Tuesday, 21 January 2020

A.P.Economy Bits in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద విస్తీర్ణం గల జిల్లా ఏది? అనంతపురం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లా ఏది? శ్రీ కాకుళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా గల జిల్లా ఏది? తూర్పు గోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది? విజయనగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక గ్రామాలు గల జిల్లా ఏది? విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ గ్రామాలు గల జిల్లా ఏది? గుంటూరు

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పట్టణాల సంఖ్య ఎంత? 195

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక పట్టణాలు గలవు? చిత్తూరు(22).

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ పట్టణాలు గలవు? నెల్లూరు(10).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ఎంత? 304

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక జనసాంద్రత గలదు? కృష్ణాజిల్లా (518).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లా అతి తక్కువ జన సాంద్రత కలిగి ఉన్నది? కడప (188)

2001 -11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు ఎంత ? 9.21 శాతం

2001 -11 మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన జిల్లా ఏది? కర్నూలు (14.85%)

2001-11 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన జిల్లా ఏది? పశ్చిమగోదావరి( 3.58 %)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఏ జిల్లాలో అధిక పురుష జనాభా నమోదైంది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ పురుష జనాభా నమోదయింది? విజయనగరం

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక స్త్రీ జనాభా నమోదయింది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అతి తక్కువ స్త్రీ జనాభా నమోదయింది? విజయనగరం

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయిన సెక్స్ రేషియో ఎంత? 997

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక సెక్స్ నమోదయింది? విజయనగరం(1019)

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ సెక్స్ నమోదయింది? అనంతపురం( 977)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారని నమోదయింది? ఆరు జిల్లాలు. అవి విజయనగరం (1019), శ్రీకాకుళం (1015), తూర్పుగోదావరి (1007), విశాఖపట్నం(1006), పశ్చిమ గోదావరి (1004), గుంటూరు(1003)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక గ్రామీణ జనాభా నమోదయింది? తూర్పుగోదావరి

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ గ్రామీణ జనాభా నమోదయింది? విజయనగరం.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎంత? 29.47%

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అధిక పట్టణ జనాభా శాతం నమోదైంది? విశాఖపట్టణం (47.45 %).

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతి తక్కువ జనాభా శాతం నమోదైంది? శ్రీకాకుళం (16.16 %)

No comments:

Post a Comment