విశాలాంధ్ర మహా సభను స్థాపించినది ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు.
విశాలాంధ్ర మహాసభ యొక్క మొదటి సభ ఎక్కడ జరిగింది? వరంగల్.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు 1953 లో నియమించబడిన రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు? ఫజల్ అలీ
తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 20, ఫిబ్రవరి 1956.
పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర ప్రాంతం తరుపున పాల్గొన్నది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మరియు గౌతు లచ్చన్న
పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరుపున పాల్గొన్నది ఎవరు? కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మరియు జె.వి.నరసింగరావు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలో అంగీకరించిన మంత్రుల నిష్పత్తి ఎంత? 3 : 2
పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణలో స్థానిక పొందాలంటే ఎన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలి? 12 సంవత్సరాలు
పెద్దమనుషుల ఒప్పందంలో కల్పించిన హామీలను అమలు పరచడానికి ఏ సంవత్సరంలో ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు? 1994.
1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సంవత్సరం ఏది? 1958
ఏ సమస్య పరిష్కారానికి 1969 ఏప్రిల్ లో అష్ట సూత్రాల ప్రణాళిక ప్రకటించబడింది? జై తెలంగాణ ఉద్యమం.
ఏ పథకం కోసం, 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ నిబంధనలు రద్దు కాబడి, రాష్ట్రం ఆరు జోన్లుగా విభజించబడింది? ఆరు సూత్రాల పథకం.
1984 - 89 మధ్య కాలంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ
అవినీతి నిర్మూలనకు 'ధర్మ మహామంత్రి' అనే ఉద్యోగిని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీఆర్
ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య ఎంత? 13 మంది
ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1955.
ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసన మండలి ఏర్పాటయింది? నీలం సంజీవరెడ్డి.
1958లో ఎంత మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది? 90 మంది.
1969లో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలం ఏది? ముల్కీ నిబంధనలు.
ఏ ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది? పీ.వి. నరసింహారావు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1983 జనవరి 9.
తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? కె. అచ్యుత్ రెడ్డి
1959 జూన్ లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఎన్. జి. రంగా.
నీలం సంజీవరెడ్డి ఏ సంవత్సరంలో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? 1960
శాసన మండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు? కె. రోశయ్య మరియు భవనం వెంకట్రావు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? కాసు బ్రహ్మానంద రెడ్డి.
1927లో పత్రిక స్వాతంత్ర్యాన్ని హరించే ప్రెస్ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి
1966 లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటులో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదము ఇచ్చిన వారు ఎవరు? తెన్నేటి విశ్వనాథం
ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? జనవరి 18, 1973.
ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు, అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎవరు? సి.ఎం.త్రివేది
1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం వలన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వారు ఎవరు? పి. వి.నరసింహారావు.
No comments:
Post a Comment