Sunday 26 January 2020

Indian Polity Bits for APPSC exams

జాతీయ SC కమిషన్ ఫిర్యాదులపై విచారణ ఈ క్రమంలో ఏ హోదా కలిగి ఉంటుంది? సివిల్ కోర్టు.

జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే e-మ్యాగజైన్ పేరేమిటి? అనుశూచిత్ జాతివాణి

జాతీయ షెడ్యూల్ తెగల (ST) కమిషన్ ను నిర్దేశిస్తున్న ఆర్టికల్ ఏది ?338ఎ

జాతీయ ST కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం ఎంత? మూడు సంవత్సరాలు

జాతీయ ST కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతి

మనదేశంలో జాతీయ ట్రైబల్ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 2010

జాతీయ ST కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? కున్వర్ సింగ్.

వెనకబడిన వర్గాల కోసం ప్రత్యేక కమిషన్ ను నిర్దేశిస్తున్న రాజ్యాంగపు ఆర్టికల్ ఏది? 340

భారత ప్రభుత్వం 1953లో వెనకబడిన వర్గాల వారిని గుర్తించడానికి ఏ కమిషన్ నియమించెను? కాకా కాలేల్కర్ కమిషన్

1978లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల పై నియమించిన కమిషన్ ఏది? బి.పి.మండల్

1990లో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన ప్రధాన మంత్రి ఎవరు? V.P.Singh

మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తారు? 27శాతం

భారత ప్రభుత్వం జాతీయ BC కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేసినది? 1993, ఏప్రిల్ 2.

జాతీయ BC కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం ఎంత ? మూడు సంవత్సరాలు

జాతీయ BC కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? R.N.ప్రసాద్

జాతీయ మైనారిటీ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 1993 మే 17.

జాతీయ మైనారిటీ కమిషన్ లో చైర్మన్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి

మైనారిటీ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుగును? డిసెంబర్ 18

ఏ నివేదిక ప్రకారం 1994లో  "జాతీయ మైనారిటీల అభివృద్ధి  ఆర్థిక సంస్థను " ఏర్పాటు చేశారు? గోపాల్ సింగ్

భారత ప్రభుత్వం 20 మంది సభ్యులతో కేంద్ర వక్ఫ్ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసినది? 1964

ఏ రాజ్యాంగ ప్రకరణలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి? 25-28 ప్రకరణలు.

భారత రాజ్యాంగంలో వయోజన ఓటింగ్ ను ప్రస్తావించే ప్రకరణ ఏది? 326.

రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషలను ఏ షెడ్యూల్  పేర్కొంటుంది? 8వ షెడ్యూల్.

షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి నియంత్రణాధికారాలు ఏ రాజ్యాంగ షెడ్యూల్ లో గలవు? 5వ షెడ్యూల్.

రాజ్యాంగంలో ఆర్థిక సామాజిక ప్రణాళికరణ అనే అంశాలు ఎక్కడ గలవు? ఆదేశిక సూత్రాలలో

రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రకటించెను? కేశవానంద భారతి కేసులో

భారత రాజ్యాంగంలో భారత పౌరుల ప్రాథమిక విధులను చేర్చిన సంవత్సరం ఏది? 1976

భారత రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు తెలిపింది? 3

భారత రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? 52

భారత రాజ్యాంగానికి గుండె కాయ, ఆత్మ లాంటి ప్రాథమిక హక్కును తెలిపే అధికరణ ఏది? 32

భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తించిన భాషల సంఖ్య ఎంత? 22

భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రాథమిక విధులను ప్రస్తావించినది? 51 (A).

భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో గల విషయాలు ఎన్ని? 18

భారత రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక కింద ఏర్పడినది? క్యాబినెట్ మిషన్ ప్రణాళిక.

కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ పాలన ప్రారంభమైన చట్టం ఏది? 1858 చట్టం.

భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభ దాదాపు ఎన్ని సంవత్సరాలు తీసుకుంది? 3

భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా చేర్చారు? 42.

భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు వేటిని ప్రతిబింబిస్తాయి? మానవత్వం.

భారత పౌరుల ప్రాథమిక బాధ్యతలను రాజ్యాంగంలో పొందు పరచిన సంవత్సరం ఏది? 1976.

భారత రాజ్యాంగంలో అధిక భాగానికి ఆధారం ఏది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం,1935.

భారత రాజ్యాంగంలోని  ఏ విభాగం ఆదేశిక సూత్రాలను గురించి వివరిస్తుంది? 4వ భాగం.

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రతి పౌరుని బాధ్యత వారి పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలి? 51 A
   

No comments:

Post a Comment