Sunday, 23 February 2020

Indian Polity Bits on Judiciary

భారతదేశంలోని న్యాయవ్యవస్థ ఏ తరహా కు చెందినది? ఏకీకృత.

సుప్రీంకోర్టు ప్రధాన విధులు ఏవి?  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ఏమైనా వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరిస్తుంది, ప్రాథమిక   హక్కులను   సంరక్షిస్తుంది,  రాజ్యాంగ రక్షణ బాధ్యతను కలిగి ఉంటుంది.

మొదటిసారిగా భారతదేశంలో ఫెడరల్ కోర్టు ను  ఏ చట్టం ద్వారా  ఏర్పాటు చేశారు? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల  సంఖ్యను  పెంచే అధికారం  ఎవరికి ఉంది? పార్లమెంట్ కు 

భారత  రాజ్యాంగంలోని ఏ నిబంధనలలో  న్యాయస్థానాల  క్రమ శ్రేణిని తెలియజేస్తాయి?  ఆర్టికల్స్ 233 నుండి 237 వరకు.

భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ప్రస్తావించబడింది? ఆర్టికల్ 124.

సుప్రీంకోర్టు ఏర్పాటుకు ఆధారం ఏమి? రాజ్యాంగం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి  ఉంటుంది? పార్లమెంటుకు

సుప్రీంకోర్టు అధికార పరిధి కిందకు వచ్చే అంశాలు ఏవి? ఒరిజినల్ అధికార పరిధి, అప్పీళ్ళ విచారణాధికారి పరిధి  మరియు సలహా రూపక అధికార పరిధి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ని నిర్వహించేది ఎవరు ? రాష్ట్రపతి లేదా ఆయన చేత నియమించబడిన అధికారి

ఇతర  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం    విషయంలో  రాష్ట్రపతి ఎవరి  సలహాను తప్పకుండా తీసుకొనవలసి ఉంటుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కావలసిన అర్హతలు ఏవి?  భారత పౌరుడై ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతలు గల న్యాయకోవిదుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి   లేదా  పది సంవత్సరాలు హైకోర్టు   న్యాయ వాదిగా పనిచేసి ఉండవలెను.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ  వయస్సు ఎంత?  65 సంవత్సరములు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి  సమర్పించవలసిన ఉంటుంది? భారత రాష్ట్రపతి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగించేందుకు, పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదించవలసి చిన్న తీర్మానాన్ని ఎలా బలపరచాలి?  మూడింట రెండు వంతుల సభ్యులు హాజరై, ఓటింగులో పాల్గొనడం ద్వారా.

న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించేందుకు వీలుందా ఒక్క ఆర్థిక అత్యవసర  పరిస్థితిలో తప్ప  జీతభత్యాలు తగ్గించడానికి వీలులేదు.

ఏ నిబంధన కింద ప్రాథమిక హక్కులకు  భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు రిట్లను జ్యారీ చేయగలదు?  32వ నిబంధన.

రాజ్యాంగం ప్రకారం  సుప్రీంకోర్టు ఏయే రిట్లను జ్యారీ చేయగలదు ?  హెబియస్ కార్పస్,  కోవారంటో, మాండమస్,  ప్రొహిబిషన్, సెర్షియోరరి.

రాజ్యాంగంలోని ఏ నిబంధన సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికార పరిధిని వివరిస్తుంది? ఆర్టికల్ 131.

సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికార పరిధి కింద ఎటువంటి  వివాదాలను పరిష్కరిస్తుంది?   కేంద్ర ప్రభుత్వానికి,ఒకటి  అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను; కేంద్ర ప్రభుత్వం,ఒకటి  లేదా కొన్ని  రాష్ట్రాలు;  మరికొన్ని రాష్ట్రాల  మధ్య వచ్చే వివాదాలు; మధ్య వచ్చే వివాదాలు.

