Thursday, 16 January 2020

AP Economy Bits, AP Geography Bits

బొగ్గులో ఉండే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలు. అవి ఆంథ్ర సైట్, బిట్యూమినస్, లిగ్నైట్ మరియు బీట్

అత్యంత శ్రేష్టమైన బొగ్గు ఏది? ఆంథ్ర సైట్

అత్యంత తక్కువ శ్రేష్టమైన బొగ్గు ఏది? పీట్

భారతదేశంలో అధికంగా లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? బిట్యూమినస్ మినిట్స్

ఆంధ్రప్రదేశ్లో అధికంగా లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? బిట్యూమినస్

భారతదేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏది? రాణిగంజ్

దేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏది? ఘరియా(ఝార్ఖండ్)

ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారత దేశ ఉత్పత్తి ఎంత శాతం? 2 శాతం

భారతదేశంలో మొదటిసారిగా యురేనియం నిల్వలను ఏ ప్రాంతంలో గుర్తించారు? జాదుగూడా (ఝార్ఖండ్)

ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన యురేనియం క్షేత్రం ఏది? తుమ్మలపల్లి (వైఎస్ఆర్ కడప జిల్లా)

యురేనియం యొక్క ముడి ఖనిజం ఏది? పిచ్ బ్లడ్

ప్రపంచంలో యురేనియం నిల్వలు అధికంగా గల దేశం ఏది? ఆస్ట్రేలియా

ప్రపంచంలో యురేనియం అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? కజకిస్తాన్

థోరియం యొక్క ముడి ఖనిజం పేరు ఏమిటి? మోనజైట్

ప్రపంచంలో థోరియం నిల్వలు మరియు ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో గల దేశం ఏది? భారతదేశం

భారతదేశంలో థోరియం నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

భారతదేశంలో థోరియంను  అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కేరళ

ఆంధ్రప్రదేశ్లో థోరియాన్ని అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది? విశాఖపట్టణం

ఆంధ్రప్రదేశ్లో థోరియం నిల్వలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? భీమునిపట్నం పట్నం( విశాఖపట్నం జిల్లా)

No comments:

Post a Comment