Wednesday, 22 January 2020

Indian Polity Bits in Telugu

మత స్వాతంత్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ లో వివరించారు? ఆర్టికల్ 25 - 28.

భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు ? ఆర్టికల్ 25.

ఆర్టికల్ 26 లో పేర్కొన్న అంశాలు ఏవి?
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో  స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మాతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు  ఉండవు.

మన  దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుండి ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తోంది? ఆర్టికల్ 27

ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ సహాయం పొందే విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిషేధిస్తుంది? ఆర్టికల్ 28

ఆర్టికల్ 25 ప్రకారం హిందువులు అంటే ఎవరు? హిందువులు, జైనులు, బౌద్ధులు మరియు సిక్కులు.

ఎస్. పి. మిట్టల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది?
1) రామకృష్ణ మఠం, కంచి కామకోటి మఠం హిందూ  మతంలో ఉపశాఖ కిందకు వస్తాయి
2) ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం కాదు.
3) అరబిందో సొసైటీ మతం కిందకు రాదు
4) ఆర్య సమాజం మతం కిందకి రాదు.

అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష లిపి సంస్కృతులను, పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆర్టికల్ 29

అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, లిపి,  సంస్కృతులను  అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెబుతోంది? ఆర్టికల్ 30.

పార్లమెంట్ రూపొందించిన చట్టం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు ఎవరు? 1) మతపరమైన అల్ప సంఖ్యాక వర్గం 2) సంస్కృతి పరమైన అల్ప సంఖ్యాక వర్గం

భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల ను నిర్ధారించేందుకు దేనిని యూనిట్ గా తీసుకుంటారు? రాష్ట్రం

మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల ను గుర్తించేందుకు దేన్ని యూనిట్ గా తీసుకుంటారు? దేశం

ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆర్టికల్ 31

ఆస్తి హక్కు గురించి సరైనవి?
1) దీన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది.
2) 1978లో 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు
3) ఇది రాజ్యాంగంలోని 12వ భాగం లో ఆర్టికల్ 300 (A) లో ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కు గా కొనసాగుతుంది.

రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

No comments:

Post a Comment