Thursday 13 July 2017

AP History Bits. Bits on AP History, A.P.History Bits in Telugu, ఆంధ్రుల చరిత్ర బిట్స్

Ø శాతవాహన శాసనాలన్నీప్రాకృత భాషలను మరియు బ్రాహ్మి లిపిలో ఉన్నాయి.
 
Ø అమరావతి స్థూపాన్నివిస్తృతపర్చి, మహాచైత్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి- యజ్ఞశ్రీ శాతకర్ణి.
 
Ø శాతవాహనుల కాలంలో సామంతాధికారాలు గల సరిహద్దు సైనికాధికారులను గుర్మికులు అని పిలిచేవారని మ్యాకదోని శాసనం చూసిస్తుంది.
 
Ø శాతవాహనుల కాలంలో నేత పనివారిని “కోలిక”లనేవారు.
 
Ø ఇక్ష్వాకు రాజులలో తల్లి పేరుతో శాసనాలు వేయించిన రాజు- మొదటి శాంతమూలుడు.
 
Ø కడప జిల్లా జమ్మలమడుగులోని దానవులపాడు ఒక గొప్ప జైన క్షేత్రం.
 
Ø పశ్చిమ చాళుక్యుల వంశస్థాపకుడు – రెండవ తైలపుడు.
 
Ø ఏకాబ్రహ్మణ అనే బిరుదు గల వాడు - గౌతమిపుత్ర శాతకర్ణి.
 
Ø కాకతీయుల కాలంలోని దురాచారాలు- బాల్యవివాహం, వరకట్నం, కన్యాశుల్కం, నిర్భంధ వైధవ్యం, మద్యపానం.
 
Ø మోటుపల్లి నుండి ఎగుమతి అయ్యే వస్త్రాలు సాలెపురుగు దారం కంటే మిక్కిలి సన్ననైన నూలుతో చేయబదడినవని ప్రశంసించిన విదేశి యాత్రికుడు- మార్కోపోలో.
 
Ø అంతర్వేది- కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నున్న ప్రాంతం.
 
Ø “హాతిగుంఫ” శిలాశాసనం ఖారవేలుడుకి చెందినది.
 
Ø నాగార్జునుడు యజ్ఞశ్రీ శతకర్ణి సమకాలికుడు.
 
Ø ఆంధ్రుల గూర్చిన తొలి శాసనాలు సంస్కృత భాషలో రాయడం జరిగింది.
Ø ఘటిక- విద్యాకేంద్రం.
 
Ø అస్సక జనపద రాజధాని-బోధన్.
 
Ø రాజగిరిక బౌద్ధసిద్దాంత కేంద్రం- గుంటుపల్లి.
 
Ø భారతదేశంలో విద్యార్థులు “సుహృల్లేఖ”ను కంటస్థలం చేస్తుందటం చూశానని రాసిన చైనా యాత్రికుడు ఇత్సింగ్.
 
Ø అజంతాలోని పదవ నెంబర్ గుహలో “ శ్వేతగజ జాతక” చిత్ర లేఖనం వుంది.
 
Ø శాతవాహనుల నాటి “ వధిక” అనే శ్రేణి వడ్రంగులది.
 
Ø ఉపాసిక బోధిశ్రీ వీరపురుషదత్తుడు పాలనాకాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట సేవలందించినది.
 
Ø గనగా విజయాదిత్యుడు “ త్రిపుర- మర్త్య- మహేశ్వర” అనే బిరుదును నెల్లూరు, కిరణపురం మరియు ఆచలపురము నగరాల విజయానికి గుర్తుగా ధరించాడు.
 
Ø “కళ్యాణకారక” అనే వైద్య గ్రంధాన్ని రచించినది ఉగ్రాదిత్యాచార్యుడు.
 
Ø హరీతి  ఇక్ష్వాకుల కుల దేవత.
 
Ø “ కొల్లబిగండ” అనే బిరుదు ధరించినది గుణగ విజయాదిత్యుడు.
 
Ø కుమరిలభట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్దాంతం- పూర్వ మీమాంస.
 
Ø మధ్యయుగాంధ్ర దేశంలో వర్తకశ్రేణి కేంద్ర స్థానం- పెనుగొండ.
 
Ø “ ఆంధ్రులు, శాతవాహనులు ఒక్కరే కారు” అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించినది వి. యస్. సుక్తాంకర్.
 
Ø ఆంధ్రలో దాస సమాజాన్ని ఏర్పరచినది బ్రహ్మనాయుడు.
 
Ø తెలుగులో తొలి శాసనం- కలమళ్ళ శాసనం.
 
Ø “కాయస్థ” అనేది లేఖ్యరక్షకుల కులం(రికార్డు కీపర్స్).
 
Ø నరేంద్రేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు రెండో విజయాదిత్యుడు.
 
Ø “ మితాక్షరము”ను తెలుగులో “విజ్ఞానేశ్వరం” అనే పేరుతో రాసినది కేతన.
 
Ø చాళుక్యుల నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన పొందిన అగ్రహారం- నవఖండవాడ.
 
Ø ఓరుగల్లు పై జరిగిన తొలి ముస్లిం దాడి 1303 సంవత్సరంలో జరిగింది.
 
Ø కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య-12.
 
Ø గంగాదేవి, అగస్త్యుని శిష్యురాలు.
 
Ø తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు- అనపోతారెడ్డి.
 
Ø సిద్దత్రయానికి చెందిన వారు- రేవణ, మరుళ, ఎకోరామ.
 
Ø వ్యవసాయాభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు- శ్రిచాంతమూల.
 
Ø కన్నడంలో “విక్రమార్జున విజయం” అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు-పంపన.
 
