జైన మతాన్ని స్థాపించింది ఎవరు? ఋషభనాధుడు. (మొదటి తీర్థంకరుడు)
జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు (24వ తీర్థంకరుడు )
జైనమత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? పార్శ్వనాధుడు (23వ తీర్థంకరుడు)
వర్ధమాన మహావీర్ ఎందుకంటే ముందుగ
ల జైనమత గురువులను ఏమంటారు? తీర్థంకరులు
జైనుల పవిత్ర సాహిత్యము ఏమని అంటారు? అనుస్తుతి
ఋగ్వేదంలో ప్రస్తావించిన ఋషభనాధుడు ఎన్నవ తీర్థంకరుడు? మొదటి
శాతవాహన రాజైన శ్రీముఖుడు ఏ మతాన్ని ఆదరించాడు? జైన మతం
బెజవాడలో నెడుంబసదిని నిర్మించి జైనమతం వారికి ఇచ్చినది ఎవరు? వేంగి చాళుక్య రాజైన కుబ్జవిష్ణువర్ధనుని భార్య అయ్యన్న మహాదేవి.
రాజరాజనరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు ఏ మతాన్ని ఆదరించాడు? జైన మతాన్ని
ధర్మవరంలో కఠికాభరణ అనే జినాలయాన్ని ఎవరు నిర్మించారు? గుణగ విజయాదిత్యుని సేనాని అయిన పాండురంగడు సమీప బంధువు దుర్గరాజు.
కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా లోని దానవులపాడు వద్ద జైన క్షేత్రాన్ని ఎవరు నిర్మించారు? రాష్ట్రకూట 3వ ఇంద్రుడు.
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ఏ మతానికి సంబంధించినది? జైన మతం
ఆంధ్రదేశపు మొట్టమొదటి జైన మతాచార్యుడు ఎవరు?కొండకుందానాచార్యుడు.
కొండకుందానాచార్యుని జన్మస్థలం ఏది? అనంతపురం జిల్లాలోని కొనకొండ్ల.
శాతవాహన యుగం లో ప్రసిద్ధి చెందిన జైనాచార్యుడు ఎవరు ? కొండకుందానాచార్యుడు
కొండకుందానాచార్యుడు కి గల ఇతర పేర్లు ఏవి? పద్మనంది భట్టారకుడు మరియు వక్రగ్రీవుడు.
కొండకుందానాచార్యుని రచనలు ఏవి? సమయసారం, ప్రవచనసారం మరియు పంచాష్టికాయసారం.
జైన మత ప్రచారానికి వజ్రగచ్ఛ లేక సరస్వతిగచ్ఛ అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు?కొండకుందానాచార్యుడు
జైన సిద్ధాంతం అయినా శ్వాద్వాదంను మొదటిసారిగా ఆంధ్రలో వ్యాప్తి చేసినది ఎవరు?కొండకుందానాచార్యుడు.
జైనమతంలో తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టిన ఆచార్యులను ఏమని అంటారు? మాపనీయులు లేదా గోప్యులు.
కళ్యాణ కారక అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఉగ్రాదిత్యుడు.
పంపకవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? వేములవాడ చాళుక్య రాజయిన రెండవ అరికేసరి/ ఇమ్మరి అరికేసరి.
విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని కన్నడంలో ఎవరు రచించారు? పంపకవి.
ఎవరి కోరిక మేరకు మహాభారతాన్ని, పంపకవి కన్నడంలోకి అనువదించాడు?అరికేసరి/ ఇమ్మరి అరికేసరి.
ఋషభనాథుడి(మొదటి తీర్థంకరుడు) జీవిత చరిత్ర అయిన ఆది పురాణంను ఎవరు రచించారు? పంపకవి
కరక్యాయల గుట్టలో చక్రేశ్వరి అనే జైన విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు? పంపకవి సోదరుడైన జినవల్లభుడు.
శనిగరంలో జినాలయంను ఎవరు నిర్మించారు? యుద్ధమల్లుడు.
