Thursday, 28 February 2013

AP History Bits in Telugu



శాతవాహనులు బ్రాహ్మణులు

శాతవాహనులు ఆంధ్రులే అన్న వాదాన్ని బలపరిచినవారు  వి.ఎ. స్మిత్ మరియు ఇ.జి.రాప్సన్.

శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారనే వాదాన్ని బలపరిచినది శ్రీనివాస అయ్యంగార్.

శాతవాహనులు కర్నాటకకు  చెందినవారనే వాదాన్ని బలపరిచినది వి.ఎస్. సుక్తాంకర్.

శాతవాహన తొలి చక్రవర్తులలో రెండో శాతకర్ణి గొప్పవాడు.

శాతవాహన మలి చక్రవర్తులలో యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పవాడు.

మొత్తం శాతవాహన వంశానికి గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడు.

శాతవాహన రాజుల్లో ఓడ గుర్తు గల నాణేలను వేయించిన తొలిరాజు రెండోపులోమావి.

రెండోపులోమావి తరువాత ఓడ గుర్తు గల నాణేలను వేయించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి.

రెండు తెరచాపలు గల నౌక ముద్రగల నాణాలు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉండేవి.

శాతవాహనులు వెండి నాణేలను తమ శాసనాల్లో కర్షపణాలు అని పేర్కొన్నారు.

శాతవాహన నాణాలు పై ఏనుగు, సింహం, గుర్రం, విల్లు మరియు చైత్యం వంటి బొమ్మలు ఉండేవి.
గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి పేరు గౌతమీబాలశ్రీ.

భారత దేశంలో నేటికి లభించిన మొదటి పూర్తి సంస్కృత శాసనాన్ని శకరుద్రదమనుడు వేయించాడు.

ఆంధ్రలో లభ్యమైన తొలి శాసనం ధరణికోట శాసనం.

నాసిక్ శాసనం’ గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.

శాతవాహనుల కాలంలో తూర్పున గల ముఖ్యరేవు పట్టణం మైసోలియా.

శాతవాహనుల కాలంలో పశ్చిమాన గల ముఖ్యరేవు పట్టణం  భరుకచ్చం

యవనులు,పహ్లవులు,శకులను ఓడించిన శాతవాహన రాజు  గౌతమిపుత్ర  శాతకర్ణి

జైన వాజ్మయం శాతవాహనుల రాజధాని ప్రతిస్థానపురం గురించి తెల్పుతుంది.

విదేశీ వాజ్మయంలో ఆంధ్రదేశాన్ని గురించి మొట్టమొదట ప్రస్తావించినది మెగస్తనీస్

ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైన పురాణం మత్స్యపురాణం.

‘రాజర్షివదు’గా వర్ణించిన శాతవాహన స్త్రీ - గౌతమీబాలశ్రీ.

శ్రీముఖుడు 23 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.

భారతదేశంలో భూమిని దానం చేసిన తొలి రాజవంశం- శాతవాహన వంశం.

శాతవాహనులు ప్రధాన వృత్తి వ్యవసాయం.

శాతవాహనులు పండిన పంటలో1/6వ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు.

ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టిన శాతవాహన రాజు కుంతల శాతకర్ణి.

ప్రాకారం గల ఆంధ్రలోని ఒకే ఒక స్తూపం అమరావతి స్తూపం

శాతవాహన స్థూపాల ప్రత్యేకత – ఆయక స్తంభాలు

‘సార్ధవాహులు’ అనగా విదేశాలలో వ్యాపారం చేసేవారు.

హాలుని కాలంనాటి ‘సప్త గోదావరి’ని నేడు ద్రాక్షారామం అని పిలుస్తున్నారు.

శాతవాహనులలో చివరి రాజు- మూడో పులోమావి

శాతవాహన  రాజ్యం పై దండెత్తిన శకరాజు- సహపానుడు

ఆచార్య నాగార్జుని జన్మస్థలం విదర్భ.

‘రససిద్దాంతం’ను ప్రతిపాదించింది ఆచార్య నాగార్జుడు

వాత్సాయనుడు కామసూత్రాలను సంస్కృత భాషలో రచించెను.

‘రత్నావళి-రాజపరికధ’ గ్రంధకర్త ఆచార్య నాగార్జుడు

ఆచార్య నాగార్జుడు నాల్గవ బౌద్ధ సంగీతికి హాజరయ్యెను.

మూడోపులోమావి వేయించిన మ్యాకదోని శాసనం బళ్ళారి జిల్లాలో లభించింది.

మ్యాకదోని శాసనం శాతవాహన రాజు, మూడవ పులోమావినకు చెందినది.

‘నేచురల్ హిస్టరీ’ గ్రంథకర్త పిన్లీ

కళింగ ఖారవేలుని ‘హతిగుంఫ’ శాసనంలో మొదటి శాతకర్ణి గురించి పేర్కొనడం జరిగింది.

అష్టభుజ నారాయణ ఆలయం నాగార్జునకొండలో కలదు.

భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీపపు మ్యూజియం నాగర్జునకొండ.

No comments:

Post a Comment