Monday 17 February 2020

Group 2 Screening Test A.P.History Bits

భారత జాతీయ పతాక నిర్మాత ఎవరు ?పింగళి వెంకయ్య

శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారమేది? హాలుని గాధాసప్తశతి

మహావీరాచార్యుని 'గణిత సారసంగ్రహం'ను తెలుగులోకి అనువదించినది ఎవరు? పావులూరి మల్లన

విజయపురిని నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులని చెప్పిన శాసనం ఏది? పల్లవ సింహవర్మ యొక్క మంచికల్లు శాసనం.

మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ భట్టుకు సహాయపడేననుటకు ఆధారమేది? నందంపూడి దాన శాసనం

పల్చని రాగి పై పూతతో కూడుకున్న ఇనుప నాణేలను జారీచేసిన ఆంధ్ర రాజ్య వంశం ఏది? విష్ణుకుండినలు

ఆంధ్రదేశంలో తెలుగును నిల్పిన కీర్తి ఎవరికి దక్కుతుంది? తూర్పు చాళుక్యులు

మొగల్రాజపురం, ఉండవల్లిలలో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి? విష్ణుకుండినులు

ఆంధ్రదేశంలో ఏ వంశం పాలనలో మతం, రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? కాకతీయులు

పల్నాడు ఆర్థిక జీవనంలోనికి చొచ్చుకొని వచ్చిన వెలమలను ఆ ప్రాంతంలో అధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమివేసిన యుద్ధమేది? కారంపూడి యుద్ధం

పాలెంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్రం గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? జైయికుని నృత్య రత్నావళి.

పురిటి పన్ను వసూలు చేసిన రాజు ఎవరు? రాచవేమ

సుభద్ర కళ్యాణం రచయిత ఎవరు? తాళ్ళపాక తిమ్మక్క.

కర్ణాటక సంగీత కృతులు అగ్రగామి స్వరకర్త ఎవరు? త్యాగరాయ.

విజయనగర రాజుల కాలం నాటి వినోదాలలో యక్షగానం కాకుండా ఆంధ్రదేశంలోని సాధారణ గ్రామీణ ప్రజలను అలరించే కళారూపం ఏది? తోలుబొమ్మలాట (నీడ బొమ్మలాట).

ఉత్తర సర్కారులను కంపెనీ వారికి కౌలుకి సంపాదించడంలో హైదరాబాద్ ప్రభువు నిజాం ఆలీఖాన్, మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధుల మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? కాండ్రేగుల జోగి పంతులు.

1794 పద్మనాభ యుద్ధం ఎవరి ప్రారబాధన్ని నిర్ణయించింది? విజయనగర పాలకుడు విజయరామరాజు.

దక్షిణదేశంలో సంభవించిన క్షామాలన్నింటి కంటే ఘోరమైన క్షామం ఏది? 1833, గుంటూరు క్షామం.

1746 - 47లలో బైబిల్ ను తెలుగు భాషలోకి అనువదించినవారు ఎవరు? బెంజామిన్ ఘాల్త్

అంధ్రాలోకి కిసాన్ ఉద్యమ పద నిర్ణీత ఎవరు? ఎన్.జి.రంగా

1878 లో ఆంధ్రాలో తొలి ప్రార్ధనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం పంతులు.

ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు? భవనం వెంకట్రావు.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దేని తర్వాత జరిగింది? 1956 ఫిబ్రవరి 20న పెద్దమనుషుల ఒప్పందం ద్వారా

1972 - 73 లో జై ఆంధ్ర ఉద్యమం ఎలా ముగిసింది? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు సూత్రాల పథకంతో.

No comments:

Post a Comment