Sunday, 8 September 2019

A.P.History Bits for APPSC, A.P.History Bits in Telugu.

శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు.

శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించారని మత్స్యపురాణం తెలుపుతుంది.

శాతవాహనుల రాజభాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాషగా అయ్యింది.

శాతవాహనుల రాజ లాంఛనం సూర్యుడు.

శాతవాహనుల రాజధానులు కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గర ఉన్న ధాన్యకటకం, ప్రతిష్ఠానపురం (పైఠాన్ మహారాష్ట్ర ).

శాతవాహనుల రాజులు వైదిక మతాన్ని అవలంబించినారు .

శాతవాహనుల రాణులు బౌద్ధ మతాన్ని అవలంబించారు.

శాతవాహనుల రాజులలో అత్యధిక కాలం అనగా 56 సంవత్సరాలు పరిపాలించిన రాజు పేరు రెండవ శాతకర్ణి.

శాతవాహన రాజుల లో అందరి కంటే గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి.

శాతవాహన రాజులలో చివరి రాజు పేరు మూడవ పులోమావి.

శాతవాహన రాజులలో గుహను తొలపించిన మొట్టమొదటి రాజు కృష్ణుడు లేదా కన్హడు.

శాతవాహన రాజులలో కవిరాజు అనే పేరు గలవాడు హాలుడు.

రెండవ శాతకర్ణి సాంచీ స్తూప దక్షిణ ద్వారానికి తోరణం చెక్కించినట్లు అతని శిల్పి ఆనందుడు, ఆ తోరణంపై శాసనం రాశాడు.

పులోమావి అనగా గడ్డి లో జన్మించిన వాడు అని అర్థం.

భూదానం చేసిన తొలి రాజులు శాతవాహనులు.

శాతవాహనుల కాలంలో నిగమసభలు నగర పరిపాలన నిర్వహించేవి.

శాతవాహన పాలన విభాగంలో చిన్న గ్రామాధికారిని గుల్మిక అని పిలిచేవరు.

ఆంధ్ర ప్రాంతంలో లభ్యమైన తొలి
శాతవాహన శాసనం అమరావతి శాసనం.

వస్తు సంచయంను భద్రపరిచే అధికారిని భాండారికుడు అని పిలిసే వారు.

హిరణ్యకుడు ద్రవ్య రూపం అయిన ఆదాయాన్ని భద్రపరిచే వాడు.

రాజ పత్రాలను, రాజ శాసనాలను రాస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పని చేసేవాడు లేఖకుడు.

శాతవాహన కాలంలో రాష్ట్రాలను ఆహారాలు అని పిలిచేవారు.

ఆహారాలకు అమాత్యులు పాలనాధికారులు. అయితే వీరికి వంశపారంపర్యత హక్కు లేదు.

శాతవాహన పరిపాలన విభాగాలలో అతి చిన్నది గ్రామం.

గ్రామానికి అధికారి గ్రామణీ పాలనధికారి.

శాతవాహనుల కాలంలో పట్టణాలనే నిగమాలంటారు. నిగమ పాలనా వ్యవహారాలను నిగమ సభలు అనే పౌరసభలు చూసేవి.

కుల పెద్దలను గాహపతులు అనేవారు.వీరు నిగమ సభలో సభ్యులుగా ఉండేవారు.

భట్టిప్రోలు శాసనంలో నిగమ సభ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది.

నానాఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య అయిన నాగానిక వేయించింది .ఈమె మహారాష్ట్ర నాయకుడు త్రణకైరో కుమార్తె.

నాసిక్ శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమీ బాలశ్రీ వేయించినది.దీనిని రెండో పులోమావి కాలంలో ప్రాకృత బాష లో వేయించింది.

గాథసప్తశతి శాతవాహన రాజు హాలుడు రచించాడు. ఇతనికి కవి వత్సలుడు అనే బిరుదు కలదు.

మ్యాకదోని శాసనాన్ని మూడవ పులోమావి వేయించాడు.ఇది బళ్లారి( కర్ణాటకలో) దొరికింది.

హాతిగుంప శాసనాన్ని కళింగరాజు అయిన ఖరవేలుడు వేయించాడు .

చిన గంజాం, నాగార్జునకొండ శాసనాలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. హర్షుని చరిత్రకారుడు బాణభట్టుడు ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు.

బృహత్కథ ని గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించాడు. ఇతను కుంతలశాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు.

కాతంత్ర వ్యాకరణంను శర్వవర్మ సంస్కృత భాషలో రచించాడు.దీనిని తన రాజు అయిన కుంతల శాతకర్ణి ఆరు నెలలలో సంస్కృత నేర్చుకొనుటకు రచించాడు.

వాత్సాయనుడు కామ సూత్రాన్ని సంస్కృత భాషలో రచించాడు.
కుంతల శాతకర్ణి తన భార్య మయావతితో జరిపిన శృంగార క్రీడలో మోటుగా ప్రవర్తించి ఆమె మరణానికి కారకుడయ్యాడు అని వాత్స్యాయనుడు తన కామసూత్ర గ్రంథంలో రాశాడు.

సమయసారం అనే గ్రంథాన్ని ఆంధ్ర దేశంలో మొట్టమొదటి జైనాచార్యుడైన కొండ కుందానాచార్యుడు ప్రాకృత భాషలో రచించాడు.

జునాగడ్ శాసనాన్ని, రుద్ర దమనుడు సంస్కృత భాషలో వేయించాడు.ఈ శాసనాన్ని బట్టి రుద్రదాముడు శివశ్రీ శాతకర్ణిని రెండు సార్లు ఓడించినట్లు తెలుస్తుంది . శివశ్రీ శాతకర్ణి రాజకీయ మనుగడ కోసం శక రుద్రాదాముని కుమార్తె రుద్రదమనికనుని వివాహమాడాడు.

No comments:

Post a Comment