Wednesday, 15 January 2020

Bits on AP Bifurcation Act 2014

బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని టీఎంసీల నీటిని కేటాయించింది? 811

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడిన 811 టీఎంసీల నీటిలో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడిన 811 టీఎంసీల నీటిలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? 512 టీఎంసీలు

1980లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టా కి ఎంత నీటిని కేటాయించడం జరిగింది? 150 టీఎంసీలు

విభజన చట్టంలోని ఏ సెక్షన్ లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని పేర్కొనబడింది? 90వ సెక్షన్.

జాతీయ వాటర్ ప్రేమ్ వర్క్ బిల్లు 2016 ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది? 26 మే 2016

మొదటి కృష్ణ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 10 ఏప్రిల్ 1969

రాష్ట్రాల మధ్య (అంతర్రాష్ట్ర )నదీ జల వివాదాలకు సంబంధించిన  IRWD 1956 చట్టం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది? ఆర్టికల్ 262

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను ఎప్పుడు సమర్పించారు? 30 డిసెంబర్ 2010

విభజన చట్టంలోని ఏ భాగము జలవనరులను నిర్వహణ, అభివృద్ధి గురించి తెలియజేస్తుంది? 9వ

రాష్ట్రంలోనే ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి నదులను రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేసింది? పట్టిసీమ ఎత్తిపోతల పథకం

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టు ఏది? తోటపల్లి రిజర్వాయర్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందనుంది? 7.3 లక్షల ఎకరాలు

కృష్ణా నది కుడి, ఎడమ కాలువల ద్వారా ప్రస్తుత ఆంధ్ర ప్రాంతానికి ఎంత నీటి సరఫరా జరుగుతున్నది? 200 టీఎంసీలు

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 2015, మార్చి 29

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎప్పుడు విడుదల చేశారు? 6 జూలై 2016

గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 10 ఏప్రిల్ 1969

1973లో బచావత్ ట్రిబ్యునల్ ఎంత శాతం డిపెండబులిటీ ఆధారంగా కృష్ణా నదీజలాల పంపకాలు జరిపింది? 75%

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంత శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా జలాలను కేటాయించింది? 65 శాతం

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీటిని కేటాయించింది? 1001

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో ఆంధ్రప్రదేశ్ కు మిగులు జలాలపై ఉన్న హక్కును రద్దు చేయడంపై వేసిన పిటిషన్ వల్ల ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయరాదని సుప్రీంకోర్టు ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? 16 సెప్టెంబర్ 2011

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా జలాలపై గడువు పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలకు మాత్రమేనని ట్రిబ్యునల్ ఎప్పుడు తీర్పు చెప్పింది? 19 అక్టోబర్ 2016

బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన మిగులు జలాలను వినియోగించుకోవడం కోసం ఏ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ? పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకం

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎంత భూమికి సాగునీటిని అందించ వచ్చును?2.91 లక్షల హెక్టార్లు.

పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం ఎత్తు ఎంత? 45.72 మీటర్లు

పోలవరం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా ఎంత? 3,06,643 చదరపు కిలోమీటర్లు.

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు? 960

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని కిలోమీటర్ల పోలవరం కుడి కాలువను వినియోగంలోకి తెచ్చారు? 174

సిద్దాపురం ఎత్తిపోతల పథకం ద్వారా ఏ జిల్లాలోనే పంట భూములకు నీటిని అందించనున్నారు? కర్నూలు

కండలేరు ఎత్తిపోతల పథకం ద్వారా ఏ మండలానికి ప్రయోజనం చేకూర్చబడుతుంది? పాదలకూరు, చేజర్ల, వెంకటాచలం.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కిందకు వచ్చే ప్రాజెక్ట్ లేవి? మారాల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కెనాల్

పెదపాలెం ఎత్తిపోతల పథకం ఏ నదికి  సంబంధించినది? కృష్ణానది

కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి ఏ రిజర్వాయర్ ద్వారా నీటిని అందించనున్నారు? గుండ్లకమ్మ రిజర్వాయర్

పోగొండ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని ఎన్ని మండలాలకు ప్రయోజనం చేకూరనుంది? 6

అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించనున్నారు? 60,000

కడప, చిత్తూరు జిల్లాలో సాగు, త్రాగునీరు అందించడానికి నిర్మించే గండికోట రిజర్వాయర్ సామర్థ్యం ఎంత? 26.85 టీఎంసీలు

పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు ఎవరు నిధులు సమకూర్చుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నిధులు సమకూరుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అభివృద్ధి ప్రధానంగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైంది? మధ్య మరియు దక్షిణ తీర ప్రాంతం.

