Wednesday 5 February 2020

Indian Polity Bits in Telugu

భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగింది? 18 జూన్, 1951.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? 61 రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? 42వ రాజ్యాంగ సవరణ.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, నేపాలి మరియు మణిపురి భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేశారు? 53వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల వయసును 60 సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచారు? 15 వ రాజ్యాంగ సవరణ ద్వారా.

ఏ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ప్రకారం 8వ షెడ్యూల్లో ని 15వ భాష ఒరియాను ఒడిశా గా మార్చారు? 96వ రాజ్యాంగ సవరణ చట్టం.

 భారత రాజ్యాంగం 'సామాజిక పత్రం' అని వ్యాఖ్యానించింది ఎవరు? గ్రాన్ విల్ ఆస్టిన్.

 భారత రాజ్యాంగాన్ని 'అర్థ సమాఖ్య' అన్నదెవరు? కె.సి.వేర్ 

 భారత రాజ్యాంగంను 'సూయి జెనిరస్' అని వ్యాఖ్యానించింది ఎవరు ? అలెగ్జాండ్రో విజ్.

 భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి కీ నోట్ గా అభివర్ణించిన వారు ఎవరు? ఎర్నెస్ట్ బార్కర్ 

 భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య గా అభివర్ణించిన వారెవరు? పాల్ ఆపిల్ బీ, డి.ఎన్. బెనర్జీ, ప్రొఫెసర్ మోరిస్ జోన్స్.

 భారత రాజ్యాంగాన్ని ఐరావతం తో పోల్చినవారెవరు? హెచ్.వి.కామత్ 

 భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం గా అభివర్ణించిన ఎవరు? ఐవర్ జన్నింగ్స్.

 భారత రాజ్యాంగ పీఠికను 'రాజకీయ జాతకచక్రం' అన్నదెవరు? కె.ఎం.మున్షీ.

 భారత రాజ్యాంగ పీఠికను 'రాజ్యాంగం ఆత్మ' అని అన్నదెవరు? హిదయతుల్లా

 రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు.అమలుపరిచే వారిని నిందించాలి  అని అన్నదెవరు? బి.ఆర్.అంబేద్కర్ 

 రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని అన్నది ఎవరు?లార్డ్ సైమన్.

No comments:

Post a Comment