అశోక్ మెహతా కమిటీ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? 1978
జి.వి. కె. రావు కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985
ఎల్. ఎమ్. సింఘ్వి కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1986
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క మొదటి మరియు చివరి గవర్నర్లు ఎవరు? సి. యమ్. త్రివేది మరియు ఇ.ఎస్. ఎల్ నరసింహన్.
భారత రాష్ట్రపతి ఏ సభను రద్దు చేయలేడు? రాజ్యసభను.
భారత పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించునది ఎవరు? లోక్ సభ స్పీకర్.
భారత రాజ్యాంగానికి చేర్చబడ్డ IX-A భాగం దేని గురించి తెలియజేస్తుంది? నగరపాలక చట్టం.
ప్రధానమంత్రి నియామకం అనేది భారత రాష్ట్రపతికి గల ఏ రకమైన అధికారం? కార్యనిర్వాహక అధికారం.
విశ్వజనీన వయోజన ఓటు హక్కు మరియు సమన్యాయ పాలన భారత రాజ్యాంగపు ఏ అంశాన్ని సూచిస్తాయి? ప్రజాస్వామ్య.
భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్భాలలో తాత్కాలిక రాష్ట్రపతులు గా వ్యవహరించిన వారు ఎవరు? వి.వి. గిరి, మహమ్మద్ హిదయతుల్లా మరియు బి.డి.జత్తి.
ప్రస్తుతం భారత దేశంలో గల విధాన పరిషత్తు లలో అత్యధిక మరియు అత్యల్ప సభ్యత్వ సంఖ్య గల రాష్ట్రాలు ఏవి? ఉత్తర ప్రదేశ్ మరియు తెలంగాణ.
1978లో జనతా ప్రభుత్వం చేత భారతదేశంలో ఇతర వెనుకబడిన కులాలను గుర్తించేందుకై నియమించబడిన కమీషన్ ఏది ? మండల కమీషన్
గవర్నర్ కు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్రమంత్రి వర్గం సలహాలు ఇచ్చేందుకు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన వీలు కల్పిస్తుంది? ఆర్టికల్ 163(1).
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మావ్( అంబేద్కర్ జన్మస్థలం) లో 2016 ఏప్రిల్ 14న గ్రామాలలో పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టత కొరకై ప్రారంభించిన పధకం ఏది? గ్రామ్ ఉదయ్ సే మరియు భారత్ ఉదయ్ అభియాన్.
1969లో భారతదేశంలో మొదటిసారిగా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం ఏది? నాగాలాండ్.
భారత రాజ్యాంగం 99వ సవరణ చట్టం 2014, ఏ సంస్థ నిర్మాణం, విధులకు వీలు కల్పించింది? నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమీషన్.
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన భారతదేశంలో అస్పృశ్యత పాటించడాన్ని రద్దు చేసింది? ఆర్టికల్ 17.
భారత రాజ్యాంగ పరిషత్ protem చైర్మన్ ఎవరు? సచ్చిదానంద సిన్హా.
రాజ్యాంగం నందలి సవరణ చట్టం, 1992 కు గల మరో పేరు ఏది? నగరపాలిక చట్టం, మునిసిపాలిటీల చట్టం.
భారత రాజ్యాంగం భారతదేశాన్ని గణతంత్ర రాజ్యాంగా ప్రకటించింది. ఆ సందర్భంలో 'గణతంత్రం' అనే పదం దేనిని సూచిస్తుంది? వంశ పారంపర్య పాలన ఉండదు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? 243 K.
రాజ్యాంగం(73 వ సవరణ) చట్టం, 1992 ద్వారా చేర్చబడిన 11వ షెడ్యూల్ లోని చివరి అంశమేది? కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ.
No comments:
Post a Comment