Tuesday, 14 January 2020

A.P.Bifurcation Act Bits

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భముగా, షీలా భిడే కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? 9వ షెడ్యూల్ లోని ఆస్తుల విభజనకు

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం  సింగరేణి కాలరీల నుండి ఎన్ని బొగ్గు లింకేజ్ లు  కొనసాగుతాయి? ప్రస్తుతం ఉన్న లింకేజ్ లు కొనసాగుతాయి

పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ డిమాండ్ చేశారు. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలని కోరారు? విశాఖపట్టణం

ఏ ప్రదేశంలో ICAR స్థాపించిన భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ఉన్నది? పెదవేగి

రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది? ఆర్టికల్ 214

కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి యొక్క ఆస్తులను ఏ విధముగా విభజింపవలెనని పేర్కొన్నారు?
ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. కానీ నగదు నిల్వలు/ఖాతాలలోని జమలు 52: 48 నిష్పత్తిలో పంపిణీ చేయాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని పరిచ్ఛేదం 51(1)  క్రింద పరిశ్రమలు నుండి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి.

APSCHE విషయంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 10 లో పేర్కొన్న సంస్థల ఆస్తులను చట్టంలోని ఏ పరిచ్ఛేదంలో తెలిపిన విధానం ప్రకారం పంపకం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? పరిచ్ఛేదం 47

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎక్కడ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది? కర్నూలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, SAIL సంస్థ ఒక సమీకృత కర్మాగారాన్ని ఏ జిల్లాలో స్థాపించుటకు వీలవుతుందో లేదో పరిశీలించాలి? వైఎస్ఆర్ కడప జిల్లా.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఏమీ లేవు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ IX లో పేర్కొన్న కార్పొరేషన్ ల ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పంచుకోవాలో నిర్ధారించే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం ఏది? పరిచ్ఛేదం 52

No comments:

Post a Comment