Sunday 19 January 2020

Indian Polity Bits in Telugu

రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250

రాజ్యసభలో ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఎంత? 238( రాష్ట్రాలు + కేంద్రపాలిత ప్రాంతాలు)

రాష్ట్రపతి రాజ్యసభకు ఏ రంగాల నుండి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తాడు? శాస్త్ర,సాహిత్య, లలిత కళలు మరియు సాంఘిక సేవ రంగాల నుండి

రాజ్యసభ స్థానాలు కేటాయింపు ఏ ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది? జనాభా ప్రాతిపదికపై

రాజ్యసభ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు? ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా అనగా ఓటును బదిలీ చేసే నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.

రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత? 6 సంవత్సరాలు.(1/3 వంతు సభ్యులు రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు)

రాజ్యసభ సభ్యుని కనీస వయస్సు ఎంత ఉండాలి? 30 సంవత్సరాలు

లోక్ సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత? 552 మంది (రాష్ట్రాల నుండి 530 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20 మంది, ఆంగ్లో ఇండియన్లు 2)

లోక్ సభ ప్రాదేశిక నియోజకవర్గాలను విభజన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను పేర్కొనండి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం లో ఏకరూపత, రాష్ట్రంలోని నియోజక వర్గాల మధ్య ఏకరూపత సాధించటం

లోక్ సభ రెండు సమావేశాలు మధ్య కాలవ్యవధి ఎంతకు మించకూడదు? ఆరు నెలలు అంటే లోక్ సభ సంవత్సరానికి రెండుసార్లు తప్పక సమావేశాలు జరపాలి.

పార్లమెంట్ సభ్యుడు ఆయా సభాపతుల అనుమతి లేకుండా ఎన్ని రోజులు సభకు గైర్హాజరు అయితే తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు? 60 రోజులు

రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు ఎప్పుడూ, ఏ నిబంధన కింద శాసనాలు చేయగలదు? 249 వ నిబంధనను అనుసరించి రాజ్యసభ ఆమోదం పొందితే రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైన అయినా పార్లమెంటు శాసనం చేయగలదు.

పార్లమెంట్ కు గల ముఖ్య అధికారం ఏది? శాసనాలను నిర్మించే అధికారం

పార్లమెంటు ఏ ఏ జాబితాలోని అంశాలపై శాసనాలు చేయగల అధికారాన్ని కలిగి ఉంటుంది? కేంద్ర జాబితా , ఉమ్మడి జాబితా.

పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎన్ని రకాలుగా ఉంటుంది? మూడు రకాలుగా.

ప్రశ్నోత్తరాల సమయం(Question hour) అనగానేమి? సభ్యులు కార్యవర్గపు కార్యకలాపాల గురించి, ప్రజల దైనందిన సమస్యల గురించి, ఇతరాత్ర విషయాల గురించి మంత్రులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడతారు.

Zero hour ప్రత్యేకత ఏమిటి? మంత్రులకు ముందుగా నోటీసు ఇవ్వనవసరం లేకుండానే సభ్యులు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు.

సావధాన తీర్మానం(Calling Attention Motion)  ఎవరి అనుమతితో మాత్రమే ప్రవేశ పెట్టవలెను? స్పీకర్.

ఏ సమయంలో సావధాన తీర్మానం ప్రవేశ పెట్టవలెను? ప్రశ్నోత్తరాల సమయం మరియు జీరో అవర్ లు ముగిసిన తరువాత, ఇతర వ్యవహారాలను పార్లమెంటు పరిశీలించుటకు ముందు, అనగా రెండింటి మధ్యలో ప్రవేశ పెట్టవలెను.

వాయిదా తీర్మానమునకు (Adjournment Motion)  కనీసం ఎంత మంది సభ్యులు మద్దతు ఇవ్వవలెను? కనీసం 50 మంది.

ఒక అత్యవసర ప్రజా సంబంధిత విషయం పైకి సభ దృష్టి  మళ్ళించడానికి ప్రవేశ పెట్టబడి తీర్మానం ఏది? వాయిదా తీర్మానం.

కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్ సభకు.

అవిశ్వాస తీర్మానం(No Confidence Motion ) ను ప్రవేశపెట్టడానికి ఎంత మంది సభ్యుల కనీస మద్దతు కావలెను? 50 మంది సభ్యులు.

అవిశ్వాస తీర్మానం మీద జరిగే ఓటింగ్ లో తీర్మానం నెగ్గితే పర్యవసానం ఏమిటి? ప్రభుత్వం రాజీనామా చేసి వైదొలగవలెను.

పన్నులను విధించుటకు, ప్రభుత్వ వ్యయాన్ని ఆమోదించుటకు ఎవరికి అధికారం ఉంటుంది? పార్లమెంటుకు.

కోత తీర్మానాలు (Cut Motion)ఎన్ని రకాలు? అవి ఏవి? మూడు రకాలు 1. పాలసీ కోత తీర్మానం 2. పొదుపు కోత తీర్మానం 3 టోకెన్ కోత తీర్మానం

పాలసీ కోత తీర్మానం(Policy Cut Motion) లో కనీసం ఎంత మొత్తం రూపాయలు తగ్గించమని కోరతారు? కోరిన మొత్తాన్ని 1రూపాయికి తగ్గించమని.

పొదుపు కోత తీర్మానం (Economy Cut Motion)  లో ఎంత మొత్తం కోత విధించమని సభ్యులు కోరతారు? కొంత నిర్ణీత మొత్తంను.

