Sunday, 8 September 2019

Current Affairs in Telugu, Current Affairs for APPSC

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 6న సింగపూర్ లో మరణించారు.

1980కి ముందు జింబాబ్వే, రోడీషియా పేరిట బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది.

భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరింది.

ఏడాది వ్యవధిలో భారతదేశ జనాభా 1.45 కోట్లు పెరిగింది.

జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా 2017 సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 22.26 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది.

6.56 లక్ష కోట్ల జనాభాతో సిక్కిం చివరి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ 5.23 కోట్ల జనాభాతో పదవ స్థానంలో ఉంది .

ఆంధ్రప్రదేశ్ లో నమోదైన జనాలలో తూర్పుగోదావరి, కర్నూలు వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ,మరణాల్లో గుంటూరు తూర్పు గోదావరి వరసగా ముందున్నాయి.

రష్యాలో దూర ప్రాచ్య( ఫార్ ఈస్ట్) ప్రాంతాలుగా పిలిచే తూర్పు రాష్ట్రాలు అభివృద్ధి కోసం భారత్ ఒక బిలియన్ డాలర్లు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వనుంది .
రష్యా లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 5న తూర్పు తీర నగరమైన వ్లాదివొస్తోక్లో జరిగిన అయిదవ తూర్పు ఆర్థిక వేదిక (ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం-EEF) సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు.

జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అలాగే మంగోలియా అధ్యక్షుడు ఖాల్త్ మాగీన్ మట్టుగ్లా తో కూడా మోడీ సమావేశమయ్యారు.

స్వచ్ఛ్ మహోత్సవ్ తొలి పురస్కారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దక్కింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - పరిశుభ్రత పథకం కింద కేంద్ర త్రాగునీరు, పారిశుద్ధ్యం(జల్ శక్తి) దేశవ్యాప్తంగా మూడు ప్రాథమిక కేంద్రాలను ఎంపిక చేయగా వేల్పూర్ పి.హెచ్.సి స్థానంలో నిలిచింది.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సెప్టెంబర్ 5న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు న్యూఢిల్లీలో పురస్కారాలను ప్రధానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.

జైష్-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజహర్, లష్కర్-ఎ-తయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న మాఫియా లీడర్ దావూద్ ఇబ్రహీం లను సెప్టెంబర్ 4న భారత ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది.


No comments:

Post a Comment