దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది ఏది? గోదావరి నది
గోదావరి నది జన్మస్థలం ఏది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో నాసిక్ సమీపాన గల త్రయంబకం.
గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మూడు రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతం దేశంలో ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉంది? 7 రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక మరియు ఒడిశా.
గోదావరి నది మొత్తం పొడవు ఎంత? 1465 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పొడవు ఎంత? 250 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్ లోకి గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది? బూర్గంపహాడ్ మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఎంత? 24%.
కృష్ణా నది జన్మస్థలం ఏది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వరం.
కృష్ణా నది ఎన్ని రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? నాలుగు రాష్ట్రాలు. అవి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్.
కృష్ణా నది మొత్తం పొడవు ఎంత? 1,400 కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ప్రవహించే పొడవు ఎంత? 485 కిలోమీటర్లు.
కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామం వద్ద.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎంత? 27.4 శాతం
తుంగభద్రా నది జన్మస్థలం ఏది? కర్ణాటకలోని వరాహ కొండలు
తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద
రాష్ట్రంలో అతి పొడి ప్రాంతమేది? హగరీ నదీ లోయ ప్రాంతం
హగరీ నది ఏ నది యొక్క ఉపనది? తుంగభద్రా నది
పెన్నా నది యొక్క జన్మస్థలం ఏది? కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో గల నంది దుర్గ కొండలు.
పెన్నా నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని చౌటుప్పల్ వద్ద ప్రవేశిస్తుంది.
పెన్నానది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ప్రవహిస్తుంది? అనంతపురం, కడప మరియు నెల్లూరు జిల్లాలలో.
పెన్నా నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
చిత్రావతి ఏ నది యొక్క ఉపనది? పెన్నా నది.
కుందేరు, సగిలేరు, హంద్రీ నదులు ఏ నది యొక్క ఉపనదులు? పెన్నా నది
పాపాఘ్ని, చెయ్యేరు నదులు ఏ నదుల యొక్క ఉపనదులు? పెన్నా నది
No comments:
Post a Comment