టోకెన్ కోత తీర్మానం(Token Cut Motion) లో ఎంత మొత్తంపై కోత విధించాలని తీర్మానించడమౌతుంది? 100 రూపాయలు.

ఏ నిబంధన ప్రకారం రాజ్యసభ 2/3 వంతు సభ్యులతో తీర్మానము ఆమోదించుట ద్వారా రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా శాసనం చేయుటకు పార్లమెంట్ కు శాసనాధికారం లభిస్తుంది? 249 వ నిబంధన.

రాజ్యాంగంలోని 312వ నిబంధన కింద రాజ్యసభ 2/3 వ వంతు సభ్యులతో తీర్మానమును ఆమోదించుట ద్వారా పార్లమెంటుకు ఏ అధికారాన్ని కల్పించగలదు? అఖిలభారత సర్వీసులను సృష్టించే అధికారాన్ని.

అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో లోక్ సభ రద్దయి ఉంటే అత్యవసర పరిస్థితి ప్రకటనను నిర్ణీత కాలం లోపల ఎవరు ఆమోదించవలసి ఉంటుంది? రాజ్యసభ.

రాజ్యాంగ సవరణలను ఆమోదించడానికి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చా? చేయకూడదు.
( రాజ్యాంగ సవరణ బిల్లు లకు ఉభయ సభలు విడివిడిగా తమ ఆమోదాన్ని తెలపాలి).

రాజ్యాంగం ప్రకారం మనీ బిల్లును ఏ సభలో ప్రవేశ పెట్టవలెను? లోక్ సభ .

మనీ బిల్లు మరియు ఆర్ధికాధికారాల విషయంలో ఏ సభకు ఎక్కువ అధికారాలు కలవు? లోక్ సభకు ( రాజ్యసభకు నామమాత్రపు అధికారాలు మాత్రమే కలవు ).

లోక్ సభ లో ఆమోదం పొందిన మనీ బిల్లును రాజ్యసభ ఎన్ని రోజుల వరకు తన దగ్గర ఉంచు కొనవచ్చును? 14 రోజుల వరకు.

రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు? లోక్ సభ నుండి రాజ్యసభకు బిల్లు వెళ్లి 6 నెలల సమయం దాటిపోయిన పక్షంలోనూ, రాజ్యసభ బిల్లును తిరస్కరించిన పక్షంలోనూ.

మంత్రి మండలి ఎవరికీ బాధ్యత వహించాలి? లోక్ సభకు.

ఎవరి అనుమతితో వాయిదా తీర్మానం ను ప్రవేశ పెట్టవలెను? స్పీకర్.

సాధారణ బిల్లులకు సంబంధించి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చా? ఏర్పాటు చేయవచ్చును.

రాష్ట్రపతి ప్రసంగమునకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం పార్లమెంట్లో ఆమోదింపబడకపోతే పర్యవసానం ఏమిటి? ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది.

పార్లమెంటరీ కమిటీలను ఎన్ని రకాలుగా విభజించవచ్చును? రెండు రకాలుగా 1)తాత్కాలిక కమిటీలు 2) శాశ్వత కమిటీలు

పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? స్పీకర్

పార్లమెంటరీ కమిటీలు సమావేశాల్ని నిర్వహించడానికి కావలసిన కోరం ఎంత?1/3 వ వంతు సభ్యులు.

సెలెక్ట్ కమిటీ లు ,(Select Committee) ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడతాయి? బిల్లుల పరిశీలన కొరకు

ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పరిశీలించుటకు ఏర్పాటు చేయబడ్డ పార్లమెంటరీ కమిటీలు ఏవి?
1) ప్రభుత్వ ఖాతాల సంఘం 2) అంచనాల సంఘం 3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం.

ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee) లో ఎంతమంది సభ్యులు ఉంటారు? 22 మంది (లోక్ సభ నుండి 15 మంది + రాజ్య సభ నుండి 7 మంది).

పార్లమెంటరీ కమిటీలలోని సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా.

సాంప్రదాయాన్ని అనుసరించి ప్రభుత్వ ఖాతాల సంఘానికి  ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు? ప్రతిపక్ష నాయకుడు.

పార్లమెంటరీ కమిటీలలో ఎవరికి సభ్యత్వ అర్హత లేదు? మంత్రులకు.

ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఏ నివేదిక ఆధారం? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా.

ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రధాన విధులు ఏవి? బడ్జెట్లో కేటాయించబడిన పైకం సరిగ్గా వినియోగించబడిందా? లేదా? అని పరిశీలిస్తుంది. సభ నిర్ణయించిన పరిధి దాటకుండా ప్రభుత్వ వ్యయం ఉండేటట్లుగా చూస్తుంది.

అంచనాల సంఘం లో ఎంతమంది సభ్యులు ఉంటారు? 30 మంది (30 మంది లోక్ సభ నుంచే).

అంచనాల కమిటీ (Estimates Committee)  ప్రధాన విధులు ఏవి?
ప్రభుత్వ శాఖలు పాటించవలసిన పొదుపు గురించి, పాలనా సామర్థ్యం పెంచడం గురించి, ప్రభుత్వ అంచనాలనూ ఏ రూపంలో ప్రవేశపెట్టాలో, ప్రభుత్వ నిధుల పంపిణీ సరిగ్గా జరిగిందా? లేదా అనే విషయాలను పరిశీలిస్తుంది.

No comments:

Post a Comment