Monday 20 January 2020

Indian Polity Bits in Telugu

ప్రభుత్వ ఉపక్రమాల సంఘం(Committee on public undertaking) లో ఎంత మంది సభ్యులు ఉంటారు? 22 మంది (15 మంది లోక్ సభ నుండి + 7గురు రాజ్య సభ నుండి)

ప్రభుత్వ ఉపక్రమాల సంఘం ప్రధాన విధులు ఏవి? ప్రభుత్వ వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తుంది, ఈ సంస్థలు వ్యాపార సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నాయా? మరియు స్వతంత్రంగా నిలబడగలిగితే పాలనా సామర్ధ్యాన్ని చూపిస్తున్నాయా? అని పరిశీలిస్తుంది.

పార్లమెంట్ సభ్యునికి గల ప్రత్యేక వ్యక్తిగత హక్కులను పేర్కొనుము? 1)వాక్ స్వాతంత్ర్యపు హక్కు;
2) అరెస్టు నుండి స్వేచ్ఛ;
3) కోర్టులో సాక్షిగా హాజరగుట లో స్వేచ్ఛ

స్టార్ గుర్తు కలిగిన ప్రశ్నలు( Starred Questions) అనగా నేమి?
ఇటువంటి ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానములను ఇస్తారు. అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చును.

స్టార్ గుర్తు లేని ప్రశ్నలు  (unstarred Questions) అనగానేమి? ఇటువంటి ప్రశ్నలకు మంత్రులు లిఖితపూర్వక సమాధానములు ఇస్తారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ ( Point of order) అనగా నేమి? శాసనసభలో సభ్యుని ప్రసంగము సభ సూత్రాలకు అనుగుణంగా లేదంటూ ఎవరైనా సభ్యుడు అంశము లేవనెత్తే దానినే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు.

హంగ్ పార్లమెంట్ (Hung Parliament) అనగానేమి? పార్లమెంట్లో ఏ పార్టీకి అయినా మెజారిటీ రాని పక్షంలో దానిని హాంగ్ పార్లమెంట్ అంటారు.

పార్లమెంట్ సమావేశానికి కావలసిన కోరం ఎంత? 1/10 వంతు సభ్యులు

పార్లమెంటు సంవత్సరానికి సాధారణంగా ఎన్ని సమావేశాలు జరుపుతుంది? మూడు సమావేశాలు.
1)బడ్జెట్ సమావేశాలు( ఫిబ్రవరి to మార్చి)
2) వర్షాకాల సమావేశాలు( జూలై to ఆగస్ట్ )
3) శీతాకాల సమావేశాలు (నవంబర్ to డిసెంబర్)

సాధారణ మెజారిటీ (Simple majority) అనగా ఎంత ఉండాలి? పార్లమెంటులో హాజరై ఓటు చేసిన వారిలో కనీసం సగం కన్నా ఎక్కువగా ఉండాలి.

ప్రత్యేక మెజారిటీ (Absolute Majority)  అనగా ఎంత ఉండాలి? హాజరై ఓటు వేసిన వారిలో కనీసం 2/3 వ వంతు కన్నా ఎక్కువ ఉండాలి.

SC,ST లకు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను దేనికి ఉదాహరణముగా చెప్పు కొనవచ్చును? పాజిటివ్ డిస్క్రిమినేషన్(positive Discrimination).

పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదని కొన్ని కారణములు పేర్కొనుము? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన ; న్యాయసమీక్ష అధికారం; ప్రాథమిక హక్కులు; లిఖిత రాజ్యాంగం.

భారత రాజ్యాంగంలో పార్లమెంటు గూర్చి ఎక్కడ ప్రస్తావించడం జరిగింది? ఐదో భాగం రెండో అధ్యాయంలో నిబంధనలు 79 నుండి 122 వరకు.

భారత్ పార్లమెంటుతో పోలిస్తే బ్రిటిష్ పార్లమెంట్ సార్వభౌమాధికారం కలదని మరియు అపరిమిత అధికారాలను కలిగి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? ఎ.వి.డైసీ.

84వ నిబంధన ప్రకారం లోక్ సభకు ఎన్నిక కావడానికి కావలిసిన అర్హత లేవి? భారత పౌరుడై ఉండాలి; 25 సంవత్సరాల వయస్సు ఉండాలి; పార్లమెంట్ చట్టరీత్యా నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో ఉభయసభల్లో సభ్యుడిగా కొనసాగుటకు అనర్హుడు? 101.

ఒక వ్యక్తి అసెంబ్లీకి మరియు పార్లమెంటు సభ్యత్వ పదవికి రెండింటికీ ఎన్నికయి నిర్ణీత గడువులోపల అసెంబ్లీకి రాజీనామా చేయకపోతే అతడు గెలుపొందిన పార్లమెంట్ స్థానం ఖాళీ పడినట్లుగా ప్రకటించేదెవరు? రాష్ట్రపతి.

102వ నిబంధన ప్రకారం లోక్ సభ సభ్యుడుగా కొనసాగడానికి నిరోధించే అనర్హతలు ఏవి? కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని కలుగజేసే పదవిని కలిగి ఉండటం, మతిస్థిమితం లేని వాడని న్యాయస్థానం సాధికారికంగా ధృవీకరించుట, భారత పౌరసత్వం లేకపోవడం లేదా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందటం; పార్లమెంటు చట్టరీత్యా నిర్ణయించిన ఏవైనా అనర్హతలు.

42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ గడువు కాలాన్ని 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచారు. కాగా దానిని తిరిగి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాలకు తగ్గించారు? 24వ రాజ్యాంగ సవరణ 1978.
   

No comments:

Post a Comment