Sunday, 8 September 2019

Current Affairs in Telugu, Current Affairs for APPSC

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ V. K. రమణి రాజీనామా చేశారు.

మేఘాలయ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ A.K.Mittal ను ఆమె స్థానంలో నియమించారు.

దేశంలో నాలుగో అతిపెద్ద హై కోర్ట్ గా మద్రాస్ హైకోర్టు పేరుగాంచింది.

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ సి ప్రవీణ్ కుమార్.

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిలి సై సౌందర రాజన్ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ ఆర్ఎస్ చౌహన్.

దేశంలో ప్రతి ఇంటికి 2024 నాటికి త్రాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతోనే జల్ జీవన్ మిషన్ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

పి ఎమ్ ఉజ్వల యోజన కింద షేక్ రఫీక్ అనే మహిళకు 8 కోట్ల వ గ్యాస్ కనెక్షన్ అందజేశారు.

ఢిల్లీ ముంబై కారిడార్ లో భాగంగా 10 వేల ఎకరాలలో నిర్మించిన ఔరంగాబాద్ పారిశ్రామిక నగరం 'ఔరిక్ సిటీ ' ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.

దులీప్ ట్రోఫీను ఇండియా రెడ్ సొంతం చేసుకుంది ఫైనల్లో ఇండియా గ్రీన్ ను ఓడించింది.

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట కు చెందిన మత్స్యకార యువకుడు గోశాల రాజు దక్షిణాఫ్రికా లోని కిలిమంజారో పర్వతాన్ని తాజాగా అధిరోహించాడు.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమలు ఉత్పత్తి అవుతున్న కార్లు చెన్నై రేవు ద్వారా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు.

No comments:

Post a Comment