Tuesday, 4 February 2020

Current Affairs in Telugu, కరెంట్ అఫైర్స్

2019 వ సంవత్సరానికి గాను తెలుగు భాష కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన వారు ఎవరు? బండి నారాయణస్వామి.

కేంద్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారానికి ఎంపికైన బండి నారాయణస్వామి రచించిన' 'శప్తభూమి' నవల దేనికి సంబంధించినది? రాయలసీమ చరిత్ర నేపథ్యం.

2019 సంవత్సరానికి గాను మహిళల క్రికెట్ లో ఉత్తమ T20 క్రికెటర్ గా ఎంపికైనవారు ఎవరు? ఆలెసా హీలీ.

ఆంధ్ర ప్రదేశ్ సాధారణ భీమా సంస్థలను ఎంత మొత్తం తో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? 101 కోట్లతో.

2020 సంవత్సరాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఏ సంవత్సరంగా పరిగణిస్తామని ప్రకటించింది? మహిళా మిత్ర.

An Era of Darkness అనే పుస్తక రచయిత ఎవరు? శశిధరూర్

2019 సంవత్సరానికి గాను ప్రపంచం జూనియర్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? దీపక్ పూనియా

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నేతన్న నేస్తం పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎంత మొత్తం సహాయం అందిస్తారు? ఒక సంవత్సరానికి రూ.24000/-

ఇటీవల బి బి సి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఏ క్రీడాకారుడికి ప్రధానం చేశారు? Ben stokes

మిస్ వరల్డ్ ఆసియా 2019 కిరీటం పొందిన వారు ఎవరు? సుమన్ రావు.

ఇటీవల క్యూబా ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? మాన్యుయల్ల్ మర్రెరో.

వన్డేలలో 300కు పైగా పరుగులను అత్యధిక సార్లు ఛేదించిన జట్టు ఏది? భారత్.

ఒక్క ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ

నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది? సునీల్ శెట్టి.

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్త ఎవరు? జస్టిస్ చింతపట్టి వెంకట రాములు.

ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్లపాటు ఒలంపిక్స్ మరియు ప్రపంచ ఛాంపియన్షిప్స్  నుండి నిషేధించింది? రష్యా.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన సూచీ-2019లో ఆంధ్ర ప్రదేశ్ కు లభించిన ర్యాంకు ఎంత? 5.

భారత ఆర్థిక సంఘం 102వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? రాయపూర్.

జాతీయ గిరిజన నృత్యోత్సవం ఎక్కడ జరిగింది? రాయపూర్.

జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ దేనికి సంబంధించింది? తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఉద్యోగుల పంపకం.

నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి? విజయవాడ.

34వ ఇండియన్ ఇంజనీరింగ్ సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్

నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్  బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా అర్హత సాధిస్తాయి? 5 ఏళ్ళు.

భారత నైపుణ్య నివేదిక - 2020 ప్రకారం 2019 - 20 కి గాను ఉపాధి కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర.

అటల్ భూ జల్ పథకం ఎన్ని రాష్ట్రాలు మరియు రాష్టాలలో ప్రారంభించారు? 7 రాష్ట్రాలు మరియు 78 జిల్లాలు.

దేశంలోనే తొలిసారిగా వ్యాక్సినేషన్ క్లినిక్ ను ఏ నగరంలో ప్రారంభించారు? పూణే.

ఆంధ్ర ప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఎందుకు ఏర్పాటు చేశారు? రైతులకు భీమా సౌకర్యాన్ని అందించేందుకు.

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? అనంతపురం జిల్లా ధర్మవరంలో డిసెంబర్ 21న ప్రారంభించారు.

వైయస్సార్ లా నేస్తం పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? 3 డిసెంబర్, 2019.

వైయస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు అందనున్న  స్టయిఫండ్ మొత్తం ఎంత? రూ.5 వేలు.

నవరత్నాల అమలుకు నియమించిన కమిటీకి ఛైర్మన్  ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణ లో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది? ఆంధ్ర ప్రదేశ్.

2019 నవంబర్ 21న, ప్రారంభమైన వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారుల వేట నిషేధం పరిహారాన్ని రూ.4 వేల నుండి ఎంతకు పెంచారు? రూ.10 వేలు.

వైయస్సార్ కడప జిల్లాలోని ఏ మండలంలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? జమ్మలమడుగు.

2019 నవంబర్ 25న, అవినీతిపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏ ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది? 14400

No comments:

Post a Comment