Wednesday, 26 February 2020

Current Affairs for APPSC


ఇటీవల బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులైన  భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?రిషి సునక్

ప్రపంచాన్ని ఒణికిస్తున్న  కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని పేరు పెట్టిది? కోవిడ్ 19(CoViD-19).

కొవిడ్-19 (కరోనా వైరస్) యొక్క పూర్తి రూపం ఏమిటి? కరోనా వైరస్ డిసీజ్ 2019( CoViD-19)

సూడాన్ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు? అబ్ధుల్లా హమ్దోక్.

నౌరూ  అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?లయోనిల్ ఏంజిమియా.

 పిల్లల శ్రేయస్సు  సూచిక -2019 లో  ఏ రాష్ట్రం  అగ్ర స్థానంలో నిలిచింది? కేరళ

ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధాని ఏర్పాటుకు ఏ ద్వీపాన్ని ఎంచుకుంది? బోర్నియో

 గోరేవాడా అంతర్జాతీయ జంతుప్రదర్శన శాల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? నాగ్ పూర్ , మహారాష్ట్ర

పారాసైట్ చిత్రానికి ఎన్ని 2020  ఆస్కార్  అవార్డులు  లభించాయి? 4 అవార్డులు.

ఇటీవల రాద్-500 అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశమేది? ఇరాన్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఇ) క్రికెట్  డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? రాబిన్ సింగ్.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? పుల్లెల గోపీచంద్

2013 తర్వాత ప్రయాణికులకై తెరువబడిన అలెప్పో  అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో  ఉంది?సిరియా.

 ఇటీవల మరణించిన ఖబూస్ బిన్ సయీద్ ఏ దేశ సుల్తాన్ గా సుధీర్ఘకాలం సేవలందించారు?ఓమన్(1970 నుండి)

అంతరిక్షంలో 328రోజులు గడిపి ఇటీవల  భూమికి చేరిన మహిళా వ్యోమగామి పేరేమిటి? క్రిస్టినా హేమాన్ కోచ్
 
అమెరికాలో భారత రాయబారి గా ఎవరు నియమితులయ్యారు? తరణ్ జిత్ సింగ్ సంధూ.

 ప్రఖ్యాత IBM ఐటి సంస్థ సీఈఓ గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? అరవింద్ కృష్ణ

భారత క్రికెట్ క్రీడాకారిణి  మిథాలీరాజ్ జీవిత కథ  ఆధారంగా తీస్తున్న సినిమా పేరేమిటి? శభాష్ మిథు

 ఏ రాష్ట్రంలో జిల్లాలకు పండ్లపేర్లు పెట్టాలని నిర్ణయించారు? మణిపూర్

2020 మహిళల టీ 20 ప్రపంచకప్ టోర్నీ ఏ దేశంలో జరుగనుంది? ఆస్ట్రేలియా

ఖతర్ కొత్త ప్రధానిగా ఎవరు  నియమితులయ్యారు?
షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజిజ్ అల్ తని.

 టోక్యో ఒలంపిక్స్ 2020 లో టీం ఇండియా గుడ్ విల్  అంబాసిడర్ గా ఉండడానికి ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఎవరిని  ఆహ్వానించింది? సౌరవ్ గంగూలీ.

ఇరాక్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
మహ్మద్ తవ్ఫిక్ అల్లావి

అంతర్జాతీయ  బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాండ్జా 2020 ఎక్కడ జరిగింది? సోఫియా, బల్గేరియా

కొత్తగా ఏర్పడిన దక్షిణ సూడాన్ దేశ రాజధాని నగరం ఏది? జుబా

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? చింతల గోవిందరాజులు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిందెవరు? అరవింద్ కేజ్రీవాల్

ఆంధ్రప్రదేశలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? రాజమహేంద్రవరం(తూ.గో)

గోదావరి నది పై నిర్మితమవున్న  తుపాకులగూడెం బ్యారేజీ పేరును ఏ విధంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు? ఆదివాసి దేవత సమ్మక్క పేరు.

No comments:

Post a Comment