతదేశంలో ఇంటిలో వాడే AC ఎలక్ట్రిక్ ప్లగ్లో వాడితే ఏం జరుగుతుంది?  అది కొన్ని నిమిషాలు లేదా సెకన్లోనే కాలిపోతుంది.

 లాఫింగ్ గ్యాస్అని దేన్ని అంటారు?  నైట్రస్ ఆక్సైడ్.

వాయు బుడగ (బెలూన్)ను ఉదజని గ్యాస్తో నింపడం అంత సురక్షితం కాదు .

ఒక ఓడ సముద్రం మధ్య నుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు తీరంలో నిలబడిన వ్యక్తికి ఓడలోని ఏ భాగం ముందుగా కనిపిస్తుంది?  స్తంభం (మాస్ట్).

సేంద్రీయ పదార్థాల కంపోస్ట్ తయారీలో ఏ ప్రక్రియ జరుగుతుంది?  ఆమ్లజని ఆధారిత జీర్ణ ప్రక్రియ

జనప కట్ట నుంచి నార తీసేందుకు ఏ ప్రక్రియ ఉపయోగిస్తారు?  రెట్టింగ్ (నానబెట్టడం)

కలరా ఉండలు ఏ సూత్రంపై పనిచేస్తాయి?  ఉత్పతనం

టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగ్ 2017 ప్రకారం ప్రపంచ అత్యుత్తమ చిన్న విశ్వవిద్యాలయాల జాబితాలో మొదటి 10 ర్యాంక్లలో స్థానం సంపాదించిన ఒకే ఒక భారతీయ విద్యా సంస్థ?  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు.

అగ్నిIV బాలిస్టిక్ క్షిపణి లక్ష్య పరిధి కి.మీ.లలో ఎంత?  3000-4000.

స్టాక్ హోం పీస్ రీసెర్చ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన 2016 సమాచారం ప్రకారం భారత్ రక్షణ బడ్జెట్ చైనా రక్షణ బడ్జెట్తో పోలిస్తే సుమారుగా ఎంత?  నాలుగోవంతు.

రూపేఅంటే ఏమిటి?  భారత వెర్షన్ చెల్లింపు కార్డు.

భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ‘JAM" అంటే ఏమిటి?  జన్ ధన్, ఆధార్, మొబైల్.

మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది?  ఏడిస్ ఈజిప్టీ.

 భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక?  ఓపెన్ (సంప్రదింపులు కల) ప్రక్రియ.

 ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు?  సుభాష్ చంద్రబోస్

 మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతమవడానికి ప్రధాన కారణం ఏమిటి?  ప్రణాళిక చివరి రెండు ఏళ్లలో మంచి వ్యవసాయ దిగుబడి.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక, మహలనోబిస్ ప్రణాళికగా పేరుపొందింది.
 
 ఏ కాలాన్ని భారత్లో సభ్యోక్తిగా ప్రణాళిక సెలవు కాలంగా పిలుస్తారు?  1966-69.

 చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన, వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది?  అవ్యవస్థీకృత కార్మికులు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2017-18లో పెట్టే ప్రభుత్వ ఖర్చులో ఎంత భాగం రుణ సేవ (రుణాలు, వడ్డీ చెల్లింపులు) కోసం కేటాయించడం జరిగింది?  14.5%

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫోరం పేరు ఏమిటి?  మీకోసం.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారం భారత్లో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది?  రెండో.

భారత ఆర్థిక మంత్రి సెలవిచ్చిన ప్రకారం GST అమలుకు లక్ష్యిత తేది ఏది?  1 జూలై 2017.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తరువాత మార్చి 2017 మధ్య భాగం వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందించిన కేంద్ర సహాయమొత్తం ఎంత? (దగ్గరి కోటి రూపాయలకు రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది) రూ.10,461 కోట్లు.

నీతి ఆయోగ్ పనులు- ేంద్రానికి విధానపరమైన సూచనలు, దిశానిర్దేశక సలహాలు ఇవ్వడం, సహకార సమాఖ్య భావనలను పెంపొందించడం, ్ఞాన కేంద్రంగా వ్యవహరించడం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పంట సంజీవనికార్యక్రమం దేనికి సంబంధించింది?  వ్యవసాయ కుంటల నిర్మాణం.

 ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ, ఓటరు వయోపరిమితిని 21 నుంచి 18కి తగ్గించిందిలోక్సభ, రాష్ట్రాల శాసనసభలు

రాష్ట్రాల మధ్య వివాదాలు అనే అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిది.

 కోర్ట ఆఫ్ రికార్డ అంటే ఏమిటి?  ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్టు
ఏఏ సందర్భంలో మాండమస్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు వర్తించును? ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ,  రైల్వేస్టేషన్లలో శుభ్రత,  వరద ముప్పు ప్రాంతాల్లో సంరక్షణ గృహాలను నిర్మించడం.

మన రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇచ్చింది?  ఏ భాషకు ఇవ్వలేదు.

ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే.. అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా?  లేదు

రాజ్యాంగం నిర్దేశించిన విధముగా బాలలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009’ ప్రకారం ఒక ప్రభుత్వ సాయం పొందని పాఠశాల, ఒకటో తరగతిలో కానీ, ప్రీ స్కూల్ ఉంటే ఆ తరగతిలో కానీ, ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు, ఇరుగు పొరుగున నివసిస్తోన్న బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి?  25%

రాష్ర్ట శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష (కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్) అంటే ఏమిటి? మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్.

రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ర్టపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? కేబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం.

ఒకే సమయంలో భారత్లో రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ర్టపతిగా వ్యవహరిస్తారు?  భారత ప్రధాన న్యాయమూర్తి.

ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు?  కేవలం లోక్సభలో.

సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్సభలో చర్చించబడుతుంది?  శుక్రవారం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం,2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స బిల్లుగా పేరుపడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స-2014ను సవరించింది?  3వ పరిచ్ఛేదం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతమున్న 175 నుంచి ఎంతకు పెంచవచ్చు?  225.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్, 1950 నుంచి తొలగించారు?  బేడ(బుడగ) జంగం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం,2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, భత్యాల ఖర్చు.

 కోర్టుల్లో ఆయా రాష్ట్రాల నుంచి దాఖలైన కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాల మధ్య పంచుతారు.

రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది?  అధికరణం 214.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని ఏ షెడ్యూల్ ఏపీఎస్ఎఫ్సీ ఉంది? 9వ షెడ్యూల్.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం, 13వ ఆర్థిక సంఘం.

కేటాయించిన మొత్తాన్ని ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి?  జనాభా నిష్పత్తి, ఇతర ప్రమాణాల ప్రకారం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోని సభ్యులు?  వై.రామకృష్ణుడు, కె.అచ్చంనాయుడు, కె.శ్రీనివాసులు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని పరిచ్ఛేదం 51(1) కింద పరిశ్రమల నుంచి వాయిదా పన్నులను వసూలు చే సే హక్కు ఎవరికి ఉంటుంది?  ఆ పరిశ్రమ ఏ రాష్ర్టంలో ఉంటే ఆ రాష్ట్రానికి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, ఆగస్టులో ప్రచురించిన శ్వేతపత్రం ప్రకారం రాష్ర్ట విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రుణ/స్థూల రాష్ర్ట ఉత్పత్తి (GSDP) నిష్పత్తులు ఇలా ఉన్నాయి?  19.4 మరియు 18.1.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న నియమిత దినముఏది?  2014, జూన్ 2.

సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలపైఅధ్యయనం కోసం నియమించిన కమిటీ?  బల్వంత్రాయ్ మెహతా కమిటీ.

పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధాన మరియు శాసకీయ వ్యవస్థ మదింపు, ఫలితాల విశ్లేషణలకు కేంద్ర ప్రభుత్వం వార్షిక సంక్రమణ సూచిక నివేదికను వినియోగిస్తుంది.

భారత్లో మొట్టమొదటసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు?  1959, అక్టోబర్ 2.

అశోక్ మెహతా కమిటీ దీన్ని సిఫార్సు చేసింది?  రెండంచెల వ్యవస్థ.

స్వతంత్ర భారతంలో సాముదాయిక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించిందెవరు?  ఎస్.కె.డే.

73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో లేని విషయం కుల పంచాయత్ల స్థాపన.

 గ్రామ పంచాయతీలపై మహాత్మాగాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి?  పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి.

రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి?  29.

ఇ-పంచాయత్ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం పేరు ఏమిటి?  ఇ-పురస్కార్.

2016-17 సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వార్షిక కేటాయింపు ఎంత?  రూ.1463.45 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994 ప్రకారం గ్రామ సభ కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి?  సంవత్సరంలో 2 సార్లు.

టి.ప్రకాశం గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరు ఏమిటి ఫిర్కా అభివృద్ధి పథకం.

మద్రాస్ గ్రామ పంచాయత్ల చట్టం, 1950 ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించారు రెండు తరగతులు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితుల, జిల్లా పరిషత్ల చట్టం, 1959 ప్రకారం పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు?  సమితిలోని అన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారు.

ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితుల స్థానంలో మండల్ ప్రజాపరిషత్లను స్థాపించారు?  1986.

పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్లు ఏర్పడ్డాయి?  1104.

ఎం.టి.రాజు కమిటీ సిఫారసు ఏది?  జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు.

సి.నరసింహం కమిటీ సిఫారసు ఏది?  పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక.

మండల్ ప్రజా పరిషత్ల స్థాపనలోని ఉద్దేశం?  మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి, అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం.

ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 19(3) పరిచ్ఛేదంలో ఎంత మంది సంతానం అని తెలిపినారు?  ఇద్దరు.

MGNREGA పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? (దగ్గరగా ఉన్న సంఖ్యను గుర్తించండి)  85 లక్షలు.

2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో MGNREGA పథకం కింద చేసిన మొత్తం ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలి ఖర్చు ఎంత శాతం? (దగ్గరగా ఉన్న గణాంకాన్ని గుర్తించండి)  60%
MGNREGA చట్టంలోని ఉద్దేశాలు   పంచాయతీరాజ్ సంస్థలను పరిపుష్టం చేయడం,  సామాజిక సమ్మిళిత తత్వాన్ని చొరవతో ఏర్పరచడం,  పేద ప్రజల జీవనాధార వనరుల మూలాలను పరిపుష్టం చేయడం.

బేర్ ఫుట్ టెక్నీషియన్లను (పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు) ఏ పథకంలో నియమిస్తారు?  MGNREGA.

 జాతీయ గ్రామీణ, పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది?  హైదరాబాద్

సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక కావడానికి అర్హతకై, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ జన సంఖ్య ఎంత ఉండవచ్చు?  3000 నుంచి 5000

No comments:

Post a Comment