అప్పీళ్ళను స్వీకరించే అత్యున్నత, న్యాయస్థానం ఏది?  సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు ఏయే రకాల అప్పీళ్ళను   స్వీకరిస్తుంది?  సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అప్పీళ్ళను.

సివిల్  కేసులను  సుప్రీమ్ కోర్టుకు అప్పీళ్లు చేసుకోవడానికి ఎవరు  సర్టిఫై చేయవలసి ఉంటుంది? హైకోర్టు.

రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చును?  ఆర్టికల్ 143.

సుప్రీంకోర్టు 143 వ ఆర్టికల్ కింద ఇచ్చిన  సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? వద్దా? తప్పనిసరి కాదు.

భారతదేశపు న్యాయవ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ఎటువంటిది?   స్వతంత్రమైనది.

స్వతంత్ర న్యాయవ్యవస్థ అనగానేమి?  న్యాయాధిపతులు ప్రభుత్వానికి గానీ రాజ్యాంగానికి గాని లోబడి రాజ్యాంగ రక్షకులుగా  వ్యవహరించు న్యాయవ్యవస్థను స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అభిశంసన ద్వారా  తొలగించాలంటే, ఏ మెజారిటీ ద్వారా పార్లమెంటులో  తీర్మానం చేయాలి?  ప్రత్యేక మెజారిటీ.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు  ఏ  నిధి నుండి  చెల్లింపుబడతాయి?  భారతీయ సంఘటిత  నిధి నుండి.

న్యాయసమీక్షాధికారమును ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం అయినది?  అమెరికా రాజ్యాంగం నుండి.

న్యాయసమీక్షాధికారము తొలత అమెరికా సుప్రీం కోర్టుకు ఏ కేసు ద్వారా ఏర్పడింది?  మార్బురీ Vs మ్యాడిసన్.

న్యాయసమీక్షాధికారాన్ని  సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఏ కేసులో ఉపయోగించింది?  శంకరీ ప్రసాద్ Vs  యూనియన్ ఆఫ్ ఇండియా (1951)  కేసులో.

భారతదేశంలో న్యాయసమీక్షాధికారాన్ని ఏఏ న్యాయస్థానాలు ఉపయోగించుకుంటున్నాయి?  సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు.

భారతదేశ రాజ్యాంగం లో న్యాయసమీక్షాధికారము  దేనిపై ఆధారపడి ఉంటుంది? Procedure established  by law.

సుప్రీంకోర్టును ఏ నిబంధన కింద ఏర్పాటు చేశారు? భారత  రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్.

సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి రాష్ట్రపతి ఎవరిని సంప్రదించవలసి ఉంటుంది?  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని.

సుప్రీంకోర్టుకు న్యాయసమీక్షాధికారాన్ని  ఇచ్చిన నిబంధన ఏది?  ఆర్టికల్ 13(2).

సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులను ఎవరు  నియమిస్తారు?  సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి.

భారత రాజ్యాంగ సంరక్షణకర్తగా ఎవరు వ్యవహరిస్తారు?  సుప్రీంకోర్టు.

ఏ కారణాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పార్లమెంటు  సిఫార్స్  మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు? అవినీతి, అధికార దుర్వినియోగం మరియు అసమర్థత.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?  రాష్ట్రపతి.

ప్రధాన  న్యాయమూర్తి పదవి  ఖాళీ అయినప్పుడు  సీనియర్  న్యాయమూర్తి  ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించునని  రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది?  126వ నిబంధన.

సుప్రీంకోర్టు అధికార పరిధిని పెంచు అధికారము ఎవరికీ గలదు?  పార్లమెంటుకు

సుప్రీంకోర్టు  తాత్కాలిక న్యాయమూర్తి గా  నియమింపబడటానికి  ఏ అర్హతలను కలిగి ఉండాలి?  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడటానికి కావలసిన అర్హతలను కలిగి ఉన్న హైకోర్టు న్యాయమూర్తిని ఎవరినైనా  తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించవచ్చును.


