మనదేశంలో పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1953.
మన సమాఖ్య విధానాన్ని అనుసరించి స్థానిక ప్రభుత్వం ఏ జాబితాలోకి వస్తుంది? రాష్ట్ర జాబితా.
మన దేశం లో పంచాయతీరాజ్ వ్యవస్థ నీ తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్.
అశోక్ మెహతా కమిటీని జనతా ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పరిచింది? 1977.
ఆంధ్ర ప్రదేశ్ ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ విధానాన్ని ప్రారంభించింది? 1959
జి.వి.కె. రావు కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 1985.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో పంచాయతీరాజ్ వ్యవస్థలపై నియమించిన కమిటీ ఏది? ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ.
73వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగం లోని ఏ విభాగానికి చేర్చబడింది? పార్ట్ -IX
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది? ఆర్టికల్ 40
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992, ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది? పి.వి.నరసింహారావు.
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992, రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో చేర్చబడింది? 11వ షెడ్యూల్.
భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ నగరంలో స్థాపించారు? మద్రాసు.
స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేనిని అభివర్ణిస్తారు? మేయో తీర్మానం.
మనదేశంలో కంటోన్మెంట్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1924.
ఏ చట్టం ప్రకారం మనదేశంలో తొలిసారిగా స్థానిక స్వపరిపాలన అనేది ఒక ప్రొవిన్షియల్ సబ్జెక్టుగా ప్రకటించబడింది? భారత ప్రభుత్వ చట్టం, 1935.
మనదేశంలో 1907లో ఏర్పర్చిన వికేంద్రీకరణ పై రాయల్ కమిషన్ కు అధ్యక్షత వహించారు? హాబ్ హౌస్.
బొంబాయి-కలకత్తా నగరాల్లో మునిసిపల్ కార్పొరేషన్లను ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? 1726.
స్థానిక స్వపరిపాలన గురించి ఏ జాతీయ నాయకుడికి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉండేది? మహాత్మా గాంధీ.
74 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కు చేర్చబడింది? 12వ షెడ్యూల్.
కంటోన్మెంట్ బోర్డు ఎవరి ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ.
మన దేశంలోని కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని రకాలు? 3 రకాలు.
కంటోన్మెంట్ చట్టం, 1924 ను ఎవరు చేశారు? కేంద్ర శాసన వ్యవస్థ.
సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1954.
సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ కు అధ్యక్షుడిగా ఎవరు పని చేస్తారు? కేంద్ర మంత్రి.
ప్రాంత ప్రాతిపదికతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏజెన్సీలు మనదేశంలో ఏవి? టౌన్ షిప్, కంటోన్మెంట్ బోర్డు మరియు మల్టీపర్పస్ ఏజెన్సీలు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1976.
హ్యూమన్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1985.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీ.
సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ను ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు? న్యూఢిల్లీ 1967.
సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ను భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఏర్పరిచారు? నిబంధన 263.
మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వం గెజిట్ లో ప్రకటించడం ద్వారా ఏర్పరిచే నగరపాలక సంస్థ ఏది? నోటిఫైడ్ ఏరియా కమిటీ.
73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రాష్ట్రాలకు వర్తించదు? నాగాలాండ్. మేఘాలయ మరియు మిజోరాం.
బ్రిటన్ లో ఏకీకృత వర్గీకరణను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? పుల్టన్ కమిటీ.
1957లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల గురించి నియమించిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ
బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ విధానం గురించి సిఫారసు చేసింది? మూడంచెల.
దంత వాలా కమిటీ రిపోర్టు ఏ సంవత్సరంలో వెలువడింది? 1978.
హనుమంతరావు కమిటీ రిపోర్టు దేనికి సంబంధించింది? జిల్లా ప్రణాళిక.
పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ కు ప్రధాన పాత్ర ఇవ్వాలని ఏయే కమిటీలు సూచించాయి? జి. వి.కె. రావు కమిటీ, అశోక్ మెహతా కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ.
న్యాయ పంచాయతీల గురించి తొలిసారిగా ప్రస్తావించిన కమిటీ ఏది? ఎల్. ఎం. సింఘ్వీ కమిటీ.
పంచాయతీరాజ్ విధానంలో రెండంచెల వ్యవస్థ ఉండాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ.
నగర పాలిక సంస్థలకు ఆడిటింగ్ వ్యవహారాలను ఎవరూ చూస్తారు? రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ.
స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరిది? మునిసిపల్ కమిషనర్.
ఒక చిన్న పట్టణాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసే సెమీ మున్సిపల్ అధారిటీ ఏది? టౌన్ ఏరియా కమిటీ.
నగర ప్రధమ పౌరుడిగా ఎవరిని గుర్తిస్తారు? మేయర్