Sunday 12 January 2020

A.P.History Bits

రంగనాధ రామాయణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? గోనబుద్ధారెడ్డి

భాస్కర రామాయణాన్ని రచించిన రచయిత ఎవరు? భాస్కరుడు

బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను రచించినది ఎవరు? పాల్కురికి సోమనాథుడు
   
మార్కండేయ పురాణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?మారన

శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మల్లికార్జున పండితారాధ్యుడు

సుమతీ శతకం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? బద్దెన

సర్వేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? యధావాక్కుల అన్నమయ్య

నీతిసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఒకటవ ప్రతాపరుద్రుడు

సకల నీతి సారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మడికి సింగన్న

ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? విద్యానాధుడు

పురుషార్థ సారం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?శివదేవయ్య

నృత్య రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాలను రచించినది ఎవరు ? జయపసేనాని

దశకుమార చరిత్ర అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? కేతన

నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? తిక్కన

కాకతీయుల అధికార భాష ఏది? సంస్కృతం

కాకతీయులు ఏ భాషకు ప్రాధాన్యమిచ్చారు? తెలుగు

హనుమకొండ శాసనాన్ని రచించిన వారు ఎవరు ? అచితేంద్రుడు

గణపవరం శాసనాన్ని రచించిన వారు ఎవరు? నంది మిత్రుడు

పాకాల శాసనాన్ని రచించినది ఎవరు? కవి చక్రవర్తి

కందవరం శాసనాన్ని రచించినది ఎవరు? బాలభారతి

చేబ్రోలు శాసనాన్ని రచించినది ఎవరు?
భీమయ పండ

బూతపుర శాసనాన్ని రచించినది ఎవరు? ఈశ్వర భట్టోపాద్యుడు

గూడూరు శాసనాన్ని రచించినది ఎవరు? రెండవ బేతరాజు

కొణిదెన శాసనాన్ని రచించినది  ఎవరు? ఓపిలసిద్ధి

ఉప్పరపల్లె శాసనాన్ని రచించినది ఎవరు? కాటమరాజు

మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది? కాకతీయులకు

కాకతీయులను గురించి ప్రస్తావించిన మొదటి శాసనం ఏది? దానార్ణవుని మాగల్లు శాసనం

ఏ శాసనం ప్రకారం కాకతీయులు సూర్యవంశం కు చెందినవారని తెలుస్తోంది? చేబ్రోలు శాసనం

గణపతిదేవుని ఏ  శాసనం ప్రకారం కరికాల చోడుడు కాకతీయుల పూర్వీకుడు అని వివరిస్తుంది? గరవపాడు శాసనం

గణపతిదేవుని ఏ శాసనంలో కాకతీయులను సూర్య వంశీకులుగా వర్ణిస్తూనే, శూద్రులు అనే పేరుకూడా సూచించడం జరిగింది? ఉప్పంపల్లి శాసనం

కాకతీయులు మొదట్లో ఏ  మతస్తులు? జైన మతస్థులు

తర్వాతి కాకతీయులు ఏ మతస్తులు? శైవమతస్థులు

కాకతి పురాధినాధ అనే బిరుదు ఎవరికి కలదు? బేతరాజుకు

కాకతి వల్లభ అనే బిరుదు ఎవరికి కలదు? ప్రోలరాజుకి

కాకతీయుల వంశ వృక్షాన్ని గురించి తెలియజేయు శాసనమేది? మైలాంబ యొక్క బయ్యారం  చెరువు శాసనం

కాకతీయులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారమేదీ? మాగల్లు శాసనం

No comments:

Post a Comment