ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేశారు.
ఈ నివేదికను ప్రతి రెండేళ్లకు ఒకసారి విడుదల చేస్తారు.
ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అడవులు 7,12,249 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.67 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం మొత్తం అడవులు మరియు చెట్లతో కలిపి భారతదేశ విస్తీర్ణంలో 24.56 శాతం ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనపరిచిన రాష్ట్రాలలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.
990 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
823 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో కేరళ తృతీయ స్థానంలో నిలిచింది.
దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం లో మధ్యప్రదేశ్ రాష్ట్రం, 77,482 చదరపు కిలోమీటర్ల తో మొదటి స్థానంలో ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం దట్టమైన పచ్చదనం ఉన్న ప్రాంతాలలో 330 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం తగ్గింది.
అత్యధిక వృక్ష జాతులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 268. 10 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33.66 శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది.
No comments:
Post a Comment