పౌరసత్వ సవరణ బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ రోజున ఆమోద ముద్ర వేశారు? 12 డిసెంబర్, 2019.
పౌరసత్వ సవరణ చట్టం ఏ రోజు నుండి అమలులోకి వస్తుంది? 10 జనవరి, 2020.
విజయ్ హజారే ట్రోఫీ 2019 విజేత ఎవరు? కర్ణాటక.
ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవీకాలం ఎంత? మూడు సంవత్సరాలు.
ఇటీవల ఏ దేశం భారతీయులు వీసా లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చు నని ప్రకటించింది? బ్రెజిల్.
ఇటీవల మహారత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలేవి? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మరియు పెట్రోలియం కార్పొరేషన్.
ఇటీవల రాజ్యసభ యొక్క 250 సమావేశం ఏ తేదీన జరిగింది? 18 నవంబర్, 2019.
ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంత 100 మహిళలలో జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో ఉండగా భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ స్థానంలో నిలిచారు? 34వ స్థానం
మైండ్ మాస్టర్స్ పుస్తక రచయిత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్.
కాప్ -25వ సదస్సు ఏ దేశంలో జరిగింది? స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ నగరంలో జరిగింది.
2020 లో కాప్ -26 సదస్సు ఏ దేశంలో జరగనుంది? స్కాట్ ల్యాండ్ దేశంలోనే గ్లాస్గో నగరంలో జరగనుంది.
ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో భారతదేశం స్థానంలో నిలిచింది? 129వ స్థానం.
ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచీ 2019లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? నార్వే.
మానవాభివృద్ధి సూచి 2019 ప్రకారం ప్రపంచంలోని పేదలలో ఎంత శాతం మంది భారతదేశంలో ఉన్నారని తెలియజేస్తుంది? 28 శాతం.
ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితి గతులపై ప్రతి సంవత్సరం ఎవరు నివేదికను విడుదల చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ప్రపంచ మహిళల స్థితి గతుల నివేదిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 112 వ స్థానం.
ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నోవ స్థానంలో నిలిచింది? 112 వ స్థానం
ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అసమానతలు - 2019 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్ ల్యాండ్.
ఇటీవల విడుదలైన వేస్ట్ ల్యాండ్ అట్లాస్ - 2019 ప్రకారం దేశ మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 16.96 శాతం.
ఇటీవల విడుదలైన వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణం లో ఎంత శాతం భూమి వ్యర్థంగా ఉన్నది? 14.71 శాతం.
ఇటీవల విడుదలైన వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలలోని ఏ జిల్లాలో అత్యధికంగా భూమి వ్యర్థంగా ఉన్నది? కడప
ఇటీవల విడుదలైన వేస్ట్ ల్యాండ్ అట్లాస్ -2019 ప్రకారం దేశం లోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా భూమి వ్యర్థంగా ఉన్నది? జమ్మూ కాశ్మీర్.
వైద్యరంగంలో 2019 వ సంవత్సరానికి, నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? పీటర్ రాట్ క్లిఫ్, విలియం కేలిన్, గ్రేజ్ సీమెంజా.
No comments:
Post a Comment