Ø ఆరికేసరి సముద్రంనే తటాకాన్ని నిర్మించినది- మొదటి ప్రోలరాజు.
 
Ø రామప్ప ఆలయం ఏకశిల కోవకు చెందినది.
 
Ø నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో 8 గుహలు కలవు.
 
Ø “ సంగీత-సుధాకరం” అనే సంగీత శాస్త్ర గ్రంధాన్ని రచించినది- రెండో సింగభూపాలుడు.
 
Ø 15వ శతాబ్దిలో రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పినది శ్రీనాధ పండితుడు.
 
Ø కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం- మోటుపల్లి.
 
Ø తటాక నిర్మాణంలో పాటించవలచిన నియమ నిభంధనలను తెలియజేయు శాసనం- ముద్దుపళని శాసనం.
 
Ø కుమారగిరిరెడ్డి ఆస్థాన నర్తకి- లకుమాదేవి.
 
Ø బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం- 1757.
 
Ø నానాసాహేబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు రేపినది- కోరుకొండ సుబ్బారెడ్డి.
 
Ø రెవిన్యూ బోర్డు స్థానంలో కల్లెక్టర్ల పరిపాలనా విధానం అమల్ల్లోకి వచ్చిన సంవత్సరం-1794.
 
Ø ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించిన సంవత్సరం-1853.
 
Ø ” హరికధా పితామహుడు”గా పేరొందిన కళాకారుడు- ఆదిభట్ల నారాయణదాసు.
 
Ø “ నీలగిరి యాత్ర” అనే యాత్రా గ్రంధాన్ని రచించినది- కోలా శేషాచల కవి.
 
Ø ” హస్యవర్ధని” అనే పత్రికను నెలకొల్పినది కొక్కొండ వెంకటరత్నం.
 
Ø ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి.
 
Ø ఆంధ్రలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం 1881.
 
Ø వీరేశలింగంను “దక్షిణ భారత విద్యాసాగరుడు” అంటూ ఆయన సమాజసేవను కొనియాడినది యం.జి. రనడే.
 
Ø కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం గుంటూరులో జరిగింది.
 
Ø తెనాలి బాంబు కేసు వందేమాతరం ఉద్యమంలో జరిగింది.
 
Ø ఆంధ్రలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక- ఆంధ్ర ప్రకాశిక.
 
Ø దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది గాడిచర్ల హరిసర్వోత్తమరావు.
 
Ø “ బ్రహ్మ ప్రకాశిక” అనే పత్రికకు సంపాదకత్వం వహించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు.
 
Ø  తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి, విదేశీ వస్తువుల్ని తగలబెట్టిన తొలి తెలుగు మహిళ- మాగంటి అన్నపూర్ణమ్మ.
 
Ø పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం-1921-22.
 
Ø సికింద్రాబాద్ లోని ఆంధ్ర సంవర్దనీ గ్రంధాలయం నెలకొల్పిన సంవత్సరం 1905.
 
Ø రామస్వామి చౌదరి రచించిన- “ వీరగంధము- తెచ్చినారము- వీరులేవ్వరో- తెల్పుడీ” అనే గీతం శ్యాసనోల్లఘనోద్యమ కాలంలోనిది.
 
Ø “ నీలగిరి” పత్రిక నల్గొండ నుండి వెలువడింది.
 
Ø బ్రిటిష్ వారికి మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం పంజేరిఘాట్ లో జరిగింది.
 
Ø అంధ్రజన కేంద్ర సంఘం 1923లో ఇచ్చట ఏర్పడింది.
 
Ø చందా రైల్వే పధకమును 1883లో  ప్రతిపాదించారు.
 
Ø ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను నెలకొల్పినవాడు- భాగ్యరెడ్డి వర్మ.
Ø హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను నిషేదాన్ని 1946లో ఎత్తివేశారు.
 
Ø నిజాం మరియు భారత ప్రభుత్వం యధాతధా ఒప్పందం పై సంతకం చేసిన తేదీ నవంబర్ 29, 1947.
 
Ø “ జాయిన్ ఇండియన్ యూనియన్” ఉద్యమ నాయకుడు- స్వామి రామానందతీర్ధ.
 
Ø “ తెలుగు లెంక”  అనే బిరుదు తుమ్మల సీతారామమూర్తి.
 
Ø భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు-  ముల్లా అబ్దుల్ ఖయ్యుమ్.
 
Ø అంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం- విజయవాడ.
 
Ø “శ్రీబాగ్”  - కాశీనాధుని నాగేశ్వరరావు గారి నివాసం పేరు.
 
Ø వాంఛూ కమిటీ అంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్నసమస్యల గుర్తింపు కోసం.
 
Ø 1955 ఎన్నికల అనంతరం  ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాలరెడ్డి అయినదెవరు.
 
Ø భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్యలనుంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినది- మెయిన్ నవాబ్ జంగ్.
 
Ø “హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెట్” అనే గ్రంధాన్ని రచించినది- ఆలీ యావర్ జంగ్.
 
Ø హైదరాబాద్ లో స్టేట్ లో కామ్రేడ్స్ అసోసియేషన్ ను నెలకొల్పిన సంవత్సరం- 1940.
 
Ø కంకిపాడులో 1939లో “రాజకీయ పాటశాల” ను ఏర్పాటు చేసినది- N.G.రంగా.
 
Ø విశాలాంద్రోద్యమాన్నిప్రారంభించినది- కమ్యూనిస్ట్ పార్టీ.
 
Ø నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1955.
 
Ø ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి- అయ్యదేవర కాళేశ్వరరావు.
 
Ø జాషువాను మధుర కవిగా అభివర్ణించినవారు- విశ్వనాధ సత్యనారాయణ.

No comments:

Post a Comment