Wednesday 15 January 2020

Bits on AP Bifurcation Act 2014 for APPSC Exam

ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1

ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? కర్నూలు

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4

ఆంధ్రులకు తొలి శాసనం ప్రమాణంగా గుర్తింపు పొందిన మైదవోలు శాసనం ప్రకారం ఆంధ్రుల రాజధాని ఏది? ధాన్యకటకం

అమరావతి గురించి తెలియజేయు శాసనం ఏది? మైదవోలు శాసనం

పూర్వం అమరావతికి గల ఇతర పేర్లేమిటి? ధాన్యకటకం, ఆంధ్రనగరి, ధరణికోట.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1

CRDAకు ఎన్ని కోట్ల CO క్యాపిటల్ ఫండ్ ను ఇస్తారు? వెయ్యి కోట్లు

కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్ర హోంశాఖ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఎవరు? కె. శివరామకృష్ణన్(చైర్మెన్), ఆర్మూన్ దేవి, జగన్ షా, కె. టి. రవీంద్రన్ , డాక్టర్ రతీన్ రాయ్ ఈ కమిటీలో సభ్యులు

శివరామకృష్ణన్ కమిటీ ఎప్పుడు నియమితమైనది? 28 మార్చ్ 2014

శివరామకృష్ణన్ కమిటీ తన పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 31 ఆగస్టు 2014

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధానికి ప్రాంత పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఏది? శివరామకృష్ణన్ కమిటీ

శివరామకృష్ణన్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? సూపర్ సిటీ లో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణ, అభివృద్ధి పంపిణీ

శివరామకృష్ణన్ కమిటీలో  చైర్మన్ తో కలిపి సభ్యులు ఎంతమంది?5

నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన ఏ తేదీన జరిగింది? అక్టోబర్ 22, 2015

నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసినది ఎవరు? నాటి ప్రధాని నరేంద్ర మోడీ

CRDA బిల్లును నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? 22 డిసెంబర్, 2014

CRDA మొదటి కమిషనర్ ఎవరు? నాగులపల్లి శ్రీకాంత్

CRDA కి అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మొట్టమొదట భూమిని ఇచ్చిన మహిళ ఎవరు? కె.ఆదిలక్ష్మమ్మ

CRDA ఉపాధ్యక్షుడు ఎవరు? మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి

నవ్యాంధ్రప్రదేశ్ మంత్రి మండలి తొలి సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? విశాఖ పట్నం .

నూతన రాజధానికి ఏ గ్రామంలో శంకుస్థాపన జరిగింది? ఉద్దండరాయునిపాలెం

2016 ఫిబ్రవరి 17 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ భవన నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? వెలగపూడి

నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం ఎప్పుడు ప్రారంభం అయ్యింది? 2016 జూలై 28.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని భూసేకరణ చట్టం ద్వారా స్వాధీన పరుచుకోవటానికి వీలుగా ప్రభుత్వం ఏ రోజున ఉత్తర్వులు జారీ చేశారు? 14 మే 2015.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి  ఏ తేదీన నిర్ణయం తీసుకుంది? 1 ఏప్రిల్ 2015

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అత్యవసర సదుపాయాల ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తుందని విభజన చట్టం 2014 లో పేర్కొన్న సెక్షన్ ఏది? సెక్షన్ 94(3)

నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఏ రోజున పదవి ప్రమాణ స్వీకారం చేశారు? 8 జూన్ 2014.

నవ్యాంధ్ర రాజధాని నగర పరిధి విస్తీర్ణం ఎంత? 375 చదరపు కిలోమీటర్లు

2011 జనాభా లెక్కల ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత? 67.35 శాతం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార చట్టం 2014 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 2014, డిసెంబర్ 30.

కృష్ణా జిల్లా లోని  ఎన్ని మండలాలు   పూర్తిగా CRDA పరిధిలోకి వస్తాయి? 15

అమరావతి నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ దాఖలైన నాలుగు కేసులను కొట్టివేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు తీర్పునిచ్చింది ? 17 నవంబర్ 2017

రాజధాని నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చిన జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఎవరు నేతృత్వం వహించారు? జస్టిస్ స్వతంత్ర కుమార్

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు లో నిర్దేశించిన అంశాల పర్యవేక్షణ కమిటీకి ఎవరు చైర్మన్ గా వ్యవహరించనున్నారు? కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అదనపు కార్యదర్శి.

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత 2014-15 కాలానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు స్థూల దేశీయ ఉత్పత్తి GSDP తో పోలిస్తే తీర్చవలసిన అప్పు ఎంత శాతం గా ఉన్నది? 29.36

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2017-18 లో తెలిపిన సమాచారం ప్రకారం అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ భవనం ఎన్ని రోజుల్లో పూర్తి అయినది? 192 రోజుల్లో

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ని  ఏ అధికరణ క్రింద కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని కోసం ప్రత్యామ్నాయాలను సూచించే నిపుణుల సంఘాన్ని నియమించాలి? 6 వ అధికరణ

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ యొక్క భౌగోళిక ప్రాంతం ఏది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం

పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ నగరం నుండి వచ్చే పన్ను రాబడి ఎంత? ఆంధ్రప్రదేశ్ కు వాటా ఇవ్వబడదు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎంపిక చేసినది ఎవరు? ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్

ప్రస్తుతం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాజధాని? డీ జ్యుర్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014  లోని 5వ అధికరణను అనుసరించి హైదరాబాద్ నగరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరములకు వరకు ఉమ్మడి రాజధానిగా వెలుగుతుంది? 10 సంవత్సరములు మించకుండా

No comments:

Post a Comment