Friday, 24 January 2020

2019 Group 2 Bits , Previous Bits on A.P.History

ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతానికి గొప్ప సేవలందించిన మహిళ ఎవరు? బోధిసిరి

రెండో పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురం గా ప్రస్తావించింది? మార్టూరు శాసనం

చాళుక్యుల కాలంలో 'గాంధర్వ విద్యా విశారద' అనే బిరుదును పొందినది ఎవరు? చెల్లవ్వ

'కళ్యాణ కారక 'అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు?
ఉగ్రాదిత్యాచార్యుడు

108 శివాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు? రెండో విజయాదిత్యుడు.

కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం ఏది ? మిశ్రశైవం

వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? పెనుగొండ

సార సంగ్రహ గణితమనే  గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వాడు ఎవరు? పావులూరి మల్లన.

'అభినవదండి' అనే బిరుదును ధరించినది ఎవరు? కేతన.

కందుకూరును బెజవాడవలె అభివృద్ధి పరచిన చాళుక్య ప్రభువు ఎవరు? మూడో విజయాదిత్యుడు

తొలి చాళుక్యులు ఏ మాతృదేవతను ఆరాధించారు? హారీతి

'చిత్రమేళి'అనే శ్రేణిని నెలకొల్పుకున్న వారు ఎవరు? వ్యవసాయదారులు

కాకతీయులకాలంలో కుల సంఘాలను ఏ విధంగా పిలిచేవారు? సమయము.

పెదగంజాం ,చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి? ఉప్పు

కుమారిల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పంథా ఏది? పూర్వమీమాంస.

'స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వ ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది' అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చును? కేతన రచించిన విజ్ఞానేశ్వరం.

కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు.

మోటుపల్లికి ఉన్న మరో పేరు ఏమిటి? దేశీయక్కొండ పట్టణం.

నృత్య రత్నావళిని రచించిన జాయన ప్రధాన వృత్తి ఏది? గజసాహిణి

ప్రాచీన, మధ్య యుగాల్లో ప్రాడ్వివాకుడు ఏ విభాగంలో రాజుకు సలహాదారుగా ఉండేవాడు? న్యాయవ్యవస్థ.

కాకతీయ రుద్రమ ఎవరి పై విజయానికి చిహ్నంగా 'రాయగజకేసరి' బిరుదాన్ని ధరించారు? దేవగిరి పాలకులు

కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఎవరికీ బందీగా  పట్టుబడ్డాడు? ఉలూఘ్ ఖాన్

'జలకరండ' అనేక సంగీత పరికరం ఏ శాసనంలో పేర్కొనబడింది? ధర్మసాగర శాసనం

రెడ్డి రాజుల పాలనా కాలంలో వ్యాపారాన్ని గురించి సమాచారాన్నిచ్చే సాహిత్య గ్రంథం ఏది? హరవిలాసం.

పెదకోమటి వేముని సతీమణి సూరాంబికా త్రవ్వించిన తటాకమేది? సంతాన సాగరం.

రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతి పాత్రమైన పండగ ఏది? వసంతోత్సవం

'సంగీత చింతామణి'అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? పెదకోమటి వేముడు

కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ప్రోలయ నాయకుడు.

శ్రీ కృష్ణ దేవరాయలు 'జాంబవతి కళ్యాణం' అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృతం.

విజయనగర సామ్రాజ్యంలో 300లకు పైగా ఓడ రేవులున్నట్లు మనకు తెలిపినది ఎవరు? అబ్దుర్ రజాక్

రాయల పాలనలో 'కందాచార' శాఖ ఏ విషయాల్ని పరిశీలించేది? సైనిక విషయాలు

తటాక నిర్మాణ సమయంలో పాటించవలసిన 12 సూత్రాలను వర్ణించినది ఏ శాసనం? పోరుమామిళ్ల శాసనం.

విజయనగర రీతిలో అందంగా రూపొందిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? లేపాక్షి.

శ్రీ కృష్ణ దేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఎవరు? డొమింగో పేస్.

విజయనగర కాలంలో కనిపించే విప్రవినోదులు ఎవరు? బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్ళల్లో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు.

కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి

మేలైన రత్నాలు, వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు? టావెెర్నియర్.

క్రీస్తుశకం 16,17 శతాబ్దాలలో చేనేత వస్త్రల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడ రేవు పట్టణం ఏది? మచిలీపట్నం.

బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఎవరి సాయం తీసుకున్నాడు? ఫ్రెంచి.

సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన 'విప్లవ పరివర్తనము' అనే బహిష్కృత నాటకాన్ని రచించినది ఎవరు? కొడాలి ఆంజనేయులు.

వీరేశలింగం పంతులు గారిని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? ఎం.జి.రనడే.

ఆంధ్ర సమాజం నుండి 'భోగం' కులం అంతర్దానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు.

కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకం గా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? 1921

"వీర గంధము తెచ్చినారము-వీరులెవ్వరో తెలపండి"అనే గేయం ఏ  ఉద్యమకాలంలో రచించబడింది ? ఉప్పు సత్యాగ్రహం

గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు?
వీనం వీరన్న

ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం "ఆంధ్ర కేసరి" గా పిలవబడ్డాడు?
సైమన్ గో బ్యాక్ ఆందోళన

వందేమాతర ఉద్యమకాలంలో ఆంధ్రలో జరిగిన ఏ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదయింది? కాకినాడ సామూహిక అల్లరి కేసు

"భరత ఖండంబు చక్కని పాడి యావు- హిందువులు లేగదూడలై యేడ్చుచుండ -  తెల్లవారను గడసరి గొల్లవారు-పితుకుచున్నారు మూతులు బిగియగట్టి" అని చెప్పినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఎలా పిలిచారు? రామదండు.

అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? చింతపల్లి.

"ఆంధ్ర శివాజీ"గా ప్రసిద్ధుడైనది ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి.

ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఎన్.జి.రంగా

సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య

1941-46 సంవత్సరముల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సర్ విజయ

"కర్నూల్ సర్కులర్"ను వ్రాసినది ఎవరు? కళా వెంకట్రావు.

ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు? వినోభా భావే.

పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? డిసెంబర్
15 డిసెంబర్ 1952.

జై ఆంధ్ర ఉద్యమానికి దారి తీసిన ప్రధాన అంశం ఏది? ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు తీర్పు

ఆరు సూత్రాల పథకం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది? 32వ సవరణ

No comments:

Post a Comment