ఏ దేశపు  రాజ్యాంగాన్ని ' Lawyers Paradise'   అని అంటారు?  భారతదేశపు రాజ్యాంగాన్ని.

రాష్ట్ర హైకోర్టు అధికార పరిధిని ఎవరు  పెంచవచ్చును?  పార్లమెంటు.

హైకోర్టు లలో తాత్కాలిక న్యాయమూర్తులను  సాధారణంగా ఎప్పుడు  నియమిస్తుంటారు?   కోర్టులో పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు.

రాష్ట్ర హైకోర్టులలో రాష్ట్రపతిచే నియమించబడే   తాత్కాలిక  న్యాయమూర్తులు ఎంత కాలము పని చేయవచ్చును?  రెండు సంవత్సరములు.

ఎవరైనా న్యాయమూర్తి అస్వస్థులైతే  (ప్రధాన న్యాయమూర్తి తప్ప) తమ బాధ్యతలను నిర్వహించలేకపోయిన పక్షంలో  'ఆపద్ధర్మ న్యాయమూర్తులను' ఎవరు నియమిస్తారు?   రాష్ట్రపతి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు?  సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత  రాష్ట్ర గవర్నర్ ని.

హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు  రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ ని, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని.


హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తికి ఏ అర్హతలు ఉండాలి?  భారతదేశంలో   ఏదైనా  రాష్ట్ర హైకోర్టులో పది సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం.

ఏ నిబంధన ప్రకారం హై కోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారము రాష్ట్రపతికి కలదు ? ఆర్టికల్ 222.

హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే ఈ సమయంలో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి?   ప్రధాన న్యాయమూర్తిని.

హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను కి పంపాలి?  రాష్ట్రపతికి.

హైకోర్టు న్యాయమూర్తిని తొలగించవలెనంటే  పాటించవలసిన  పద్ధతి ఏది?  అభిశంసన తీర్మానమును  పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినప్పుడు  రాష్ట్రపతి తొలగించగలడు.

హైకోర్టు బెంచి ఏ రాష్ట్రంలోని వేరొక నగరంలో ఏర్పాటు చేయుటకు ఎవరికి అధికారము కలదు పార్లమెంటుకు

హైకోర్టుకు  గల ఒరిజినల్ అధికార పరిధిలో ఏ అంశములు ఉంటాయి?  విదేశీ సంబంధ విషయాలు, రెవెన్యూ విషయాలు, కోర్టు ధిక్కారణ, ప్రాథమిక హక్కులకు రక్షణ  మొదలైనవి.

ఏ నిబంధనను అనుసరించి క్రింది కోర్టులపై నియంత్రణాధికారము హైకోర్టుకు ఉంటుంది?  ఆర్టికల్ 227.

ఏ నిబంధన  అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్  ఏర్పాటు గురించి తెలియజేస్తుంది?  323A.

అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ హైకోర్టు అధికార పరిధి  క్రిందకు వస్తాయా? రావు.

ఏ నిబంధన ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేయగలదు?  ఆర్టికల్ 226.

రాజ్యాంగంలోని 215 నిబంధన దేని గురించి తెలియజేస్తుంది?  హైకోర్టును  కోర్టు ఆఫ్ రికార్డుగా గుర్తిస్తుంది

హైకోర్టు ఏ ఏ సందర్భాలలో రిట్లను జారీ చేయగలదు?  ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు  మరియు ఏదైనా ఇతర ప్రయోజనమునకు.

జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? గవర్నర్.

జిల్లా న్యాయమూర్తుల  నియామకము మరియు పదోన్నతి విషయాలలో గవర్నర్ ఎవరిని సంప్రదిస్తారు?  హైకోర్టు.

క్రిమినల్ కేసులకు  సంబంధించి జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సెషన్స్ న్యాయస్థానం.

