భారతదేశ జాతీయ జలచరం ఏది? గంగా డాల్ఫిన్
గంగా నది లోని డాల్ఫిన్ల లెక్కింపు WWF ఏ విధానంలో చేపడుతుంది? టాండం బోట్ సర్వే పద్ధతి.
చిన్నపిల్లలకు వచ్చే డయేరియా కారణంగా సంభవించే మరణాలను పూర్తిగా ఎప్పటికల్లా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది? 2022
ఇటీవల డయేరియా వ్యాధి నివారణకు భారత ఉప రాష్ట్రపతి చేతులమీదుగా విడుదల చేసిన కొత్త వ్యాక్సిన్ పేరు ఏమిటి? రోటా-వ్యాక్-5డి వ్యాక్సిన్
కుటుంబ నియంత్రణ కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజక్షన్ ను రూపొందించిన దేశం ఏది? భారతదేశం
భారతదేశంలో సౌర విద్యుత్ పెంపుదలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవి? PM-KUSUM మరియు సోలార్ రూఫ్ టాప్ పోగ్రామ్.
PM-KUSUM అనగా నేమి? ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ యోజన.
2022 నాటికి ఎంత మొత్తంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నది? 175 GW.
2022 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఎంత మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం గా ఉన్నది? 100 GW
సౌర విద్యుత్ ఉత్పాదనలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను భారతదేశంలో ఆమోదించబడింది? 100%
ఇంటెన్సీఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0 లక్ష్యం ఏమిటి? పర్వత ప్రాంతాలు మరియు మారుమూల ప్రాంతాలలోను కూడా టీకాల కార్యక్రమం సంపూర్ణం (100%) గా అమలు చేయుట.
ఇంటెన్సీఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0లో భాగంగా ఏ వ్యాధుల నివారణకు టీకాలు వేస్తారు? మీజిల్స్,టేటానస్, డిప్తీరియా, కోరింత దగ్గు, హెపటైటిస్ బి, క్షయ, మెనింజైటీస్ మరియు పోలియో.
No comments:
Post a Comment