Thursday, 16 January 2020

Bits on AP Bifurcation Act 2014 for APPSC exams

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా దేశంలోనే 5వ స్థానంలో ఉండగా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానం

దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత శాతం? 4.10 శాతం

రాష్ట్ర విభజనకు ముందు పట్టణీకరణ 34 % ఉండగా, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ శాతం ఎంత? 29 %.

విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎంత?
రూ.85,797/-

ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 997:1000

నవ్యాంధ్రప్రదేశ్ జన సాంద్రత ఎంత? 304 చదరపు కిలోమీటరు కు

ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? కృష్ణాజిల్లా.

ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? కడప

ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత? 9.21%.

ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద వృద్ధిరేటు అధికంగా గల జిల్లా ఏది? కర్నూలు.

ఆంధ్ర ప్రదేశ్ లో దశాబ్ద వృద్ధి రేటు తక్కువగా గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత 67 35%.

నవ్యాంధ్రప్రదేశ్ లోని మండలాల సంఖ్య ఎంత? 670.

నవ్యాంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత? 49.

రాష్ట్రంలో అత్యధిక జనాభా గల గ్రామం ఏది? జంగారెడ్డిగూడెం( ప.గో జిల్లా).

రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మండలం ఏది? విజయవాడ అర్బన్.

రాష్ట్రంలో అత్యల్ప జనాభా గల మండలం ఏది? మారేడుమిల్లి తూ.గో.జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో గల మున్సిపల్ కార్పొరేషన్ సంఖ్య ఎంత? 14

ఆంధ్రప్రదేశ్ లో గల మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? 97

విభజన నాటికి ఆంధ్ర ప్రదేశ్ జనాభా, ఆదాయాల నిష్పత్తి ఎంత? 58:42

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత రేటు కున్న హోదా ఉన్న జిల్లాలు ఎన్ని? 6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యతా రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ అక్షరాస్యతా రేటు ఎంత ?59.96

రాష్ట్రంలో అత్యల్ప షెడ్యూల్ తెగల  జనాభా కలిగిన జిల్లా ఏది? కర్నూలు

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా లోని లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? శ్రీకాకుళం

ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ దశాబ్ద వృద్ధిరేటు కలిగిన జిల్లా ఏది? పశ్చిమ గోదావరి.

కులాంతర వివాహం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దంపతులకు ఎంత మొత్తం ప్రోత్సాహకరంగా అందజేస్తుంది?రూ.50,000 /-

APSCCFC లిమిటెడ్ ద్వారా జోగిని మహిళల పునరావాసం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లో కేటాయించిన మొత్తం ఎంత? రెండు కోట్లు.

షెడ్యూల్డ్ కులాలు తెగల ఉప ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగాల గురించి చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ(షెడ్యూల్డ్ కులాల)  ఆర్డర్, 1950 నుంచి తొలగించారు? బేడ(బుడగ)జంగం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ఎంత? 58.32:41.68

అన్న సంజీవని అనగానేమి? స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జెనరిక్ ఔషధాల దుకాణములు.

శిల్పారామం కళా, హస్తకళ సాంస్కృతిక సొసైటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ షెడ్యూల్ లో ఉన్నది? 8వ షెడ్యూల్

No comments:

Post a Comment