Monday 27 January 2020

A.P.Economy Bits for APPSC Group 2 Exam

వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏ రోజు నుండి అమల్లోకి రానుంది? 15 అక్టోబర్, 2019.

వైఎస్సార్ రైతు భరోసా పథకం లో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరమునకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? రూ.12,500/-

2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడిలో GST ద్వారా ఎంత శాతం లభించింది? 35%.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగుభూమి శాతం ఎంత? 37.08%.

ప్రపంచ చేపల ఉత్పత్తిలో  ఆంధ్ర ప్రదేశ్ వాటా ఎంత? 1.61%.

భారతదేశంలోనే మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

భారతదేశంలో మొదటి కోస్టల్ కారిడార్ ఏది? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.

భారతదేశంలో LED వీధి లైట్లు ఏర్పాటు లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్ర ప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి? 14

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మున్సిపాలిటీలు కలవు? 71

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని నగర పంచాయతీలు కలవు? 25

ప్రస్తుతం మీసేవ ద్వారా ఎన్ని రకాల సేవలు అందిస్తున్నారు? 390.

2018 19 ఆంధ్ర ప్రదేశ్ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? 1059

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అధిక తెల్ల రేషన్ కార్డులు గలవు? తూర్పుగోదావరి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏ జిల్లాలో అల్ప సంఖ్య లో తెల్ల రేషన్ కార్డులు కలవు? విజయనగరం

2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ షాపుల సంఖ్య ఎంత? 28,510

భూకమతాల వివరాలు (వ్యవసాయ గణాంకాలు) ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ప్రతి 5 సంవత్సరాలకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమేట్ టిక్ జోన్లు ఎన్ని? 6

నికర పంట విస్తీర్ణానికి, స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది ఏది? పంటల తీవ్రత (cropping intensity)

2019 అక్టోబర్ 15 నుంచి అమలు పర్చనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూ12,500/- లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే సహాయం ఎంత? కేంద్రం రూ. 6,000/- రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500/-.

వైఎస్ఆర్ భీమా కింద రైతు ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆత్మహత్య ద్వారా మరణించినా బాధిత కుటుంబానికి అందే సహాయం ఎంత? 7 లక్షల రూపాయలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కామతాలు ఏ రకానికి చెందినవి? ఉపాంత కమతాలు.

2018 - 19 లో రాష్ట్రంలో  నికర సేద్య విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? అనంతపురం

2018 - 19 లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది? విశాఖపట్టణం

కాలువల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? గుంటూరు

చెరువుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? విజయనగరం

బావుల ద్వారా నికర నీటి పారుదల గల భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? పశ్చిమ గోదావరి

చెరువుల ద్వారా నికర నీటి పారుదల భూమి తక్కువగా ఉన్న జిల్లా ఏది? వైఎస్ఆర్ కడప

2018 -19 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా ఏది? గుంటూరు

2018-19 సంవత్సరానికి అతి తక్కువ వ్యవసాయ రుణాలు పొందిన జిల్లా ఏది? విజయనగరం.


No comments:

Post a Comment