Thursday 6 February 2020

భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ-2019


భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సూచీ-2019ని నీతి అయోగ్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేసింది.

సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో భారతదేశం యొక్క కాంపోజిట్ స్కోర్  2018 లో ఉన్న 57 నుండి 2019లో 60 కి మెరుగు పడింది.

కాంపోజిట్ SDG ఇండెక్స్ లో 70 స్కోర్ తో కేరళ మొదటి ర్యాంకు సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ 69 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది.

67 పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. 

బీహార్ చివరి స్థానంలో ఉంది.

వివిధ స్కోర్ల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా దేశంలోని రాష్ట్రాలను  విభజించారు.

0 నుండి 49 సాధించిన రాష్ట్రాలను ఆశావహులు (ఆస్పిరెంట్స్), 50 నుండి 64 సాధించిన రాష్ట్రాలను పెర్ఫార్మర్, 65 నుంచి 99 సాధించిన రాష్ట్రాలను  ఫ్రంట్ రన్నర్, 100 స్కోర్ సాధించిన రాష్ట్రాలను అఛీవర్ గా విభజించారు

పేదరిక నిర్మూలనలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.

నాణ్యమైన విద్య లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

మంచి ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు లు కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

ఆకలి బాధల నివారణలో గోవా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

లింగ సమానత్వం లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

త్రాగునీరు, పారిశుద్ధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

సుస్థిర నగరాలు మరియు సమాజాలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

 పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? మూడో స్థానంలో

No comments:

Post a Comment