ప్రాథమిక రంగం లో అధిక వృద్ధిని సాధించడానికి ఆంధ్రప్రదేశ్ కు సాంకేతిక సహాయము అందించే మేధో భాగస్వామి ఎవరు? ఇక్రిశాట్

పశు సంవర్ధక రంగంలో దీనిని ప్రధాన అభివృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది? పాలు, మాంసం, గుడ్లు.

పశుసంవర్ధక రంగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దీనినే అభివృద్ధి చోదకంగా గుర్తించలేదు? ఉన్ని, చర్మం మరియు తోలు

పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో కేసులు వేసిన రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, ఒడిశా మరియు కర్ణాటక

పునర్వ్యవస్థీకరణ తరువాత నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్వహణ ఏ రాష్ట్రానికి అప్పగించడం జరిగింది? తెలంగాణ

పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం ఎంత శాతం నిధులను తమ కురుస్తుంది? 01.04.2014 నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులో నీటిపారుదల భాగపు వ్యయపు విలువ ఆధారంగా, 100% ప్రాజెక్టు వ్యయం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు నీరు చెట్టు కార్యక్రమంలో ఏ రకపు కార్యక్రమాలు చేపడుతున్నారు? చిన్నతరహా చెరువులు, కాలువలలో పూడిక తీయడం.

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వపు నీరు–చెట్టు పథకం ఉద్దేశ్యము ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ను 5 సంవత్సరములలో కరువు ముక్తి రాష్ట్రంగా చేయుట

నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయారణ్యం పరిరక్షణలో ఏ ఆదిమ తెగకు చెందిన పనివారిని వినియోగించడం జరుగుతున్నది? చెంచు

స్వల్ప కాలంలో, ఏ రంగంలో వృద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండంకెల వృద్ధిరేటు వైపు నడిపించగలదు? వ్యవసాయము

తమ వ్యవసాయ ఉత్పత్తిని నిల్వ చేసుకొని, దానిపై కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే, కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు? రైతు బంధు పథకం

పునర్వ్యవస్థీకరణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను, తెలంగాణ నుండి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది? 7

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోనే సూచన నిబంధనల అమలు కోసం కృష్ణా జలాల ట్రిబ్యునల్ కాలపరిమితిని 1.8.2016 నుండి ఎంత కాలం వరకూ పొడిగించారు? ఒక్క సంవత్సరం

పోలవరం ప్రాజెక్టు గోదావరి నుండి కృష్ణానదికి ఎన్ని టీఎంసీల నీటిని బదిలీ చేస్తుందని భావింప బడుతున్నది? 80 టీఎంసీలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నదీ జలాలను పంచుకునేందుకు అవసరమైన కార్యాచరణ పుస్తకం మరియు నియమావళిని రూపొందించడానికి కృష్ణా జలాల ట్రిబ్యునల్ కు సహకరించేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీకి నేతృత్వం వహించినది ఎవరు? ఎ. కె. బజాజ్

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రస్తుతం కృష్ణ, గోదావరి లపై సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యత ఎవరిది? ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానిది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం రెండు రాష్ట్రాలలో ఏదైనా, నదుల నిర్వహణ బోర్డు ఆదేశాలను అమలు చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? సంబంధిత రాష్ట్రం కేంద్రం విధించే ఆర్థిక ఇతర పరిహారాలు చెల్లించవలసి ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ ప్రాథమికరంగ మిషన్ ఏ రంగంపై దృష్టి కేంద్రీకరిస్తుంది? వ్యవసాయ రంగం

కృష్ణా జలాల నిర్వహణ బోర్డు చైర్మన్ ఎవరు? ఆర్.కె.sinha

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 24వ అధికరణ కింద ఏర్పాటు చేసిన కౌన్సిల్లో ఛైర్ పర్సన్ తో కలిపి మంది సభ్యులు ఉంటారు? 3

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద ఏర్పాటుచేసిన నదుల నిర్వహణ బోర్డు విధులు ఏమిటి? ప్రకటిత ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, రాష్ట్రాల వాటా ప్రకారం నీటి విడుదల మరియు కరువు, వరదల సమయంలో ప్రమాద నిర్వహణలో రెండు రాష్ట్రాలకు సలహా ఇవ్వడం

పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఉన్న పోలవరం గ్రామము జిల్లాలో ఉన్నది? పశ్చిమ గోదావరి

కృష్ణా నది జల నిర్వహణ బోర్డు కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆంధ్రప్రదేశ్ లో

పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఏ రకమైన ప్రాజెక్టు? జాతీయ ప్రాజెక్టు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి మరియు కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం ఎవరికి ఉన్నది? నదీజలాల వనరులపై ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి మరియు నియంత్రణలను ఏ విషయంలో చేపట్టింది? నీటిపారుదల

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ పని ఏమిటి? నదీజలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించుట

No comments:

Post a Comment