Thursday, 16 January 2020

Bits on AP Economy, Bits on AP Geography

Andhra Pradesh mineral Development Corporation ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 24 ఏప్రిల్ 1961

ఆంధ్రప్రదేశ్లో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? అగ్నిగుండాల( గుంటూరు జిల్లా)

భారతదేశంలో రాగి నిక్షేపాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్

భారతదేశంలో రాగిని అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ నిల్వలు అత్యధికంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం.

భారతదేశంలో బాక్సైట్ నిల్వలు మరియు ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఒడిశా

భారతదేశంలో బాక్సైట్ నిల్వలు పరంగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో మాంగనీస్ నిల్వలు అధికంగా కల జిల్లా ఏది? శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్లో మాంగనీస్ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి? కోడూరు (శ్రీకాకుళం), గరివిడి (విజయనగరం)

భారతదేశంలో మాంగనీస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఒడిశా

భారతదేశంలో మాంగనీస్ ను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర

ఆంధ్రప్రదేశ్లోని మాంగనీస్ నిక్షేపాలు ప్రధానంగా ఏ రకమైన శిలకు సంబంధించినవి ? కోడూరైట్

ఆంధ్రప్రదేశ్లో సీసం నిక్షేపాలు ఎక్కువగా విస్తరించిన జిల్లా ఏది? కర్నూలు

భారతదేశంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రం ఏది? ఝార్ఖండ్

భారతదేశంలో ఇనుము అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఒడిశా

ఆంధ్రప్రదేశ్లో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

భారతదేశంలో బంగారం నిక్షేపాలు అధికంగా గల రాష్ట్రం ఏది? కర్ణాటక

ఆంధ్రప్రదేశ్లో బంగారం లభించే ప్రాంతాలు ఏవి? రామగిరి, పెనుగొండ (అనంతపురం జిల్లా), దుగ్గల్ మండలం, జొన్నగిరి (కర్నూలు జిల్లా), మల్లప్ప కొండ, పెద్దపర్తి కొండ , చిత్ర గుంట (చిత్తూరు జిల్లా)

భారతదేశంలో అపటైట్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్.

ఆంధ్ర ప్రదేశ్ లో అపటైట్ నిల్వలు మరియు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం

అపటైట్ ను దీని తయారీలో ఉపయోగిస్తారు? ఫాస్పేట్ ఎరువులు, పాస్ఫారిక్ ద్రావణాల తయారీలో

భారతదేశంలో ముగ్గురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి క్షేత్రం ఏది? మంగంపేట (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి మిల్లులు అధికంగా గల ప్రాంతం ఏది? రైల్వేకోడూరు( వైఎస్ఆర్ కడప జిల్లా)

ముగ్గురాయిని ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారు? పెట్రోలియం త్రవ్వకంలో వాడే డ్రిల్లింగ్ మడ్ గా ఉపయోగిస్తారు.

ఇటీవల జరిపిన పరిశోధనల్లో మంగంపేట గనులలో ముగ్గురాయి తో పాటు ఏ కర్బన రూపాన్ని గుర్తించారు? బ్లాక్ సెల్ పుల్లరీన్

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయడంలో దేనిని ఉపయోగిస్తారు? పుల్లరీన్

సున్నపురాయి నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? కర్నూలు జిల్లా

ఆంధ్రప్రదేశ్లో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి? బేతంచెర్ల, కోయిలకుంట్ల, నందికొట్కూర్( కర్నూలు జిల్లా), జమ్మలమడుగు, మైదుకూరు (వైఎస్ఆర్ కడప జిల్లా), ద్వారకాతిరుమల భీమడోలు (ప.గో జిల్లా)

సిమెంట్ పరిశ్రమకు ప్రధానమైన ముడి పదార్థం ఏది? సున్నపురాయి

భారతదేశంలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక

భారతదేశంలో సున్నపురాయి ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆస్బెస్టాస్ నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప జిల్లా

భారతదేశంలో ఆస్బెస్టాస్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? రాజస్థాన్

భారతదేశంలో ఆస్బెస్టాస్ ను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ప్రపంచంలో మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం

భారతదేశంలో మైకా ను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో మైకా నిల్వలు మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? నెల్లూరు జిల్లా

భారతదేశంలోని లోతైన మైకా గని ఏది? షా గని గూడూరు (నెల్లూరు జిల్లా)

ఆంధ్రప్రదేశ్లో గ్రాఫైట్ నిల్వలు అధికంగా గల జిల్లా ఏది? కృష్ణాజిల్లా

భారతదేశంలో గ్రాఫైట్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్

ప్రస్తుతం భారతదేశంలో అధికంగా గ్రాఫైట్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తమిళనాడు

దేనిని నల్ల సీసం అని కూడా పిలుస్తారు? గ్రాఫైట్ ను

భారతదేశంలో వజ్రాలు అధికంగా లభించే ప్రాంతం ఏది? పన్నా (మధ్యప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్లో వజ్రాలు అధికంగా లభించే ప్రాంతం ఏది? వజ్రకరూరు (అనంతపురం జిల్లా)

No comments:

Post a Comment