ప్రజా ప్రయోజనాల  వ్యాజ్యమును ఏయే స్థానాలలో వేయవచ్చును?  హైకోర్టులు మరియు  సుప్రీంకోర్టులో.

ఏ కోర్టు, బంద్ లు  రాజ్యాంగ  వ్యతిరేకమని   తీర్పునిచ్చింది?  కేరళ హైకోర్టు.   ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా  సమర్థించింది.

ఏ రాజ్యాంగ సవరణ  వల్ల పార్లమెంటు రెండు  లేదా  అంతకన్నా  ఎక్కువ  రాష్ట్రాలకు  సమిష్టిగా   ఓకే  హైకోర్టును ఏర్పాటు  చేసే  అధికారం  పొందింది?  ఏడవ రాజ్యాంగ సవరణ  ద్వారా.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?  సుప్రీంకోర్టు.

హైకోర్టు గురించి తెలియజేయు రాజ్యాంగ నిబంధనలు ఏవి?  ఆర్టికల్స్ 214- 237.  

భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష  అధికారానికి ఆధారమేది?  ఆర్టికల్స్ 13,  32 మరియు131.

సుప్రీంకోర్టు   ప్రారంభ పరిధి నుండి  మినహాయించిన అంశాలు ఏవి?   ఆర్థిక సంఘం యొక్క  సిఫార్సులు- వివాదాలు, అంతర్రాష్ట్ర  నదీజలాల వివాదాలు.

న్యాయశాఖ క్రియాశీలతకు  కారణమేదీ  ప్రజా ప్రయోజనాల  వ్యాజ్యాలు, కార్య  నిర్వాహక శాఖ అలసత్వం మరియు అభ్యుదయ వ్యాఖ్యానాలు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు  ఎంత  ? 65 సంవత్సరాలు.

హైకోర్టు న్యాయమూర్తి  పదవి విరమణ వయస్సు  ఎంత ? 62 సంవత్సరాలు.

సుప్రీంకోర్టు న్యాయసమీక్షను భారత రాజ్యాంగం మౌలికాంశంగా, ఏ కేసులో పేర్కొన్నది?  కేశవానంద భారతి Vs  ది స్టేట్ ఆఫ్ కేరళ.

భారత రాజ్యాంగంపై  అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి గలదు?  సుప్రీమ్ కోర్టు.

సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల  మధ్య వివాదాలను పరిష్కరించటం ఏ అధికార పరిధి లోకి వస్తుంది?   ప్రారంభ అధికార పరిధి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?  రాష్ట్రపతి.

హైకోర్టు న్యాయమూర్తులను  ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి.

చట్టానికి లేదా వాస్తవానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఎప్పుడు సలహానిస్తుంది?  రాష్ట్రపతి సలహా కోరినప్పుడు మాత్రమే.

ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు  సలహాను పొందగలడు?  ఆర్టికల్ 143.

రాజ్యాంగ  వ్యాఖ్యానం  సుప్రీంకోర్టు ఈ యొక్క ఏ పరిధిలోకి  వస్తుంది?  ఆప్పీళ్ళ పరిధి.

ఆర్టికల్ 136 సుప్రీంకోర్టుకి కలిగించే అధికారం ఏమిటి స్పెషల్ లీవ్ అప్పీలు.

సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరీస్ డిక్షన్    అధికారం కలిగించే  ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 131.

ఒక రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను  నిర్ణయించేది ఎవరు?  రాష్ట్రపతి.

హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు? పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి.

సుప్రీంకోర్టు  న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో  ఎలా ఉంటాయి   ?
తగ్గించవచ్చును.

ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తాను ఇంతకుముందు ఇచ్చిన తీర్పును తనకు తానే సమీక్ష చేసుకుంటుంది?  ఆర్టికల్ 137.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తర్వాత కాలంలో మార్చవచ్చు. దీనిని ఏమంటారు ?  ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్.


No comments:

Post a Comment