భారతదేశ రాజ్యాంగం లో పౌరసత్వం గురించి ఎక్కడ వివరించారు? 2వ భాగం ఆర్టికల్ 5 నుండి 11.
భారత పార్లమెంట్ రూపొందించిన 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు? 5
మనదేశంలో ఏ కమిషన్ సిఫారసుల మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని (Dual Citizenship) కల్పిస్తూ 2003లో పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది? ఎల్. యమ్. సింఘ్వి.
పౌరసత్వ సవరణ బిల్లు (Citizenship Amendment Bill) ను భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 12 డిసెంబర్, 2019.
తాజా పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act-2019) ప్రకారం ఏ దేశం నుండి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్.
పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ మతాలవారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రైస్తవులు.
పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ తేదీ కంటే భారత్ కు వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది? 31 డిసెంబర్, 2014.
పౌరసత్వ సవరణ చట్టం 2019 ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు? పశ్చిమ బంగా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కేరళ మరియు ఢిల్లీ.
దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం జనవరి 9న.
No comments:
Post a Comment