జినేంద్ర పురాణంను ఎవరు రచించారు? పద్మ కవి.
రాష్ట్రకూటుల కాలంలో బాగా జనాదరణ పొందిన జైన క్షేత్రం ఏది? విజయనగరం జిల్లాలో గల రామతీర్థం.
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ జైనమత క్షేత్రాలు ఏవి? పిఠాపురం, ఆర్య వటం, బిక్కవోలు, తాటిపాక మరియు ఆత్రేయపురం.
కడప జిల్లాలోని ప్రముఖ జైన క్షేత్రాలు ఏవి? దానావులపాడు, సిద్ధవటం మరియు పేరూరు.
నెల్లూరు జిల్లాలో గల జైనమత క్షేత్రాలు ఏవి? కృష్ణపట్నం మరియు వాకాడు.
గుంటూరు జిల్లాలోని జైన మత క్షేత్రం ఏది? వడ్డమాను లేక వర్ధమాన పురం.
చాళుక్యుల కాలంలో కుల వ్యవస్థను పాటించిన అవైదిక మతం ఏది? జైన మతం.
తమిళదేశంలో ఆళ్వారుల ధాటికి నిలువలేక ఆంధ్రదేశానికి వచ్చిన వారు ఎవరు? జైనులు
కర్ణాటక దేశం నుండి జైనులు ఎవరి కాలంలో ఆంధ్రదేశానికి వలస వచ్చారు? రాష్ట్రకూట రెండవ కృష్ణుని కాలంలో.
చాళుక్య యుగం లో అభివృద్ధి చెందిన అవైదిక మతం ఏది? జైన మతం
జైన మతానికి దానాలు ఇచ్చిన తొలి చాళుక్య రాజవంశ వ్యక్తి ఎవరు? అయ్యణ మహాదేవి.
అయ్యణ మహాదేవి జైనులకు దానం చేసిన గ్రామం ఏది? ముషిని కొండ.
అయ్యణ మహాదేవి దానాన్ని తెలుపు శాసనం ఏది? మూడవ విష్ణువర్ధనుని బెజవాడ శాసనం.
చాళుక్యులలో జైనమత అభిమాని అయిన రెండవ స్త్రీ ఎవరు? అమ్మ రాజు భార్య చామకాంబ.
చామకాంబ కోరిక మేరకు అమ్మ రాజు జైనులకు దానం చేసిన గ్రామం ఏది? కలుచుంబర్రు.
బెజవాడ జినాలయానికి దానం చేయమని అమ్మ రాజును ప్రార్థించిన సేనాధిపతులు ఎవరు? భీమ వాహనులు.
విమలాదిత్యుని జైన గురువు ఎవరు? త్రికాల యోగి సిద్ధాంత దేవుడు.
చాళుక్యుల కాలంలో 500 జైన బసదులున్న ప్రదేశం ఏది? పటాన్ చెరువు
శాద్వాదాచాల సింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజు అనే బిరుదులు ఎవరికి కలవు? సోమదేవసూరికి
సోమదేవ సూరి రచించిన గ్రంధాలేవీ? యశస్తిలక, నీతికావ్యామృతం, ముక్తిచింతామణి. కథాసరిత్సాగరం
మహాభారతాన్ని ఆంధ్రీకరించిన జైన కవి ఎవరు? అదర్వణుడు.
గుంటుపల్లి గుహాలయంలో నివసించిన జైన గురువు ఎవరు? సూయన నాధుడు.
వడ్డమానులోని జైన స్థావరం గురించి పృథ్వీమూలుని శాసనం ఏది? కొండవీడు శాసనం.
కొండకుండనాచార్యుడు పూర్వ నామం ఏది? ఎల్లయ్య.
కొండకుండనాచార్యుని రచనలు ఏవి? సమయసారం, ప్రవచనసారం, పంచస్తికసారం, నియమసారం, అయనసారం, మూలాచారం, అష్ట సాహువు.
No comments:
Post a Comment